BigTV English
Advertisement

Nitrate: నైట్రేట్.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?.. శాస్త్రవేత్తల అయోమయం..

Nitrate: నైట్రేట్.. ఆరోగ్యానికి మంచిదా? కాదా?.. శాస్త్రవేత్తల అయోమయం..

Nitrate: మనం తినే ఆహారం అనేది మన ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుందని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ విషయాన్ని ఇప్పటికే శాస్త్రవేత్తలు ఎన్నోసార్లు నిర్ధారించారు కూడా. అందుకే గత కొన్నేళ్లుగా చాలామంది పర్ఫెక్ట్ డైట్‌ను ఫాలో అవుతూ వారి ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ పెడుతున్నారు. కానీ కొన్ని ఆహార పదార్థాలు ఎంత మేలు చేస్తాయో.. అంతే కీడు కూడా చేస్తాయని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. అలాంటి వాటిలో ఒకటి నైట్రేట్.


నైట్రేట్ అనేది ఆరోగ్యానికి పూర్తిగా మంచి చేస్తుందా? లేదా పూర్తిగా చెడు చేస్తుందా? అనే విషయాన్ని శాస్త్రవేత్తలు సైతం పూర్తిగా కనిపెట్టలేకపోయారు. నైట్రేట్‌పై ఎన్నో ఏళ్లుగా పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. కొంతకాలం క్రితం ఇది క్యాన్సర్‌కు దారితీస్తుందని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. వారు చేసిన పరిశోధనల్లోనే నైట్రేట్ అనేది గుండెకు ఆరోగ్యాన్ని అందిస్తుందని కూడా తేలింది. దీంతో శాస్త్రవేత్తలు సైతం అయోమయంలో పడ్డారు.

గుండె సంబంధిత వ్యాధులు, డిమెన్షియా, డయాబెటీస్ లాంటివి తగ్గించే విషయంలో నైట్రేట్ అనేది ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు చెప్తున్నారు. ఇప్పటివరకు ఒకే విధంగా ఆరోగ్యానికి మంచి, చెడు.. ఇలా రెండు రకాలుగా ప్రభావం చూపించే డైట్‌ను వారు ఇప్పటివరకు చూడలేదని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. నైట్రేట్ అనేది ఎక్కడ నుండి ఏర్పడుతుంది అనేది అనేక ప్రశ్నలకు సమాధానం అందిస్తుందని వారు భావించారు. ఆ కోణంలో వారు పరిశోధనలు చేయడం మొదలుపెట్టారు.


నైట్రేట్ అనేది మాంసం, నీరు, కూరగాయలు లాంటివి ఎక్కువగా తినడం వల్ల శరీరంలోకి ప్రవేశిస్తుందని శాస్త్రవేత్తలు గమనించారు. కానీ ఆశ్చర్యం కలిగించే విషయం ఏంటంటే నైట్రేట్ అనేది ఎక్కువగా గుండె సంబంధిత వ్యాధులకు ఉపయోగపడుతుందనే నిరూపణ అయ్యింది తప్పా దాని వల్ల ప్రమాదాలు కలుగుతాయని సైంటిఫిక్‌గా నిరూపణ కాలేదు. కానీ 1970 నుండి నైట్రేల్ వల్ల ఆరోగ్యంపై చెడు ప్రభావం పడుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరిస్తూనే ఉన్నారు.

ప్రస్తుతం ప్రజలు నైట్రేట్‌ను తీసుకోవాలా వద్దా అనే అయోమయంలో ఉన్నారు. దానికి శాస్త్రవేత్తలు ఒక సలహాను అందించారు. కూరగాయల ద్వారా నైట్రేట్ శరీరంలోకి వెళ్లడం మంచిదే కానీ అది ఎక్కువ మోతాదులో తీసుకోవడం మంచిది కాదని వారు చెప్తున్నారు. ఇక మాంసం విషయానికి వస్తే.. అది ఎక్కువగా తినడం మంచిది కాదని ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపణ అయ్యింది కానీ అందులో ఉన్న నైట్రేట్ వల్ల అది ప్రమాదకరంగా మారుతుందా అన్న విషయాన్ని చెప్పలేమని అన్నారు. అంటే నైట్రేట్ తక్కువ మోతాదులో తీసుకుంటే ఎటువంటి ప్రమాదం జరగదని శాస్త్రవేత్తలు చెప్తున్నారు.

Related News

Hyderabad Murder: ఇంటి పెద్ద దిక్కున కోల్పోయామంటూ మురళీకృష్ణ భార్య ఆవేదన!

Premante Teaser:భార్యాభర్తల మధ్య గొడవలతో ప్రేమంటే టీజర్.. కీలక పాత్రలో సుమ కనకాల!

SBI Recruitment: ఎస్బీఐలో స్పెషలిస్ట్ కేడర్ ఆఫీసర్ ఉద్యోగాలు.. ఈ జాబ్ కొడితే రూ.20లక్షల జీతం భయ్యా, ఈ అర్హత ఉంటే చాలు..!

Bigg Boss 9 Promo: రణరంగంలా ఉన్న హౌజ్ లో ఒక్కసారిగా నవ్వులు.. ఇమ్మాన్యుయేల్ ఏం చేశాడో చూడండి..

Grokipedia: అన్నంత పని చేసిన మస్క్ మావా.. వికీపీడియాకు పోటీ ఇదే!

Sunflower Seeds: సన్‌ఫ్లవర్ సీడ్స్‌తో మ్యాజిక్.. బ్యూటీ పార్లర్లకి వెళ్లరిక!

Moto X30 Pro 5G: 8000ఎంఏహెచ్ బ్యాటరీ, 300MP కెమెరా.. మార్కెట్‌లో దుమ్మురేపుతున్న మోటో ఎక్స్30 ప్రో

CP Sajjanar: రౌడీలు, స్నాచర్స్‌పై ఉక్కుపాదం మోపుతాం.. చాదర్‌ఘాట్ కాల్పుల ఘటనపై స్పందించిన సీపీ సజ్జనార్

Big Stories

×