E-Paper
Advertisement

TSPSC : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. మరో 4 నోటిఫికేషన్లు విడుదల..

TSPSC : తెలంగాణలో ఉద్యోగాల జాతర.. మరో 4 నోటిఫికేషన్లు విడుదల..
Advertisement

TSPSC : తెలంగాణలో కొలువుల జాతర కొనసాగుతోంది. TSPSC వరుసగా నోటిఫికేషన్లు జారీ చేస్తోంది. తాజాగా మరో నాలుగు ఉద్యోగ నోటిఫికేషన్లు విడుదల చేసింది. పురపాలకశాఖలో 78 పోస్టుల భర్తీకి టీఎస్‌పీఎస్సీ ప్రకటన విడుదల చేసింది. ఇందులో 64 సీనియర్‌ అకౌంటెంట్‌, 13 జూనియర్‌ అకౌంటెంట్‌, ఒక అకౌంట్స్‌ ఆఫీసర్‌ పోస్టులు ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు జనవరి 20 నుంచి ఫిబ్రవరి 11 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

విద్యాశాఖలో 71 లైబ్రేరియన్‌ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది.‌ ఇంటర్‌ కమిషనరేట్‌లో 40 లైబ్రేరియన్‌ పోస్టులు, సాంకేతిక విద్యాశాఖలో 31 లైబ్రేరియన్‌ పోస్టులు భర్తీ చేయనున్నారు. జనవరి 21 నుంచి ఫిబ్రవరి 10 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు.

Advertisement

కళాశాల విద్యాశాఖలో 544 ఉద్యోగాల భర్తీకి టీఎస్‌పీఎస్సీ మరో నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ కాలేజీల్లో లెక్చరర్లు, ఫిజికల్‌ డైరెక్టర్లు, లైబ్రేరియన్ల పోస్టులను భర్తీ చేయనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 20 వరకు దరఖాస్తులు స్వీకరిస్తారు. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.

113 అసిస్టెంట్‌ మోటర్‌ వెహికల్‌ ఇన్‌స్పెక్టర్ పోస్టుల భర్తీకి టీఎస్‌ పీఎస్సీ నోటిఫికేషన్‌ విడుదల చేసింది. ఫిబ్రవరి 1 నుంచి ఏప్రిల్‌ 23 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు. మే లేదా జూన్‌లో నియామక పరీక్ష నిర్వహించనున్నారు.

Related News

7 వేల ఉద్యోగాలకు.. సర్కార్ గ్రీన్ సిగ్నల్!

బ్యాంక్ ఉద్యోగమే మీ లక్ష్యమా? 6,715 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల

జయశంకర్ వర్సిటీలో అడ్మిషన్లు.. అప్లై చేయడానికి లాస్ట్ డేట్ ఇదే!

బ్యాంక్ ఆఫ్ బరోడాలో భారీ నోటిఫికేషన్.. 104 ప్రొఫెషనల్ ఉద్యోగాల భర్తీ!

AP EAPCET Result-2026: ఏపీలో ఈఏపీసెట్ ఫలితాలు.. ఇంజనీరింగ్‌లో 70 శాతం పైగా ఉత్తీర్ణత, మంత్రి శుభాకాంక్షలు

Hyderabad: విద్యార్థులకు అలర్ట్.. జులై 2 నుంచి తెలంగాణ పీజీఈసెట్‌ కౌన్సెలింగ్

టీజీ సీపీగెట్ ఎగ్జామ్ షెడ్యూల్ విడుదల

ఇంజనీరింగ్ కౌన్సెలింగ్.. నేటి నుంచి వెబ్ ఆప్షన్ల నమోదు

Big Stories

Advertisement
×