BigTV English

A family suicide: ఆన్‌లైన్ బెట్టింగులు, వరుస నష్టాలు.. గొడవలు.. ఆపై

A family suicide: ఆన్‌లైన్ బెట్టింగులు, వరుస నష్టాలు.. గొడవలు.. ఆపై
A family suicide of online betting at bandlaguda jagir in Hyderabad
A family suicide of online betting at bandlaguda jagir in Hyderabad

A Family Suicide of online Betting at Bandlaguda Jagir in Hyderabad: ఆన్‌లైన్ బెట్టింగులు.. అదొక వ్యసనం. ఒక్కసారి ఈ ఉచ్చులో చిక్కుకున్నామా? బయటకు రావడం కష్టం. దీని బారినపడి చాలామంది ప్రాణాలు పొగొట్టుకున్నారు.. కొంటున్నారు కూడా. స్టిల్  ఇంకా కంటిన్యూ అవుతోంది. ఉన్న సంపాదన చాలక.. ఐదో, పదో వస్తుందని ఆశించి అందులోకి దిగుతున్నారు. బెట్టింగ్ ఊబి నుంచి బయటకు రాలేక ఈ లోకాన్ని విడిచిపెడుతున్నారు. ఈ ఘటనలో చిన్నారులు కూడా బలైపోతున్నారు. రానురాను ఈ తరహా కేసులు రెట్టింపు అవుతున్నాయి. తాజాగా అలాంటి ఘటన ఒకటి హైదరాబాద్ పరిసరాల్లో చోటు చేసుకుంది.


రంగారెడ్డి జిల్లా బండ్లగూడ జాగీర్‌లోని రాధానగర్‌లో ఉంటున్నారు ఆనంద్ ఫ్యామిలీ. పదేళ్ల కిందట చేవెళ్ల ప్రాంతంలోని మాల్కారం గ్రామానికి చెందిన ఇందిరతో మ్యారేజ్ జరిగింది. ఆనంద్ పాల వ్యాపారం చేస్తూ జీవితం సాగిస్తున్నాడు. ఆనంద్ కాపురం అంతా సజావుగా సాగుతోంది. ఆలుమగలు కలిసి మెలిసి కష్టాలను పంచుకుంటూ ఆనందంగా గడిపేవారు. నాలుగేళ్ల కిందట ఈ జంటకు అబ్బాయి పుట్టాడు. చిన్నారిని చూసి ఆ తల్లిదండ్రులు మురిసిపోయేవారు. తమ కంటే బాగా చదివించాలని ఆలోచన చేసేశారు. అయితే వస్తున్న ఆదాయం తక్కువగా ఉండేది.

ఓ వైపు పాల వ్యాపారం చేస్తూ.. మరోవైపు బెట్టింగులకు అలవాటు పడ్డాడు ఆనంద్. తొలుత డబ్బులు బాగానే వచ్చేవి.. తర్వాత జేబు ఖాళీ అయిపోయేది. ఈ క్రమంలో అప్పులు చేయడం కూడా మొదలు పెట్టాడు. దాదాపు 15 లక్షల వరకు అప్పుచేశాడు. కష్టపడి సంపాదించిన కారు, బంగారం అంతా ఊడ్చే శాడు. ఇంకా డబ్బులు వస్తాయని ఆశ పడేవాడు. ఆ ఆశ ఆనంద్ ఫ్యామిలీని మింగేసింది. ఈ విషయం ఇంటి ఇల్లాలికి తెలిసింది. దీంతో భార్యభర్తల మధ్య తరచు గొడవలు జరిగేవి.


Also Read: కొడంగల్‌పై కుట్రలు జరుగుతున్నాయి.. నన్ను కిందపడేయాలని చూస్తున్నారు..

బెట్టింగుల విషయం ఇందిర పేరెంట్స్‌కి తెలియడంతో అల్లుడి ఇంటికి వచ్చి నచ్చజెప్పారు. బెట్టింగుల జోలికి వెళ్లవద్దని సూచించారు. అయితే మళ్లీ మనసు లాగేసింది. మూడురోజుల కిందట ఆన్‌లైన్ బెట్టింగ్ ఆడినట్టు తెలుస్తోంది. ఈ విషయమై ఆలుమగల మధ్య గొడవలు జరిగాయి. ఈ క్రమంలో ఇందిర పేరెంట్స్ కూతురు, అల్లుడిని సముదాయించారు.

సీన్ కట్ చేస్తే.. మరోసారి ఆనంద్ ఇంటిలో ఫోన్ ఎవరూ లిఫ్ట్ చేయలేదు. కంగారుపడిన ఇందిర తల్లిదండ్రులు ఆనంద్ ఇంటికి వచ్చి చూశారు. అప్పటికే ఆనంద్, ఇందిర, నాలుగేళ్ల కొడుకు చనిపోయి పడివున్నారు. భార్య, కొడుకుకు విషమిచ్చాడు ఆనంద్. ఆ తర్వాత తాను కూడా ఆత్మహత్య చేసు కున్నాడు. విషయం తెలుసుకున్న రాజేంద్రనగర్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకున్నారు. ఇందిర పేరెంట్స్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

MLA Mallareddy: రాజకీయాలకు గుడ్ బై.. బిగ్ బాంబ్ పేల్చేసిన మల్లారెడ్డి.. అసలేమైంది..?

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Big Stories

×