GOLD: 2000 నోటు రద్దు. సడెన్‌గా ప్రకటించినా సామాన్యులెవరూ షాక్ అవలేదు. చాలామంది దగ్గర 2వేల నోట్లు లేవు. ఈ న్యూస్ రిచ్ పీపుల్‌కి మాత్రం కచ్చితంగా షాకింగే. సంపన్నులో అనేక మంది దగ్గర పింక్ నోట్లు ఉన్నాయి మరి. ఇప్పుడెలా? ఆ నోట్లను ఏం చేయాలి?
దాచుకోడానికే కదా పెద్ద నోట్లను ఇంట్లో పెట్టుకుంది. వాటిని మళ్లీ బ్యాంకులో వేస్తే ఖర్చైపోవు. అందుకే, అలాంటి వారంతా బంపర్ స్ట్రాటజీ ఫాలో అవుతున్నారు. అదే బంగారం కొనుగోలు.
అవును, 2వేల నోట్లు రద్దు నిర్ణయం వచ్చినప్పటి నుంచీ.. అనూహ్యంగా బంగారు ఆభరణాల అమ్మకాలు పెరిగాయి. జ్యువెల్లరీ షాపుల్లో రద్దీ మరింత పెరిగింది. పెళ్లిళ్ల సీజన్‌కు 2వేల నోట్ల రద్దు తోడవడంతో.. పండుగ చేసుకుంటున్నారు.
బయట ఏ షాపులోనూ 2వేల నోటు ఇస్తే తీసుకోవడం లేదు. మాకొద్దంటే మాకొద్దంటూ రిజెక్ట్ చేస్తున్నారు. కానీ, గోల్డ్ షాప్స్‌లో మాత్రం ప్రత్యేకంగా బోర్డులు కూడా పెడుతున్నారు. ఇచ్చట 2000 నోట్లు తీసుకోబడును.. అంటూ పెద్ద పెద్ద అక్షరాలతో రాస్తున్నారు. పెద్ద నోట్లతో వచ్చే వారిని రారమ్మంటూ ఆహ్వానిస్తున్నారు. ఇంకేం, బ్యాంకులకు వెళ్లి, క్యూ లైన్లలో నిల్చొని.. కొద్ది కొద్దిగా మార్చుకునే బదులు.. ఒకేసారి, ఎంతంటే అంత మొత్తం.. బంగారం కొనడం ఈజీగా మారింది. సులువుగా పనైపోతోంది. అందుకే, 2వేల నోట్లు ఉన్న చాలామంది.. గోల్డ్ షాపింగ్‌కే ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు.
దేశవ్యాప్తంగా అనేక నగరాలలో శనివారం ఒక్కరోజులోనే 50% ఎక్కువ బిజినెస్ జరిగినట్టు చెబుతున్నారు. ఆ తర్వాత కూడా ఆ సేల్స్ అలానే కంటిన్యూ అవుతున్నాయని అంటున్నారు. గతంలో 500, 1000 నోట్ల రద్దు చేసినప్పుడూ ఇలానే జరిగిందని గుర్తు చేస్తున్నారు. మరోసారి 2వేల నోట్ల రద్దుతో.. గోల్డ్ బిజినెస్ అమాంతం పెరిగింది. ఐడియా అదిరింది కదూ.