KCR Health Update: తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ మరోసారి అస్వస్థకు గురయ్యారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో నివసిస్తున్న ఆయన.. గత రెండు రోజులుగా యూరిన్ ఇన్ఫెక్షన్ సమస్యతో బాధపడుతున్నట్టు సమాచారం. ఈ కారణంగా ఆయనకు స్వల్ప అస్వస్థత కలిగిందని, వైద్య పర్యవేక్షణ కొనసాగుతోందని కుటుంబ వర్గాలు చెబుతున్నాయి.
కేసీఆర్ ఆరోగ్య పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పార్టీ నాయకులు, కాడర్ ఆందోళన చెందుతున్నారు. గతంలో కూడా ఆయనకు పలు అనారోగ్య సమస్యలతో బాధపడుతూ.. యశోద ఆస్పత్రిలో వైద్యులు పరీక్షలు చేయించుకున్న విషయం తెలిసిందే.
మూడు రోజులుగా మాజీ మంత్రి హరీష్ రావు ఎర్రవల్లిలోనే ఉండి.. కేసీఆర్ ఆరోగ్యంపై సమగ్ర పర్యవేక్షణ చేస్తున్నారు. కుటుంబ సభ్యులంతా కూడా ఆయనకు అవసరమైన సాయం అందిస్తూ, పరిస్థితిని జాగ్రత్తగా గమనిస్తున్నట్టు సమాచారం. పార్టీ సీనియర్ నేతలు నిరంతరం సమాచారం అందుకుంటూ, ఫోన్ ద్వారా విచారిస్తున్నారు.
ఈ నేపథ్యంలో తెలంగాణ రాజకీయాల్లో.. కేసీఆర్ ఆరోగ్యం మరోసారి చర్చనీయాంశమైంది. ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఓటమి తర్వాత ఆయన ఫామ్ హౌస్‌లోనే ఎక్కువ సమయం గడుపుతున్నారు. పార్టీ భవిష్యత్తు వ్యూహాలపై చర్చలు కొనసాగుతున్న తరుణంలో.. ఈ ఆరోగ్య సమస్య రావడం కొంత ఆందోళన కలిగిస్తోంది. బీఆర్‌ఎస్ కార్యకర్తలు సోషల్ మీడియా వేదికల ద్వారా ఆయన త్వరగా కోలుకోవాలని ప్రార్థనలు చేస్తున్నారు.
Also Read: రాయ్‌పూర్‌లో మావోయిస్టు జంట అరెస్ట్
వైద్యుల బృందం ఎర్రవల్లికి చేరుకునే అవకాశమున్నందున, కేసీఆర్ ఆరోగ్యంపై తర్వలోనే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది.