TG Dasara Holidays: తెలంగాణలో ఇప్పటికే స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే. 15 రోజుల పాటు పాఠశాలలకు సెలవులు ప్రకటించింది. ఇప్పటికే కొన్ని డిగ్రీ కాలేజీలకు సెలవులు ప్రకటించారు. తాజాగా జూనియర్ కాలేజీల సెలవులపై స్పష్టం వచ్చింది.
రాష్ట్రంలోని ఇంటర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి దసరా సెలవులు అని ముందుగా ప్రకటించారు. తాజాగా ప్రభుత్వం ఇంటర్ విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఒకరోజు ముందుగా సెప్టెంబర్ 27 నుంచే దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది.
ముందుగా జూనియర్ కాలేజీలకు సెప్టెంబర్ 28 నుంచి అక్టోబర్ 5వ తేదీ వరకు సెలవులు ప్రకటించారు. ఇప్పుడు అదనంగా మరో సెలవు రోజు పెంచుతూ నిర్ణయం తీసుకున్నారు. దీంతో ఇంటర్ కాలేజీలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 5 వరకు దసరా సెలవులు రాబోతున్నాయి. అంటే 9 రోజుల పాటు జూనియర్ కాలేజీలకు సెలవులు వస్తున్నాయి. అక్టోబర్ 6వ తేదీన ఇంటర్ కాలేజీలు తిరిగి ప్రారంభం కానున్నాయి.
ఈ మేరకు ఇంటర్ బోర్డు ఆదేశాలు జారీచేసింది. అన్ని కాలేజీలు దసరా సెలవుల షెడ్యూల్‌ను కచ్చితంగా పాటించాలని సూచించింది. దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్ బోర్డు సెక్రటరీ ఓ ప్రకటనలో తెలిపారు. ఎయిడెడ్ జూనియర్ కాలేజీల ప్రిన్సిపల్స్, యాజమాన్యాలు సెలవుల్లో క్లాసులు నిర్వహించే అఫిలియేషన్ రద్దు చేస్తామని హెచ్చరించారు.
మరోవైపు పాఠశాలలతో పాటు జూ.కాలేజీలకు కూడా 10 రోజుల పాటు సెలవులు ఇవ్వాలని తెలంగాణ ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది.
తెలుగు రాష్ట్రాల్లో స్కూళ్లకు ఇప్పటికే దసరా సెలవులు ప్రకటించారు. మొత్తం 15 రోజులు సెలవులు రావడంతో పిల్లల ఆనందానికి అవధుల్లేవు. సెప్టెంబర్ 21 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్కూళ్లకు దసరా సెలవులు ప్రకటించాయి. ఏపీ, తెలంగాణలో అక్టోబర్ 3న పాఠశాలలు తిరిగి తెరచుకోనున్నాయి.
Also Read: అతి తక్కువ వడ్డీకే హోం లోన్.. ఈ ప్రభుత్వ పథకం గురించి తెలుసా?
తెలంగాణలో తొలిసారి అంగన్వాడీ సిబ్బందికి సైతం దసరా సెలవులు ప్రకటించారు. స్కూళ్ల మాదిరిగానే తమకూ దసరా సెలవులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేయడంతో ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది. అంగన్‌వాడీలకు సెప్టెంబర్ 27 నుంచి అక్టోబర్ 4వ తేదీ వరకు మొత్తం 8 రోజులు పాటు దసరా సెలవులు ఇస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేశారు.