Secunderabad Railway Station: సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ అనగానే టక్కున గుర్తొచ్చేది. స్టేషన్ ముందు భాగాన ఉండే చారిత్రాత్మక కట్టడం. ఈ కట్టడానికి 150ఏళ్ల చరిత్ర ఉంది. అలాంటి కట్టడం ఇకపై కనుమరుగుకానుంది. రైల్వే స్టేషన్‌ను ఆధునీకరించాలని కేంద్రప్రభుత్వం తీసుకున్న నిర్ణయంలో భాగంగా.. ఈ పురాతన కట్టడాలను కూల్చేస్తున్నారు అధికారులు. ఇప్పటి వరకు స్టేషన్ వెనక భాగం పూర్తిగా కూల్చివేసి.. కొత్త భవనాల నిర్మాణం చేస్తున్నారు.
రైల్వే స్టేషన్‌కు ప్రత్యేక ఆకర్షణగా ఉండే ముందు భాగం కూల్చివేతలు కూడా అధికారులు ప్రారంభించారు. ఇది రైల్వే స్టేషన్ ప్రధాన భవనం. ఇప్పటికే స్టేషన్ ఆధునీకరణ పనులు వేగవంతంగా సాగుతున్నాయి. అనేక రైళ్లను ఇతర స్టేషన్లలో నిలుపుదల చేసి ప్రయాణికులకు సమాచారమిస్తూ సేవలందించడమే కాకుండా.. ఇక్కడికే వచ్చే లక్షలాది మంది ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బందులు కలుగకుండా చర్యలు తీసుకుంటున్నారు.
నూతన భవన నిర్మాణం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఏ విధంగానూ తీసిపోకుండా నిర్మించడమే కాకుండా… మరో వంద ఏళ్ల వరకు పెరిగే ప్రయాణికుల తాకిడిని కూడ తట్టుకునే విధంగా తీర్చిదిద్దుతున్నట్లు అధికారులు చెబుతున్నారు.
ఇక 150 సంవత్సరాల చరిత్ర కలిగిన ఈ భవనానికి ధీటుగా.. ఎటువంటి మౌళిక వసతులతో కొత్త భవనాన్ని నిర్మిస్తారో అధికారులు వేచి చూడాల్సిందే. సికింద్రాబాద్ అంటే మనందరికి గుర్తొచ్చేది రైల్వేస్టేషన్ భవన నమూనా. నగర ఆధునీకరణలో భాగంగా సిక్రింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను కూల్చివేస్తున్నారు అధికారులు. దీంతో నాటి కళా సంస్కృతికి నిలిచిన ఈ కట్టడం గత స్మృతిగా మిగిలింది. అయితే వందేళ్లకు పైగా చరిత్ర కలిగిన సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను అభివృద్ది చేయాలని కేంద్రం ఎప్పుడో నిర్ణయించింది. ఇక ఈ పనుల కోసం పురాతన కట్టడాలను కూల్చివేస్తున్నారు అధికారులు. ఈ స్టేషన్‌ను 1874లో అప్పటి నిజాం నవాబుల హయంలో సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌ను నిర్మించారు.
Also Read: తెలంగాణలో ఇక మొదలు.. సొంటిల్లు నిర్మించేవారికి గుడ్ న్యూస్
అయితే ఇది 1916 వరకు నిజాం గ్యారెండెట్ రైల్వే స్టేషన్‌కు ప్రధాన కేంద్రంగా ఉండేది. స్వాతంత్య్రం అనంతరం 19501లో దీన్ని జాతీయ పరంగం చేయడంతో.. భారత రైల్వేలో సికింద్రాబాద్ స్టేషన్ ఒక భాగం అయినట్లు చెబుతారు. ప్రస్తుతం నిజాం ఆర్కిటెక్చర్ కు అణగుణంగా కోటను పోల్ ఉండేలా అప్పటి నిజాం పాలకులు డిజైన్ చేశారు. ఇక అభివృద్దిలో భాగంగా దీన్ని కూల్చివేస్తున్నట్లు.. ఆధునిక హంగులతో కొత్త భవనాన్ని నిర్మించనున్నట్లు అధికారులు తెలిపారు.