BigTV English
Advertisement

Telangana’s Siddi vinayaka Temple: తెలంగాణలో భూసిద్ది వినాయకుడు

Telangana’s Siddi vinayaka Temple: తెలంగాణలో భూసిద్ది వినాయకుడు

Telangana’s Siddi vinayaka Temple : తెలంగాణలోను కాణిపాకం వినాయకుడు ఉన్నాడు. స్వయం భూ సిద్దివినాయకుడి ఆలయాల్లో తెలుగు రాష్ట్రాల్లో రెండు ఉండగా..ఒకటి ఆంధ్రప్రదేశ్‌లోని చిత్తూరు జిల్లా కాణిపాకం ఆలయం ఒకటి. రెండోది సంగారెడ్డి జిల్లా రేజింతల్ సిద్ధివినాయక ఆలయం. స్వయం భూగా వెలసిన గణనాధుడు భక్తులకు కోరిన కోర్కెలు నెరవేరుస్తాడని భక్తుల విశ్వాసం. గర్భాలయంలో ఉండే ఈ స్వామి దక్షిణాభిముఖుడై దర్శనమిస్తాడు. ఈ సిద్ధివినాయకుని రూసం చిన్న కొండలాంటి రాతిమీద అస్పష్టంగా ఉంటుంది. ఏటా సిద్ధి వినాయకుడి జయంతోత్సవాలను ఘనంగా జరుపుతుంటారు. ఉత్సవాల సమయంలో కర్ణాటక , మహారాష్ట్రకు చెందిన వేలాది మంది భక్తులు తరలివస్తారు. 208 ఏళ్ల క్రితం రేజింతల్ సిద్ధివినాయక ఆలయం నిర్మాణం జరిగింది. అప్పట్లో ఈ ప్రాంతం దట్టమైన కీకారణ్యంగా ఉండేది.


కొన్ని సంవత్సరాల క్రితం కంచి కామకోటి పీఠం ఆధ్వర్యంలో ఆలయ కమిటీ ఏర్పడింది. ఆ తర్వాత సిద్ధివినాయక ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. గర్భగుడిలో ఉన్న సిద్ధివినాయకుడి విగ్రహం ఏటా పెరుగుతూ వస్తోంది . స్వామి వారి విగ్రహం వెలిసినప్పుడు రెండున్నర అడుగుల ఎత్తు ఉంటే, ఇప్పుడు ఐదున్నర అడు గుల ఎత్తు, ఆరు అడుగుల వెడల్పు అయ్యిందని భక్తులు చెబుతున్నారు. స్వామి వారి విగ్రహం దక్షిణ వైపు ముఖం ఉండడం, సింధూర వర్ణం పూయడంతో ఆంజనేయస్వా మిగా కనిపిస్తాడు.

ఈ ఆలయంలోను సిద్ధివినాయకునికి పైన ఉండే ఛత్రం ఎంతో ఆకర్షణీయంగా ఉంటుంది. వెనుకన సువర్ణ మకరతోరణం, దిగువన రజిత మకరతోరణంతో పాటు సూక్ష్మగణపతి విగ్రహం కూడా ఉంటుంది.సంకటహర చతుర్దశి, మంగళవారం కలిసి వస్తే ఇంకా విశేషంగా వేడుకలు జరుగుతాయి. పుష్య శుద్ధ పాడ్యమి నుంచి… పుష్య శుద్ధ చతుర్దశి వరకూ శ్రీ సిద్ధివినాయక స్వామివారి జన్మదినోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతాయి.


Tags

Related News

Karthika Masam 2025: కార్తీక మాసం చివరి సోమవారం.. ఇలా పూజ చేస్తే శివయ్య అనుగ్రహం

Shani Puja: ఈ నాలుగు పనులు చేశారంటే శని దేవుడు మీ కష్టాలన్నీ తీర్చేస్తాడు

Vastu tips: మహిళలు నిలబడి చేయకూడని పనులు ఇవన్నీ.. చేస్తే పాపం చుట్టుకుంటుంది

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Big Stories

×