BigTV English

NPCIL Recruitment: పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.35,400 జీతం, రేపే లాస్ట్ డేట్ భయ్యా

NPCIL Recruitment: పది, ఇంటర్ అర్హతతో ఉద్యోగాలు.. రూ.35,400 జీతం, రేపే లాస్ట్ డేట్ భయ్యా

NPCIL Recruitment: నిరుద్యోగ అభ్యర్థులకు ఇది గుడ్ న్యూస్. న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (ఎన్‌పీసీఐఎల్) లో పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ విడుదలైంది. అర్హత కలిగిన వారికి ఇది అద్భుతమైన అవకాశం. టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులవుతారు. నోటిఫికేషన్ కు సంబంధించిన ఉద్యోగాలు, వెకెన్సీలు, విద్యార్హత, ముఖ్యమైన డేట్స్, వయస్సు, ఉద్యోగ ఎంపిక విధానం, జీతం, తదితర వివరాల గురించి క్లియర్ కట్‌గా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.


కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ, న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (NPCIL).. గుజరాత్‌ కాక్రపార సైట్‌లో కింది విభాగాల్లో స్టైపెండరీ ట్రైనీస్‌/ సైంటిఫిక్‌ అసిస్టెంట్‌, టెక్నీషియన్‌, అసిస్టెంట్‌ గ్రేడ్‌-1 పోస్టులను భర్తీ చేసేందుకు అధికారులు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత ఉండి ఆసక్తి కలిగిన వారు జూన్‌ 17వ తేదీలోగా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

⦿ మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 197


న్యూక్లియర్ పవర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్‌లో పలు రకాల ఉద్యోగాలు వెకెన్సీ ఉన్నాయి. ఇందులో స్టైపెండరీ ట్రైనీస్, సైంటిఫిక్ అసిస్టెంట్, టెక్నీషియన్, అసిస్టెంట్ గ్రేడ్-1 లాంటి పోస్టులు ఖాళీగా ఉన్నయ్.

⦿ పోస్టుల వివరాలు: 

స్టైఫండరీ ట్రైనీస్ : 11 పోస్టులు

స్టైఫండరీ ట్రైనీస్ లేదా టెక్నీషియన్: 166 పోస్టులు

అసిస్టెంట్ గ్రేడ్-1 (హెచ్ఆర్, ఎఫ్ఏ, సీఎంఎం) : 20 పోస్టులు

వివిధ విభాగాల్లో ఈ పోస్టులు ఖాళీగా ఉన్నాయి. మెకానికల్, కెమికల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్, ఇన్‌స్ట్రుమెంటేషన్, సివిల్, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, వెల్డర్‌, మెషినిస్ట్‌, ఏసీ మెకానిక్‌, డిజిల్‌ మెకానిక్‌ విభాగాల్లో ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయి.

⦿ విద్యార్హత: కనీసం 60 శాతం మార్కులతో ఉద్యోగాలను బట్టి సంబంధిత విభాగంలో టెన్త్, ఇంటర్, డిప్లొమా, బీఎస్సీ పాసై ఉండాలి.

⦿ దరఖాస్తుకు ప్రారంభ తేది: 2025 మే 28

⦿ దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 17

⦿ వయస్సు: ఉద్యోగాన్ని బట్టి వయస్సును నిర్ధారించారు. సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి 18 నుంచి 25 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. టెక్నీషియన్ ఉద్యోగానికి 18 నుంచి 24 ఏళ్ల మధ్య వయస్సు ఉండాలి. అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులకు 21 నుంచి 28 ఏళ్ల వయస్సు ఉండాలి.

⦿ ఉద్యోగ ఎంపిక ప్రక్రియ: ఆన్‌లైన్‌ కంప్యూటర్‌ బేస్డ్‌ టెస్ట్‌(స్టేజ్‌-1, స్టేజ్‌-2), స్కిల్‌ టెస్ట్‌, ఇంటర్వ్యూ తదితరాలను బేస్ చేసుకుని ఉద్యోగానికి సెలెక్ట్ చేస్తారు.

⦿ జీతం: ఉద్యోగాన్ని బట్టి వేతనం ఉంటుంది. నెలకు సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.35,400 జీతం ఉంటుంది. టెక్నీషియన్ ఉద్యోగానికి రూ.21,700 జీతం ఉంటుంది. అసిస్టెంట్ గ్రేడ్-1 పోస్టులకు రూ.25,500 జీతం ఉంటుంది.

⦿ దరఖాస్తు ఫీజు: సైంటిఫిక్ అసిస్టెంట్ ఉద్యోగానికి రూ.150 ఫీజు ఉంటుంది. ఇతర పోస్టులకు రూ.100 ఫీజు ఉంటుంది.

నోటిఫికేషన్ పూర్తి సమాచారం కోసం అఫీషియల్ వెబ్ సైట్ ను చూడొచ్చు.

⦿ అఫీషియల్ వెబ్ సైట్: https://npcilcareers.co.in/

ALSO READ: AP Jobs: ఏపీలో ప్రభుత్వ ఉద్యోగాలు.. ఈ జాబ్ వస్తే అక్షరాల రూ.లక్ష జీతం.. ఇంకెందుకు ఆలస్యం

⦿ నోటిఫికేషన్ ముఖ్య సమాచారం: 

మొత్తం ఉద్యోగ ఖాళీల సంఖ్య: 197

దరఖాస్తుకు చివరి తేది: 2025 జూన్ 17

Related News

EPFO: ఎంప్లాయిస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌లో ఉద్యోగాలు.. డిగ్రీ పాసైతే చాలు, నో కాంపిటేషన్

LIC Bima Sakhi Yojana: మహిళలకు LIC బంపర్ ఆఫర్ – ఉచితంగా 2 లక్షలు ఇవ్వనున్న కేంద్రం

SGPGIMS: 262 ఫ్యాకల్టీ ఉద్యోగాలు.. రూ.2లక్షలకు పైగా వేతనం, చివరి తేది ఇదే..

DSC Results: డీఎస్సీ ఫలితాలు వచ్చేశాయ్..

Tenth Exams: టెన్త్ పరీక్షలపై ప్రభుత్వం కీలక నిర్ణయం.. ఇక ఆ పద్ధతిలోనే..?

Deputy Manager Jobs: బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఉద్యోగాలు.. లక్షల్లో వేతనాలు, అర్హతలు ఇవే

Big Stories

×