BigTV English

10Th Exams Fee date: 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే!

10Th Exams Fee date: 10వ త‌ర‌గ‌తి ప‌రీక్ష తేదీల షెడ్యూల్ విడుద‌ల‌.. పూర్తి వివ‌రాలు ఇవే!

10Th Exams Fee date: ప‌ద‌వ త‌ర‌గ‌తి ప‌రీక్ష ఫీజు తేదీలను తెలంగాణ ప్రాథ‌మిక విద్యామండ‌లి విడుద‌ల చేసింది. ఈ నెల 18 వ‌ర‌కు ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. 18వ తేదీ వ‌ర‌కు ఎలాంటి అద‌న‌పు రుసుము లేకుండా ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు. రూ.50 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 2 వ‌ర‌కు, రూ.200 ఆల‌స్య రుసుముతో డిసెంబ‌ర్ 12 వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. అంతే కాకుండా రూ.500 రుసుముతో డిసెంబ‌ర్ 21వ తేదీ వ‌ర‌కు అవ‌కాశం క‌ల్పించారు. 21వ తేదీనే చివ‌రి తేదీగా ప్ర‌క‌టించింది.


ఆ త‌ర‌వాత ఫీజు క‌ట్టేందుకు అవ‌కాశం లేద‌ని స్ప‌ష్టం చేశారు. ఫీజుల వివ‌రాల విష‌యానికి వ‌స్తే… రెగ్యుల‌ర్ విద్యార్థుల‌కు అన్ని స‌బ్జెక్టుల‌కు క‌లిపి రూ. 125 చెల్లించాల్సి ఉంటుంది. మూడు అంత‌కంటే ఎక్కువ స‌బ్జెక్టుల‌కు రూ.110 చెల్లించాలి. మూడు కంటే ఎక్కువ స‌బ్జెక్టులు ఉన్నా కూడా రూ.125 చెల్లించాలి. అంతేకాకుండా ఒకేష‌న‌ల్ విద్యార్థులు రూ.125తో పాటు అద‌నంగా రూ.60 చెల్లించాల్సి ఉంటుంది. 2025 మార్చి నెల‌లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించే అవ‌కాశం ఉంది. ఇదిలా ఉంటే ఇటీవ‌లే తెలంగాణ ఇంట‌ర్ ప‌రీక్ష ఫీజు షెడ్యూల్ సైతం విడుద‌లైంది. న‌వంబ‌ర్ 6వ తేదీ నుండి ప‌రీక్ష ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం క‌ల్పించారు.

అద‌న‌పు రుసుము లేకుండా న‌వంబ‌ర్ 26వ తేదీ వ‌ర‌కు ప‌రీక్ష ఫీజు చెల్లించేందుకు అవ‌కాశం ఉంది. ఆ త‌ర‌వాత చెల్లించేవారు అద‌న‌పు రుసుము చెల్లించాల్సి ఉంటుంది. ఆ త‌ర‌వాత చెల్లించే వారు ఫైన్ తో చెల్లించ‌డానికి అవ‌కాశం ఉంది. ఇక అద‌న‌పు రుసుము వివ‌రాలు చూస్తే.. రూ.100 నుండి అద‌న‌పు రుసుముతో క‌ట్టేందుకు వీలు ఉండ‌గా చివ‌రి తేదీ డిసెంబ‌ర్ 27 వ‌ర‌కు అద‌న‌పు రుసుము రూ.2000తో క‌ట్టేందుకు అవ‌కాశం ఉంది. ఆ త‌ర‌వాత ఫీజు క‌ట్టేందుకు అవ‌కాశ‌మే లేదు. కాబ‌ట్టి ప‌దోత‌ర‌గతి, ఇంట‌ర్ విద్యార్థులు గ‌డువు ముగియ‌క‌ముందే ఫీజు చెల్లించాలి.


Related News

TG Dasara Holidays: ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్.. కాలేజీలకు దసరా సెలవులు, ఎప్పటినుంచంటే?

PMAY Home Loan: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?

Jubilee Hills Bypoll: జూబ్లీహిల్స్ బైపోల్.. బీఆర్ఎస్ అభ్యర్థి మాగంటి సునీత, కేసీఆర్ ప్రకటన

KCR Health Update: మాజీ సీఎం కేసీఆర్‌కు మరోసారి అస్వస్థత

Falaknuma train: ట్రైన్‌లో ఉగ్రవాదులు.. ఘట్ కేసర్ స్టేషన్ లో నిలిపివేత, ముమ్మరంగా తనిఖీలు

CM Revanth Reddy: స్థానిక సంస్థల ఎన్నికలకు ముహూర్తం ఖరారు.. బీసీలకు 42% రిజర్వేషన్

Hyderabad News: బతుకమ్మకుంట ప్రారంభోత్సవం వాయిదా, మళ్లీ ఎప్పుడంటే..

Heavy Rain In Hyderabad: హైదరాబాద్‌లో దంచికొడుతున్న భారీ వర్షం.. ఈ ప్రాంతాలన్నీ జలమయం

Big Stories

×