IND vs NZ Final: ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 లో భాగంగా నేడు ఫైనల్ మ్యాచ్ దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో భారత్ వర్సెస్ న్యూజిలాండ్ జట్ల మధ్య జరుగుతుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన న్యూజిలాండ్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ క్రమంలో బ్యాటింగ్ ప్రారంభించిన న్యూజిలాండ్ జట్టు కాసేపు నిలకడగానే ఆడింది. ఈ క్రమంలో భారత్ కి బిగ్ షాక్ తగిలింది. మహమ్మద్ షమీ ఏడవ ఓవర్ బౌలింగ్ వేస్తుండగా.. న్యూజిలాండ్ బ్యాటర్ రవీంద్ర కొట్టిన బంతిని క్యాచ్ పట్టబోయిన మహమ్మద్ షమీ ఎడమ చేతికి తీవ్ర గాయం అయింది.
Also Read: IND VS NZ Final: టీమిండియా గెలవాలని వేడి వేడి మూకుడులో కూర్చున్న బుడ్డోడు !
దీంతో రక్త స్రావం జరిగింది. ఇక చికిత్స అనంతరం మహమ్మద్ షమీ తన ఓవర్ ని పూర్తి చేశాడు. ఆ ఓవర్ ముగిసిన తర్వాత షమీ మైదానాన్ని వీడాడు. అయితే జట్టులో ఇద్దరు పేసర్లు మాత్రమే ఉండడంతో కచ్చితంగా బౌలింగ్ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక గాయం పెద్దదైతే మ్యాచ్ ఫలితం పై ప్రభావం చూపే అవకాశం ఉంది. కానీ పెద్దగా గాయం కాకపోవడంతో షమీ మళ్ళీ మైదానంలోకి వచ్చి బౌలింగ్ చేస్తున్నాడు.
ఇక ఈ మ్యాచ్ లో న్యూజిలాండ్ ఇప్పటికే 3 వికెట్లు కోల్పోయింది. మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఓపెనర్ విల్ యంగ్ {15} ని పెవిలియన్ చేర్చాడు. వరుణ్ వేసిన అద్భుతమైన బంతికి యంగ్ ఎల్బీడబ్ల్యుగా వెనుదిరిగాడు. మరోవైపు రచిన్ రవీంద్ర మరోసారి అవుట్ అయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మొదట షమీ తన బౌలింగ్ లోనే క్యాచ్ వదిలేయగా.. రెండవసారి వరుణ్ చక్రవర్తి బౌలింగ్ లో శ్రేయస్ అయ్యర్ క్యాచ్ వదిలేశాడు. ఇలా రెండు క్యాచ్ లు మిస్ కావడంతో అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు.
అనంతరం బౌలింగ్ ప్రారంభించిన కుల్దీప్ యాదవ్ తన తొలి ఓవర్ లోనే భారత జట్టుకు ఊరటని కల్పించాడు. డేంజరస్ ప్లేయర్ రచిన్ రవీంద్ర {37} ని బౌల్డ్ చేశాడు. దీంతో న్యూజిలాండ్ జట్టు 10.1 ఓవర్లు ముగిసే సరికి రెండు వికెట్లను కోల్పోయి 69 పరుగులు చేసింది. ఆ తర్వాత 12వ ఓవర్ రెండవ బంతికి కుల్దీప్ యాదవ్.. న్యూజిలాండ్ కీలక ఆటగాడు కేన్ విలియమ్స్ ని ఔట్ చేశాడు.
Also Read: Shubman Gill: రోహిత్ శర్మ రిటైర్మెంట్ పై గిల్ సీరియస్.. ఎవడ్రా మీకు చెప్పిందంటూ ?
ఇక ప్రస్తుతం న్యూజిలాండ్ జట్టు 13 ఓవర్ల వద్ద 72 పరుగులకు 3 వికెట్లను కోల్పోయింది. ఇక ఈ మ్యాచ్ లో టాస్ ఓడిన అనంతరం రోహిత్ శర్మ మాట్లాడుతూ.. ” టాప్ ఏదైనా మేము పట్టించుకోము. మొదట బ్యాటింగా, మొదట బౌలింగా అని ఆలోచించడం లేదు. మాకు ఏదైనా ఒక్కటే. గతంలోనూ మేము చేజింగ్ చేసి మ్యాచ్ లు గెలిచాము. టాస్ ఎలా పడినా బాధపడొద్దని ముందుగానే డ్రెస్సింగ్ రూమ్ లో నిర్ణయించుకున్నాం” అని తెలిపాడు.
— Out Of Context Cricket (@GemsOfCricket) March 9, 2025