Sand Online Booking: తెలంగాణ వ్యాప్తంగా ఆన్ లైన్ ఇసుక బుకింగ్ శుక్రవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. 24 గంటలపాటు అందుబాటులో ఉంటుంది. రీచ్‌లు, డంపింగ్ యార్డుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టింది ప్రభుత్వం. దీంతో సొంతిల్లు నిర్మించేకునే వారి కష్టాలు చాలా వరకు తీరనున్నాయి.
రేవంత్ సర్కార్ వచ్చిన కొత్తలో ప్రత్యేక ఇసుక పాలసీపై దృష్టి సారించింది. ప్రభుత్వానికి ఆదాయం సమకూర్చడంతోపాటు ప్రజల అవసరాలకు అనుకూంగా కొత్త పాలసీని తయారు చేయాలని అధికారులకు సూచన చేశారు. ఇందుకోసం ఏపీ, కర్ణాటక, తమిళనాడు వంటి రాష్ట్రాల్లో అమలు అవుతున్న ఇసుక పాలసీలపై అధ్యయనం చేయాలన్నారు.
వ్యక్తిగత, ప్రభుత్వ నిర్మాణ పనులకు తెలంగాణలో ఇసుక అస్సలు దొరకడం లేదు. అంతా బ్లాక్ మార్కెట్లోకి వెళ్లిపోతోంది. అక్రమంగా మిగతా రాష్ట్రాలకు తరలిపోతోంది. భారీ వర్షాలకు మూసీ ప్రాజెక్టు నిండిపోయింది. నదిలో నీరు ప్రవహిస్తుండటంతో ఇసుక లభించడం కష్టంగా మారింది.
ఇలాంటి కారణాలతో ఇసుక ధరలు భారీగా పెరిగాయి. దీంతో పేదలకు తమ ఇళ్ల నిర్మాణాలు భారంగా మారాయి. పరిస్థితి గమనించిన ప్రభుత్వం పలుమార్లు అధికారులతో సమావేశాలు, వారి నుంచి వచ్చిన ఫీడ్ బ్యాక్ తీసుకుంది. ఆ తర్వాత ఆన్‌లైన్ ద్వారా ఇసుకను బుక్ చేసే వ్యవస్థకు శ్రీకారం చుట్టింది.
ALSO READ: బీజేపీ టార్గెట్.. బీఆర్ఎస్ ఉక్కిరి బిక్కిరి, ఎందుకు?
ఇలాంటి పరిస్థితుల నుంచి సామాన్యులు బయటపడేందుకు ఇసుకపై ఫోకస్ చేసింది కాంగ్రెస్ ప్రభుత్వం. రాష్ట్రంలో ఇవాళ నుంచి 24 గంటలూ ఆన్ లైన్ ఇసుక బుకింగ్ ఏర్పాటు చేసింది. ఈ విషయాన్ని గనుల శాఖ ముఖ్య కార్యదర్శి శ్రీధర్ తెలిపారు. రీచ్‌లు, డంపింగ్ యార్డుల నుంచి ఇసుక అక్రమ రవాణా జరగకుండా చర్యలు చేపట్టింది. అక్రమ రవాణా కట్టడికి ప్రత్యేకంగా బృందాలను నియమించింది.
ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి.. అధికారులతో సమావేశం నిర్వహించారు. ఇసుక మాఫియాపై ఉక్కుపాదం మోపాలన్నారు. ఇసుక రీచ్‌ల వద్ద తనిఖీలు చేపట్టాలన్నారు. ఇసుక అక్రమ రవాణాకు పాల్పడితే ఎంతటి వారినైనా ఉపేక్షించవద్దని ఆదేశించారు. జిల్లాల వారీగా కలెక్టర్లు, ఎస్పీలకు బాధ్యతలు అప్పగించారు.
ఇక హైదరాబాద్ పరిసరాల్లో ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసే బాధ్యత హైడ్రాకు అప్పగించింది ప్రభుత్వం. ఇసుక అక్రమ రవాణాపై విజిలెన్స్, ఎన్‌ఫోర్స్‌మెంట్ ఏర్పాటు చేసింది. ఒక్క మాటలో చెప్పాలంటే ప్రతీ ఇసుక రీచ్‌ల వద్ద 360 డిగ్రీల కెమెరాలు, సోలార్ లైట్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు.
అధిక లోడ్ లారీలను అనుమతించకూడదని నిర్ణయించారు అధికారులు. ఈ మేరకు గనుల శాఖ ఏడీలు, డీడీలు, టీజీఎండీసీ ప్రాజెక్ట్ డైరెక్టర్లను ఆదేశించారు ముఖ్య కార్యదర్శి. వివిధ ప్రాజెక్టులకు సంబంధించి ఇసుక వినియోగంపై వివరాలను మార్చి 31 లోపు సమర్పించాలని జాతీయ రహదారులు, ఆర్ అండ్ బీ, టీజీఎంఎస్‌ఐడీసీ, సాగునీటి, పంచాయతీరాజ్ శాఖలను కోరారు.
వచ్చే ఫైనాన్షియల్ ఇయర్‌కు నెల వారీగా కావాల్సిన ఇసుకపై వివరాలు ఇవ్వాలని సూచించారు. అటు ఇసుక అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కఠినంగా వ్యవహరించాలని సీఎం రేవంత్‌రెడ్డి ఆదేశించడంతో అధికారుల్లో కదలిక వచ్చింది. మొత్తానికి ఇల్లీగల్ ఇసుక దందాను అడ్డుకట్ట పడనుంది.