BigTV English

Dulquer Salmaan : కేరళ హైకోర్టుకు వెళ్లిన దుల్కర్ సల్మాన్, కస్టమ్స్ అధికారులకు సవాల్

Dulquer Salmaan : కేరళ హైకోర్టుకు వెళ్లిన దుల్కర్ సల్మాన్, కస్టమ్స్ అధికారులకు సవాల్

Dulquer Salmaan : కొందరు హీరోలకి ప్రత్యేకమైన ఇష్టాలు ఉండడం అనేది సహజంగా జరుగుతుంది. ముఖ్యంగా తెలుగు హీరో నాగచైతన్య కు కార్లు అంటే విపరీతమైన ఇష్టం. అలానే మలయాళం ఇండస్ట్రీలో ఉన్న దుల్కర్ సల్మాన్ కి కూడా కార్లు అంటే విపరీతమైన ఇష్టం.


దుల్కర్ సల్మాన్ దగ్గర దాదాపు 70 కార్లు ఉన్నాయి. ఇదే విషయాన్ని అన్ స్టాపబుల్ ( Nandamuri Balakrishna unstoppable show) అనే షోలో దర్శకుడు వెంకి అట్లూరి (Venky atluri) కూడా చెప్పారు. దుల్కర్ సల్మాన్ ఎక్కువ కార్లు కొంటారు. ఆల్మోస్ట్ ఇతని దగ్గర 70 కార్లు ఉన్నాయి. అక్కడ పెడితే తిడతారని చెప్పి హైదరాబాదులో ఫ్రెండ్స్ ఇంట్లో ఇతను కార్లు దాస్తుంటాడు. అని వెంకీ అప్పట్లో చెప్పాడు. ఎందుకు ఈ విషయాన్ని చెప్పావు అని దుల్కర్ ఆ షో లోనే వెంకీ అట్లూరిని అడిగాడు.

దుల్కర్ సల్మాన్ ఇంటిపై కస్టమ్స్ అధికారులు దాడి 

దుల్కర్ సల్మాన్ తెలుగు ప్రేక్షకులకు కూడా సుపరిచితం. తెలుగులో మహానటి (mahanati) , సీతారామం (sita ramam), లక్కీ భాస్కర్ (lucky Bhaskar) లతో వరుసగా హిట్ సినిమాలు అందుకున్నాడు దుల్కర్. చివరిగా దుల్కర్ నటించిన లక్కీ భాస్కర్ (lucky Bhaskar) సినిమా మంచి సక్సెస్ సాధించి అద్భుతమైన కలెక్షన్స్ వసూలు చేసింది. అయితే దుల్కర్ సల్మాన్ ఇంటిపైన కాస్టమ్స్ అధికారులు రైడ్స్ జరిపారు. అతను దగ్గరున్న రెండు లగ్జరీ కార్లను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.


హైకోర్టుకు చేరిన దుల్కర్ 

అయితే తాను కొనుక్కున్న లగ్జరీ కార్లు చాలా అఫీషియల్ గానే కొన్నాను అని. దానికి సంబంధించిన అన్ని పత్రాలు కూడా నా దగ్గరే ఉన్నాయి అని దుల్కర్ సల్మాన్ వాదన. అయితే కస్టమ్స్ అధికారులకు దుల్కర్ సల్మాన్ సవాల్ విసురుతూ కేరళ హైకోర్టును ఆశ్రయించినట్లు సమాచారం వినిపిస్తుంది.

స్వాధీనం చేసుకోవడానికి కారణం 

కస్టమ్స్ అధికారులు ఆ కారులను స్వాధీనం చేసుకోవడానికి ఒక బలమైన కారణం ఉంది. ఆ కార్ల రిజిస్ట్రేషన్ పేపర్స్ లో ఇండియన్ ఆర్మీ ముద్రలు, సీల్స్ లాంటివి నకిలీగా వాడినట్లు బయటపడింది.”Operation Numkhor” అనే పెద్ద ఆపరేషన్‌లో భాగంగా ఈ దాడులు జరిగాయి. భూటాన్ నుంచి అక్రమంగా తెచ్చిన లగ్జరీ కార్లు కొనుక్కోకుండా ఆపడం ఈ Operation Numkhor లక్ష్యం.ఇప్పటివరకు మొత్తం 36 హై-ఎండ్ లగ్జరీ వాహనాలు కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. వీటిలో దుల్కర్ సల్మాన్ కార్లు రెండు ఉన్నట్లు తెలుస్తుంది. ఇక దుల్కర్ సల్మాన్ సినిమాల విషయానికి వస్తే తెలుగు దర్శకుడు పవన్ సాదినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేస్తున్నాడు.

Also Read: Idli Kadai : మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబు? పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రమోషన్స్

Related News

Sai Pallavi Bikini: బికినీ ఫోటోలపై రియాక్ట్ అయిన సాయి పల్లవి. నిజంగా తీసినవే అంటూ!

STR49 : మోస్ట్ అవైటెడ్ కాంబో సెట్, శింబు కొత్త లుక్ అదిరింది 

Rishabh shetty: జై హనుమాన్ అద్భుతం… షూటింగ్ అప్డేట్ ఇచ్చిన రిషబ్!

The Paradise Film: నాని ది ప్యారడైజ్ నుంచి బిగ్ అప్డేట్… ఇది అస్సలు ఊహించలేదుగా!

Dharma Mahesh: మౌనం వీడిన హీరో ధర్మ మహేష్‌.. భార్య గౌతమిపై సంచలన కామెంట్స్‌..!

Actress Sudeepa: పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Idli Kadai : మీకు ఇలాంటి ఆలోచనలు ఎలా వస్తాయిరా బాబు? పర్ఫెక్ట్ ప్లానింగ్ ప్రమోషన్స్

Big Stories

×