Star Actor Death: ఇటీవల కాలంలో ఇండస్ట్రీలో వరుస విషాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఇండస్ట్రీకి సంబంధించిన సెలెబ్రిటీలు పలు కారణాల వల్ల మరణిస్తుండడంతో అభిమానులు ఎంతో ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇక తెలుగు ఇండస్ట్రీలో కూడా ఇటీవల ప్రముఖ డైరెక్టర్ ఎస్ రవికుమార్, నటుడు గోపాలరావు వంటి వారు మరణించిన విషయం తెలిసిందే. ఇలా టాలీవుడ్ ఇండస్ట్రీలో మాత్రమే కాకుండా ఇతర భాష సెలబ్రిటీలు కూడా పలు కారణాలవల్ల మరణిస్తున్న నేపథ్యంలో అభిమానులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా నటుడు “డేవిడ్ హెకిలి కెనుయ్ బెల్ ” (57) (David Hekili Kenui Bell)మరణించారని తెలుస్తోంది.
బరువెక్కిన హృదయంతో…
ఇక ఈయన మరణించినటు స్వయంగా ఆయన సోదరి జలీన్ కనాని బెల్(Jalene Kanani Bell) ఫేస్ బుక్ ద్వారా తన మరణం గురించి అధికారకంగా తెలియజేశారు. ఈ విధంగా జలీన్ డేవిడ్ మరణం గురించి తెలియజేస్తూ…”ఎంతో ప్రతిభావంతుడైన, తెలివైన నా చిన్న సోదరుడు డేవిడ్ హెకిలి కెనుయ్ బెల్ ఈరోజు నా తండ్రి స్వర్గపు నివాసానికి వెళ్లారు. నా హృదయం ఎంతో బరువెక్కింది” అంటూ డేవిడ్ మరణ వార్తను అధికారకంగా తెలియజేశారు. ఇలా డేవిడ్ మరణించాలనే విషయం తెలియగానే ఆయన అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఈ మరణ వార్త పై స్పందిస్తూ నివాళులు అర్పిస్తున్నారు.
లీలో & స్టిచ్…
ఇక డేవిడ్ సినీ కెరియర్ విషయానికి వస్తే హవాయికి చెందిన ఈయన ఇటీవల వచ్చిన డిస్నీ లైవ్ యాక్షన్ లీలో & స్టిచ్ (Lilo & Stitch)లో కనిపించారు.లైవ్-యాక్షన్ రీమేక్‌తో పాటు “మాగ్నమ్ పిఐ” మరియు “హవాయి ఫైవ్-0” వంటి షోలలో సందడి చేశారు. ఇదిలా ఉండగా గత కొద్దిరోజుల క్రితం డేవిడ్ తన ఇంస్టాగ్రామ్ ద్వారా లిలో & స్టిచ్ సెట్ నుండి ఫోటోలను , అలాగే తన ఆడిషన్ కి సంబంధించిన ఒక వీడియో క్లిప్ అందరితో షేర్ చేసుకోవడమే కాకుండా ఇందులో తాను బిగ్ హవాయియన్ డ్యూడ్ అనే పాత్రలో నటించబోతున్నట్లు స్వయంగా ఆయన వెల్లడించారు. ఇలా నిత్యం సోషల్ మీడియాలో కూడా ఎంతో యాక్టివ్ గా ఉంటూ తనకు సంబంధించిన అన్ని విషయాలను డేవిడ్ అభిమానులతో పంచుకునేవారు.
మరణానికి కారణం..
ఇలా నటుడిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్న డేవిడ్ డబ్బింగ్ కూడా చెప్పేవారని తెలుస్తోంది. ఇండస్ట్రీలో కొనసాగడం చిన్నప్పటి నుంచి తన కల అంటూ పలు సందర్భాలలో డేవిడ్ తెలియజేశారు. ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్న డేవిడ్ ఉన్నఫలంగా మరణించారనే వార్త అందరిని ఎంతగానో దిగ్భ్రాంతికి గురి చేస్తుంది. అయితే ఈయన మరణ వార్తను తన సోదరి ఆదివారం సోషల్ మీడియా వేదికగా షేర్ చేశారు. కానీ ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇక తన మరణానికి గల కారణాలు ఏంటి? అనేది మాత్రం తన సోదరి వెల్లడించలేదు. ప్రస్తుతం ఈయన మరణ వార్త తెలిసిన అభిమానులు సంతాపం ప్రకటిస్తున్నారు.
Also Read: Hyper Aadi: రేటింగ్ కోసమే రిలేషన్ షిప్ లో ఉన్నారా… ఆ జంటను అవమానించిన హైపర్ ఆది?