Shoaib Akhtar : ఆసియా కప్ 2025 ప్రస్తుతం జరుగుతున్న విషయం తెలిసిందే. అయితే ఇవాళ శ్రీలంక తో నామమాత్రపు సూపర్ 4 మ్యాచ్ జరుగబోతుంది. అయితే సెప్టెంబర్ 28 ఆదివారం రోజు మరోసారి పాకిస్తాన్ తో ఫైనల్ మ్యాచ్ జరుగబోతుంది. ఇప్పటికే లీగ్ దశలో, సూపర్ 4 దశలో పాకిస్తాన్ తో జరిగిన పోరులో విజయం సాధించిన టీమిండియా.. ఫైనల్ లో కూడా విజయం సాధించి పాకిస్తాన్ జట్టుకి, ఆటగాళ్లకు తగిన గుణపాఠం చెప్పాలని భావిస్తోంది టీమిండియా. ఈ నేపథ్యంలో పాకిస్తాన్ మాజీ బౌలర్ షోయబ్ అక్తర్ టీమిండియా పై సంచలన కామెంట్స్ చేశాడు. ప్రస్తుతం సోషల్ మీడియాలో అతను చేసిన కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
Also Read : Asia Cup 2025 : పాక్ చెత్త ఫీల్డింగ్.. మరోసారి రుజువైంది..చేతులారా వచ్చిన రనౌట్ వదిలేశారుగా
ఆసియా కప్ 2025లో భాగంగా సూపర్ 4 మ్యాచ్ లో పాకిస్తాన్ జట్టు బంగ్లాదేశ్ అతికష్టం మీద 11 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఇప్పటికే టీమిండియా రెండు మ్యాచ్ ల్లో విజయం సాధించి ఫైనల్ కి చేరుకుంది. సెప్టెంబర్ 28న ఫైనల్ మ్యాచ్ దుబాయ్ వేదికగా జరుగనుంది. అయితేఫైనల్ కు ముందు పాకిస్తాన్ మాజీ ఫాస్ట్ బౌలర్ షోయబ్ అక్తర్.. సల్మాన్ అలీ అఘా టీమ్ కి కీలక సూచనలు చేశారు. భారత్ ను ఎలా అడ్డుకోవచ్చో వివరించాడు. “ఆ మైండ్ సెట్ నుంచి బయటపడండి. భారత్ హవాను వదిలివేయండి. వారి చుట్టూ ఉన్న ఆరా ను ఛేదించుకొని లోపలికి వెళ్లండి. ఈరోజు ఉన్నట్టుగా.. రా చూసుకుందాం అనే వైఖరితో వెళ్లండి. అలాంటి వైఖరీ మీకు చాలా అవసరం” అని సూచించారు షోయబ్ అక్తర్. ఇండియా కి కాస్త ఈగో ఎక్కువ.. వరుస రెండు ఆదివారాలు వాళ్లు గెలిస్తే.. మూడో ఆదివారం పాకిస్తాన్ విజయం సాధిస్తుందని జోస్యం చెప్పారు అక్తర్.
భారత జట్టు ఓపెనర్ అభిషేక్ వర్మ విధ్వంసకర ప్రారంభాన్ని ఇస్తున్న నేపథ్యంలో అతని గురించి ప్రత్యేకంగా ప్రస్తావించాడు అక్తర్. అభిషేక్ ను 2 ఓవర్లలోపు ఔట్ చేయాలని.. లేదంటే అతను చాలా ప్రమాదకరంగా మారుతాడు. ఈ విషయాన్ని గుర్తుంచుకోవాలని తెలిపాడు. ఇండియా జట్టును 20 ఓవర్ల పాటు ఆడనివ్వకూడదు. వెంట వెంటనే వికెట్లు తీయాలి. ఇండియా ను ఔట్ చేయడానికి వెళ్తే.. అప్పుడు ఇండియా కి కూడా అర్థం అవుతోంది. ఇక్కడమనం పోరాడి స్కోర్ చేయాలని.. అభిషేక్ 2 ఓవర్లలో ఔట్ అయితే ఇండియా కి కష్టాలు మొదలవుతాయి అని చెప్పుకొచ్చాడు షోయబ్ అక్తర్. ముక్యంగా బంగ్లాదేశ్ వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ జరిగినట్టు టీమిండియా వర్సెస్ పాకిస్తాన్ మ్యాచ్ అదే ఉత్కంఠతో జరిగితే పాకిస్తాన్ తప్పకుండా విజయం సాధిస్తుందని తెలిపాడు. బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్ లో 49 పరుగులకే పాకిస్తాన్ 5 వికెట్లు కోల్పోయింది. ఒక దశలో 100 పరుగులు కూడా చేయడం కష్టంఅనిపించింది. కానీ బంగ్లా పేలమైన ఫీల్డింగ్ కారణంగా పాకిస్తాన్ 135 పరుగులు చేయగలిగింది. 11 పరుగుల తేడాతో విజయం సాధించింది.