Dharma Mahesh With BigTV: జిస్మత్ మండి గౌతమి చౌదరి–ధర్మ మహేష్ కేసులో కొత్త మలుపు తిరిగింది. ఎట్టకేలకు ఈ కేసులో ధర్మ మహేష్ ఆజ్ఞాతం వీడాడు. తాజాగా ప్రముఖ మీడియా ఛానల్ బిగ్ టీవీకి ధర్మ మహేష్ ఇంటర్య్వూ ఇచ్చాడు. తనపై గౌతమ్ చేస్తున్న ఆరోపణలను ధర్మ కొట్టిపారేశాడు. మొన్నటి వరకు వరకట్నం వేధింపులతో మొదలైన ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులోకి రీతూ చౌదరి కూడా వచ్చిది. అతడి రీతూ చౌదరితో పాటు ఎంతోమంది ఎఫైర్స్ ఉన్నాయని ఆరోపించింది. వీడియోలతో సహా ఆమె నిజాలు బయటపెట్టింది. ఇలా నెల రోజులుగా ఈ కేసు మీడియా, సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.
నెల రోజులుగా జరుగుతున్న ఈ వ్యవహరంపై ఎట్టకేలకు హీరో ధర్మ మహేష్ మౌనం వీడాడు. తాజాగా అతడు బిగ్ టీవీకి ఇంటర్య్వూ ఇచ్చాడు. లో నేను అబద్ధాలు మాట్లాడితే.. నేను కుక్క చావు చస్తా.. అదే మీ ఆరోపణలు తప్పయితే.. కుక్క చావు చస్తారా? అని లైవ్లో ధ్వజమెత్తాడు. తన భార్య తనపై చేసిన ఆరోపణలు అబద్దమని మండిపడ్డాడు. నిన్న గౌతమి చౌదరి, తన తల్లిదండ్రులతో కలిసి జర్నలిస్ట్ మూర్తికి ఇంటర్య్వూ ఇచ్చారు. ఒక ఆడపిల్ల అన్యాయం జరుగుతుంటే ముందుకు వచ్చాను అన్నాడు జర్నలిస్ట్ మూర్తి. ఒక్కసారి మాత్రమే వాళ్ల ఇంటికి వెళ్లాను అన్నాడు. కానీ, ఆయన ఎన్నోసార్లు మా ఇంటికి వెళ్లాడు.
మూర్తికి నా ఇంట్లో పనేంటి..
కానీ, ఆయన నా ఇంటికి వెళ్లడమే కాదు.. అక్కడ తింటూ రీల్స్ చేశాడు. నా కొడుకుతో డ్యాన్స్ చేస్తూ వీడియోలు చేశాడు. నేను ఆంజనేయ స్వామి మాల వేసుకుని ఉన్నాను. అప్పుడు ఆ ఇంటికి వెళ్లినప్పుడు మా అత్తగారితో ఆయన మాట్లాడుతున్నారు. అప్పుడు ఆయన నాకు 55 ఏళ్లయినా.. నా బాడీ మాత్రం 35 ఏళ్లని మాట్లాడుతున్నాడు. గౌతమి ఫ్యామిలీని ఒక్కసారి మాత్రమే కలిశా అన్నాడు. కానీ, ఆయన తరచూ వాళ్ల ఇంటికి వెళతాడు. ఇదంత ఏంటి? ఆయనకు నా ఇంట్లో ఏం పనేంటి. రౌడీలని పెట్టి ఆయన బెదిరించాడంటూ వీడియోలు కూడా బయటపెట్టారు. ఇక నాది, నా కుటుంబం పరువు తీయడమే లక్ష్యంగా గౌతమి ఆరోపణలు చేస్తుందన్నాడు.
నా కొడుక్కి ఫస్ట్ బర్త్‌డే చేయలేదు, అన్నప్రాసన చేయలేదని ఆరోపించింది. నేను బేబీ సినిమా మ్యూజిక్ డైరెక్టర్‌తో సాంగ్ కొట్టిచ్చాను. తన చేసిన డీవోపీతో కలిసి మాల్దివ్స్ వెళ్లాం. కానీ, బర్త్ చేశాను, అన్నప్రాసన కూడా చేశాను. మేము కలిసి టూర్స్, వెకేషన్స్ కూడా వెళ్లాం. రీతూ చౌదరి విషయంలో కూడా అన్ని అబద్దాలే చెప్పింది. నా కొడుకుని చూపించకుండ బాధపెడుతుంది. ఆమె చేసిన ఆరోపణల్లో అసలు నిజం లేదు. 90 శాతం అన్ని అబద్దాలే. గిస్మత్ మండి బ్రాండ్ నాదే. మండి పెట్టాలని ఆలోచన, ఐడియా, ప్లాన్ అన్ని నాయే. అది నా బ్రాండ్ అంటూ ధర్మ బయటపెట్టాడు. అంతేకాదు గౌతమి చేసిన వాట్సప్చాట్ని కూడా అతడు లైవ్లో బయటపెట్టాడు.