BigTV English

Telangana Navodayas: సూపర్ న్యూస్.. తెలంగాణకు కొత్తగా 7 నవోదయ స్కూళ్లు.. ఏ జిల్లాల్లో అంటే?

Telangana Navodayas: సూపర్ న్యూస్.. తెలంగాణకు కొత్తగా 7 నవోదయ స్కూళ్లు.. ఏ జిల్లాల్లో అంటే?

Telangana Navodayas: తెలంగాణ రాష్ట్రానికి కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రాష్ట్రంలో విద్యాభివృద్ధి కోసం కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. తెలంగాణకు కొత్తగా మరో ఏడు జవహర్ నవోదయ విద్యాలయాలను మంజూరు చేసింది. ఈ మేరకు అధికారిక ఉత్తర్వులను కూడా జారీ చేసింది. 2024 డిసెంబర్ లోనే.. ఈ కొత్త విద్యాలయాల ఏర్పాటు చేసేందుకు సూత్రప్రాయంగా ఆమోదం లిభించింది. అయితే ఇప్పుడు పరిపాలనాపరమైన అనుమతులు ఖరారయ్యాయి. ఈ నవోదయ విద్యాలయాల మంజూరుతో రాష్ట్రంలో మరింత నాణ్యమైన విద్య పిల్లలకు అందుబాటులో రానుంది. ముఖ్యంగా గ్రామీన ప్రాంత పిల్లలకు ఇది అద్భుతమైన అవకాశం అనే చెప్పవచ్చు.


ఈ ఏడు జిల్లాల్లో నవోదయ విద్యాలయాలు

కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసిన ఈ ఏడు నవోదయ విద్యాలయాలు తెలంగాణలోని ఏడు జిల్లాలు ఏర్పాటు చేయనున్నారు. జగిత్యాల, భద్రాద్రి కొత్తగూడెం, మహబూబ్‌నగర్, మేడ్చల్ మల్కాజిగిరి, నిజామాబాద్, సూర్యాపేట, సంగారెడ్డి జిల్లాల్లో ఈ నవోదయ విద్యాలయాలు మంజూరు అయ్యాయి. ప్రస్తుతం తెలంగాణలో 9 జిల్లాల్లో నవోదయ స్కూల్స్ ఉన్నాయి. కరీంనగర్, వరంగల్, సిద్దిపేట, ఖమ్మం, కొమురం భీం ఆసిఫాబాద్,  నాగర్ కర్నూల్, నల్గొండ, కామారెడ్డి, రంగారెడ్డి జిల్లాలో నవోదయ స్కూల్ ఇప్పటికే ఉన్నాయి. కొత్త వాటితో రాష్ట్రంలో నవోదయ పాఠశాలల సంఖ్య 16 చేరనుంది.


రూ.2359 కోట్ల ఖర్చు..

ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన నిర్వహించిన కేబినెట్ భేటీ ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు. దేశ వ్యాప్తంగా మొత్తం 28 కొత్త నవోదయ విద్యాలయాలు, 85 కేంద్రీయ విద్యాలయాల ఏర్పాటుకు మంత్రివర్గం ఆమోద ముద్ర వేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలోనే తెలంలగాణకు ఏడు నవోదయ విద్యాలయాలు దక్కాయి. ఈ కొత్త స్కూళ్లను ఏర్పాటు చేసేందుకు 2024-29 మధ్య కాలంలో సుమారు రూ.2359 కోట్ల ఖర్చు అవుతోందని అంచనా వేశారు.

ALSO READ: SSC Notification: జస్ట్ పది పాసైతే చాలు భయ్యా.. 2423 ఉద్యోగాలు.. భారీ వేతనం, డోంట్ మిస్

జులై 14 నుంచి క్లాసెస్ స్టార్ట్

ఇందులో భవన నిర్మాణాలకు కోసం రూ.1944 కోట్లు ఖర్చుకాగా.. నిర్వహణ కోసం రూ.415 కోట్లు ఖర్చు అవ్వనుందని కేంద్రం అంచనా వేసింది. తెలంగాణ విద్యాశాఖ అధికారులు ఇప్పటికే.. నవోదయ విద్యాలయ సమితి అధికారులతో సమావేశమై కార్యాచరణ కూడా సిద్ధం చేశారు. ఈ ఏడు కొత్త విద్యాలయాల్లో ప్రస్తుత ఎడ్యుకేషనల్ ఇయర్, అంటే జులై 14 నుంచి క్లాసెస్ ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నారు.

ALSO READ: NPCIL Recruitment: పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.35,400 జీతం, రేపే లాస్ట్ డేట్ భయ్యా

Related News

FOREST BEAT OFFICER: అటవీశాఖలో భారీగా ఉద్యోగాలు.. ఇవ్వి చదివితే చాలు.. ఉద్యోగం మీ సొంతం!

Police Jobs: భారీగా పోలీస్ ఉద్యోగాలు.. టెన్త్ పాసైతే అప్లై చేసుకోవచ్చు.. పూర్తి వివరాలివే..!

Indian Navy: ఇండియన్ నేవీ నుంచి భారీ ఉద్యోగ నోటిఫికేషన్.. రూ.63వేల జీతం.. దరఖాస్తుకు ఒక్కరోజే గడువు

BHEL Recruitment: భారీ గుడ్‌న్యూస్.. బెల్‌లో భారీగా ఉద్యోగాలు.. దరఖాస్తు గడువు పెంపు

Jobs: టెన్త్, ఇంటర్ అర్హతలతో సీసీఆర్ఏఎస్‌లో ఉద్యోగాలు.. మంచి వేతనం.. రేపే లాస్ట్ డేట్ మిత్రమా

Railway Jobs: ఇండియన్ రైల్వేలో భారీగా ఉద్యోగాలు.. అప్లికేషన్ ఫీజు జస్ట్ రూ.40.. ఇదే మంచి అవకాశం

Big Stories

×