E-Paper
Advertisement

Telangana : పండుగ వేళ పుట్టెడు దుఃఖం.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి

Telangana : పండుగ వేళ పుట్టెడు దుఃఖం.. వేర్వేరు ప్రమాదాల్లో నలుగురు మృతి
Advertisement

Telangana : సంక్రాంతి పండుగ శోభ మొదలైంది. పట్టణాలు పల్లెబాట పట్టాయి. ఊరూరా భోగి, సంక్రాంతి వేడుకలకు సిద్ధమవుతున్న వేళ.. ఊహించని రోడ్డు ప్రమాదాలు కొన్ని కుటుంబాల్లో విషాదాన్ని నింపాయి. తెలంగాణలో జరిగిన వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో నలుగురు మృతి చెందారు.

సైకిల్ ని బైక్ వేగంగా ఢీ కొట్టడంతో ఇద్దరు వ్యక్తులు మృతి చెందిన ఘటన కామారెడ్డి జిల్లా భిక్కనూరు మండలం జంగంపల్లి గ్రామ శివారులోని రోడ్డుపై జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నిఖిల్ రెడ్డి (25) అనే యువకుడు తన స్నేహితుడు సుమంత్ తో కలిసి బైక్ పై వేగంగా వెళ్తుండగా సైకిల్ పై ఉన్న వెంకట్ (43) అనే వ్యక్తిని ఢీ కొట్టాడు. దాంతో వెంకట్ , నిఖిల్ అక్కడికక్కడే మృతి చెందారు. సుమంత్ కు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలపాలైన సుమంత్ ను కామారెడ్డి గవర్నమెంట్ ఏరియా హాస్పిటల్ కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

ములుగు జిల్లా తాడ్వాయి మండలం నాపల్లిలో జరిగిన మరో రోడ్డుప్రమాదంలో నలుగురు మృతి చెందారు. బైక్ వెళ్తూ.. ప్రమాదవశాత్తు చెట్టును ఢీ కొనడంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మరణించారు. మృతులు హనుమకొండ జిల్లాలోని పత్తిపాకకు చెందిన పోతుగంటి వంశీ(23), ఎల్తూరి పవన్(22) గా గుర్తించారు. పోలీసులు ఘటనా ప్రాంతానికి చేరుకుని మృతదేహాలను పోస్టుమార్టం కు తరలించారు.

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×