E-Paper
Advertisement

Actress Sudeepa: పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Actress Sudeepa: పెళ్లయిన 11 ఏళ్లకు బిడ్డకు జన్మనిచ్చిన నటి..ఖుషీ అవుతున్న ఫ్యాన్స్!

Actress Sudeepa: సినీనటి సుదీప(Sudeepa) అంటే పెద్దగా ఎవరు గుర్తుపట్టకపోవచ్చు కానీ పింకీ (Pinky)అంటే మాత్రం టక్కున ఈమె అందరికీ గుర్తుకు వస్తుంది. టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న సుదీప వెంకటేష్ ఆర్తి అగర్వాల్ హీరో హీరోయిన్లుగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ (Nuvvu Naku Nacchav) సినిమాలో పింకీ పాత్ర ద్వారా అందరికీ గుర్తుండిపోయింది. ఇలా పలు సినిమాలలో చైల్డ్ ఆర్టిస్టుగా నటించిన ఈమె అనంతరం హీరోలకు చెల్లెలు పాత్రలలో హీరోయిన్లకు ఫ్రెండ్ పాత్రలలో నటించి ప్రేక్షకులను మెప్పించారు. చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుదీప పెద్దయిన తరువాత క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పెద్దగా గుర్తింపు సంపాదించుకోలేకపోయింది.

ప్రేమ వివాహం చేసుకున్న సుదీప..

ఇక ప్రస్తుతం ఈమె సినిమాలకు కాస్త గ్యాప్ ఇచ్చిన సంగతి తెలిసిందే.. సుదీప కెరియర్ పక్కన పెట్టి వ్యక్తిగత విషయానికి వస్తే ఈమె రంగనాథ్ (Ranganadh)అనే వ్యక్తిని 11 సంవత్సరాల క్రితం ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. రంగనాథ్ అనే వ్యక్తిని కాలేజీ చదువుతున్న రోజుల్లోనే ప్రేమించి వివాహం చేసుకున్న ఈమె పిల్లల కోసం ఎంతో ఆరాటపడ్డారు. ఇక తన పిల్లల గురించి బిగ్ బాస్(Bigg Boss) హౌస్ లో కూడా పలు సందర్భాలలో మాట్లాడుతూ కాస్త ఎమోషనల్ అయ్యారు.

మగ బిడ్డకు జన్మనిచ్చిన నటి…

ఇలా 11 సంవత్సరాల వివాహం తరువాత సుదీప పండంటి మగ బిడ్డకు(Baby Boy) జన్మనిచ్చారు. అయితే ఈమె ఈ విషయాన్ని ఎక్కడ వెల్లడించలేదు కానీ ఇటీవల తన కొడుకు బారసాల వేడుకకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేయడంతో ఇవి కాస్త సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇలా పెళ్లయిన 11 సంవత్సరాలకు సుదీప తల్లి కావడంతో అభిమానులు కూడా సంతోషం వ్యక్తం చేస్తూ ఈమెకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఇక తమ బిడ్డతో ఈ జంట ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఈ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. సుదీప కేవలం వెండితెరపై మాత్రమే కాకుండా బుల్లితెర సీరియల్స్ లో కూడా నటించి ప్రేక్షకులను మెప్పించారు.

బిగ్ బాస్ 6 కంటెస్టెంట్ గా….

ఇలా నటిగా ఇండస్ట్రీలో కొనసాగుతున్న ఈమెకు బిగ్ బాస్ తెలుగు సీజన్ 6 కార్యక్రమంలో కూడా కంటెస్టెంట్ గా పాల్గొనే అవకాశం లభించింది. బిగ్ బాస్ కార్యక్రమంలో కొన్ని వారాలపాటు కొనసాగిన సుదీప అనంతరం ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చారు అయితే బిగ్ బాస్ తర్వాత కూడా ఈమెకు పెద్దగా సినిమా అవకాశాలు రాలేదని చెప్పాలి. బిగ్ బాస్ తర్వాత ఈమె పూర్తిగా సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. ఇకపోతే సుదీప ఎక్కడ కూడా తన ప్రెగ్నెన్సీ విషయాలను వెల్లడించలేదు కానీ ఇలా నేరుగా కొడుకు వేడుకకు సంబంధించిన ఫోటోలను షేర్ చేయడంతో అభిమానులు ఎంతో ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇక బాబు పుట్టడంతో ఈమె మరికొంత కాలం పాటు ఇండస్ట్రీకి దూరంగా ఉంటారని తెలుస్తోంది.

Also Read: Balakrishna: బాలకృష్ణ బహిరంగ క్షమాపణలు చెప్పాల్సిందే

Related News

‘డాన్ 3’ వివాదం.. రణ్‌వీర్ సింగ్‌పై ఆర్డర్ ఉపసంహరణ.. ఇంకా ముగియని గొడవ!

మెగా పవర్ స్టార్ బాక్సాఫీస్ జాతర.. ఊళ్లో సంబరాలు మామూలుగా లేవుగా..

దీపికా పదుకొణె డిప్రెషన్‌పై ప్రకాష్ పదుకొణె ఎమోషనల్.. ఏం జరిగిందంటే?

బాలీవుడ్ ప్రముఖ నిర్మాత, సీబీఎఫ్‌సీ మాజీ చీఫ్ కన్నుమూత.. ఏం జరిగిందంటే?

‘పెద్ది’ రిలీజ్ తర్వాత రామ్ చరణ్‌ను చూసి మురిసిపోతున్న మెగాస్టార్.. ఏం అన్నారంటే?

హీరో అర్జున్ ఇంట్లో త్వరలోనే పెళ్లి బాజాలు.. అల్లుడు ఎవరంటే..?

రామ్ చరణ్ ‘పెద్ది’ చూసిన తర్వాత సెలబ్రిటీల రియాక్షన్ ఇదే!..

ప్రకాష్ రాజ్‌కి బండ్ల గణేష్ ఇచ్చిపడేశాడుగా!.. ఏంటి బాసూ అలా అనేశావ్..

Big Stories

×