Illu Illalu Pillalu Today Episode October 17th: నిన్నటి ఎపిసోడ్ లో.. భద్ర విశ్వం దగ్గరికి వచ్చి ఏంట్రా నువ్వు ఇలా మారిపోయావు అని అడుగుతుంది.. ప్రేమ ధీరజ్ల మధ్య పెరుగుతున్న దూరం గురించి నేను ఆలోచిస్తున్నాను అని విశ్వం అంటాడు. ప్రేమ ధీరజ్ అన్న మాటలు తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. నిన్ను అనవసరంగా పెళ్లి చేసుకున్నాను అన్నమాట నీ పదేపదే తలుచుకొని బాధపడుతూ ఉంటుంది. ధీరజ్ నన్ను ఇన్ని మాటలు అంటాడా అని కన్నీళ్లు పెట్టుకొని ఏడుస్తూ ఉంటుంది.. అటు ధీరజ్ కూడా మంచి వాళ్ళు కూడా మర్డర్ చేస్తారంటే అందుకేనేమో.. ఇంత కోపమేంటి అని తనలో తానే తిట్టుకుంటూ ఉంటాడు… ప్రేమ నేనన్న మాటలకి ఎంత బాధపడిపోయిందో… ఎక్కడుందో తెలుసుకొని సారీ చెప్పాలి అని అనుకుంటాడు. ప్రేమ బాధపడుతుంటే అక్కడికి వెళ్లి నేను కోపంలో అన్నాను సారీ అని అంటాడు. ప్రేమ ధీరజ్ సారీ చెప్పిన సరే కరగదు. అక్కడితో ఎపిసోడ్ పూర్తి అవుతుంది..
ఇక ఇవాళ ఎపిసోడ్ విషయానికి వస్తే.. రామరాజు కోపంగా ఉంటాడు. శ్రీవల్లి వాళ్లని ఇరికిందామనుకుంటే నాకు కొంపకి నిప్పు అంటుకునింది ఏంటి అని బాధపడుతూ.. భయపడుతూ ఉంటుంది. ఎలాగైనా సరే నర్మద విషయంలో పుల్ల పెట్టాలి అని శ్రీవల్లి ధైర్యం చేసుకొని రామరాజు దగ్గరికి వస్తుంది. అక్కడికి సాగర్ రావడం చూసి సాగర్ వచ్చాడు కదా ఇక కచ్చితంగా ఈ గొడవ పెద్దదవుతుంది అని అనుకుంటుంది. అయితే సాగర్ నాన్న అని పిలుస్తాడు కానీ రామరాజు పలక పోవడంతో వెళ్ళిపోతూ ఉంటాడు. శ్రీవల్లి సాగర్ నీకు కావాలని పిలిచి మామయ్య గారిని మీ మామయ్య అవమానించాడు అంటూ అంటుంది.. మొత్తానికి శ్రీవల్లి పుల్ల పెట్టి నిప్పంటి చేస్తుంది.
నీకు రైస్ మిల్లుకు రావడం ఇష్టం లేదా రా అని రామరాజు సాగర్ ని అడుగుతాడు. మీ మామయ్య అన్నదాంట్లో తప్పు లేదని అంటున్నావు అంటే నీకు ఇల్లరికం వెళ్లాలని ఉంది కాబట్టి ఇలా అడుగుతున్నావా అని అంటాడు. నాకు అలాంటి ఉద్దేశం లేదు నాన్న అని సాగర్ అంటాడు. అప్పుడే అక్కడికి వచ్చిన నర్మదా అందరూ కూడా రామరాజు మాటలు విని కంగారు పడుతుంటారు. నర్మదా రాగానే రామరాజు ఏం మా నర్మదా నిన్ను ఇంట్లో సరిగ్గా చూసుకోవట్లేదా? నా కొడుకు ప్రేమ పెళ్లి చేసుకునేది నాకు మాటిచ్చి నిన్ను చేసుకొని వచ్చాడు.
అయినా బయట ఉంచడం నాకు ఇష్టం లేక ఇంట్లోకి రానిచ్చాను.. నా కూతురుతో సమానంగా నేను మీ అత్తయ్య నిన్ను చూసుకుంటున్నాము. నువ్వు ఆరోజు రైస్ మిల్క్ వచ్చి ఏం చెప్పావు? మీ నాన్నను నాలో చూసుకుంటున్నాను అని చెప్పావు కదా.. మరి మీ నాన్న నువ్వు ఎందుకు ఇక్కడ సంతోషంగా లేవు అని అంటున్నాడు అని అంటాడు. మా నాన్న ఎందుకు అన్నాడు నాకు తెలియదు మామయ్య నేను మాత్రం సంతోషంగా ఉన్నాను ఈ విషయాన్ని నేను మా నాన్నగారి ముందర కూడా మాట్లాడతాను అని అంటుంది.
నీకు ఏ ఉద్దేశం లేకపోతే మీ నాన్న ఎందుకు వచ్చి అలా మాట్లాడుతాడు అని శ్రీవల్లి అంటుంది. మామయ్య గారి పరువు తీసేస్తున్నావ్ కదా అని కావాలనే శ్రీవల్లి అనడంతో నర్మదా సీరియస్ అవుతుంది. నా విషయాలు జోక్ ఇన్ చేసుకోవద్దు నువ్వు ఫస్టు నోరు మూసుకొని ఉండు అని నర్మదా శ్రీవల్లికి స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తుంది. మావయ్య మా నాన్న అన్న దానికి నేను క్షమాపణ చెప్తున్నాను. అలాగే సాగరు మా ఇంటికి వెళ్లడం వల్లే ఈ గొడవలన్నీ జరిగాయి. దానికి కూడా నేను క్షమాపణ చెప్తున్నాను. ఈ గొడవని ఇంతటితో వదిలేయండి మావయ్య అని నర్మదా అంటుంది. తో మొత్తం కూల్ అయిపోతుంది.
శ్రీవల్లి ఇంట్లో పుల్ల పెట్టి నిప్పుంటిదామని అనుకుంటే తుస్సు మని ఆరిపోయింది అని అనుకుంటుంది. ఇక విశ్వం శ్రీవల్లి కి ఫోన్ చేస్తాడు. వీడేంటి అర్ధరాత్రి పూట ఫోన్ చేస్తున్నాడని అనుకుంటుంది. నువ్వు ఒకసారి అమూల్యని బయటికి తీసుకురావా అని అంటాడు. చాలా మంచి ప్లాన్ వేసాము నువ్వు కచ్చితంగా ఇప్పుడు అమూల్యను తీసుకురావాలి అని శ్రీవల్లితో అంటాడు. నీ దగ్గర పది లక్షలు తీసుకున్న పాపానికి నువ్వు చెప్పినట్టు చేయక తప్పదు కదా అసలు ఇదంతా కారణం అమ్మ అని భాగ్యమని తిట్టుకుంటుంది. విశ్వం చెప్పినట్లు అమూల్యని బయటికి తీసుకెళ్లాలని అనుకుంటుంది.
Also Read : పల్లవి ప్లాన్ సక్సెస్.. అవనికి డెడ్ లైన్.. కన్నీళ్లు పెట్టుకున్న రాజేంద్రప్రసాద్..
అమూల్య దగ్గరికి శ్రీవల్లి ఈమధ్య బద్ధకం పెరిగిపోతుంది నాకు కాసేపు అలా వాకింగ్ చేసి వద్దాం వస్తావా అని అడుగుతుంది. విశ్వం ప్లాను సక్సెస్ అవుతుంది అక్కడితో ఎపిసోడ్ పూర్తవుతుంది. రేపటి ఎపిసోడ్ లో ప్రేమ ధీరజుల మధ్య జరిగిన రొమాన్స్ గురించి చర్చ మొదలవుతుంది. ఆ తర్వాత ఏం జరుగుతుందో సోమవారం ఎపిసోడ్లో చూడాల్సిందే..