E-Paper
Advertisement

Rocks : వేటకు వెళ్లి.. బండరాళ్ల మధ్య ఇలా ఇరుక్కుపోయాడు..

Rocks : వేటకు వెళ్లి.. బండరాళ్ల మధ్య ఇలా ఇరుక్కుపోయాడు..
Advertisement

Rocks : ఆ వ్యక్తి వేట కోసం ఇంటి నుంచి వెళ్లాడు. ప్రమాదశాత్తు బండరాళ్ల మధ్య తలకిందులుగా ఇరుక్కుపోయాడు. గంటల తరబడి నరకయాతన అనుభవిస్తున్నాడు. ఈ ఘటన కామారెడ్డి జిల్లాలో జరిగింది. రామారెడ్డి మండలం రెడ్డిపేటకు చెందిన షాడ రాజు మంగళవారం సాయంత్రం మిత్రుడు మహేశ్‌తో కలిసి ఘన్‌పూర్‌ శివారు అడవిలో వేటకు వెళ్లాడు. రాళ్లపై నుంచి నడుచుకుని వెళ్తుండగా సెల్‌ఫోన్‌ పడిపోయింది. ఆ ఫోన్ బండరాళ్ల మధ్యలోకి వెళ్లిపోయింది. దీంతో బండరాళ్ల మధ్యకు దూరి రాజు ఫోన్ ను బయటకు తీసేందుకు ప్రయత్నించాడు. తను కూడా బండరాళ్ల మధ్య చిక్కుకుపోయాడు.

రాజు తలకిందులుగా రాళ్ల మధ్యలోకి జారి ఇరుక్కుపోయాడు. వెంట వచ్చిన మిత్రుడు బయటకు తీసేందుకు చాలాసేపు ప్రయత్నించాడు. అయినా మిత్రుడిని బయటకు లాగలేకపోయాడు. ఎంత శ్రమించినా ఫలితం లేకుండా పోయింది. రాజు కాళ్లు, ఒక చేయి మాత్రమే బయటకు కనిపిస్తున్నాయి. దీంతో రాజు కుటుంబ సభ్యులకు ఈ విషయాన్ని చెప్పాడు. వారంతా ఘటన స్థలికి వచ్చి రాజును బయటకు తీసేందుకు ప్రయత్నించారు.

Advertisement

ఈ ప్రమాదంపై తొలుత అధికారులకుగానీ, పోలీసులకుగానీ సమాచారం అందలేదు. రాజు కుటుంబ సభ్యులు, మిత్రులు బుధవారం మధ్యాహ్నం వరకు బయటకు తీసేందుకు ప్రయత్నించారు. ఆ ప్రయత్నాలు విఫలం కావడంతో ఆ తర్వాత పోలీసులకు సమాచారం అందించారు. రాజును బయటకు తీసేందుకు ఏఎస్పీ అన్యోన్య ఆధ్వర్యంలో ఆపరేషన్ ప్రారంభించారు. యంత్రాల సాయంతో బుధవారం రాత్రి కూడా ప్రయత్నాలు కొనసాగించారు. రాజుకు ధైర్యం చెబుతూ.. నీళ్లు, ఓఆర్‌ఎస్‌ తాగించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఎలాగైనా బాధితుడిని బయటకు తీసేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు.

రాజుకు భార్య, ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. వేటకు వెళ్లి ఇలా అనుకోని ప్రమాదంలో చిక్కుకుపోవడంతో వారు ఆందోళన చెందుతున్నారు. తన భర్త ఎప్పుడు బండరాళ్ల నుంచి బయటకు వస్తాడని భార్య ఎదురుచూస్తోంది. తండ్రి కోసం ముగ్గురు చిన్నారులు తపిస్తున్నారు. రాజు కుటుంబ సభ్యులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. రాజును ఎలాగైనా కాపాడాలని వేడుకుంటున్నారు.

Related News

పిల్లలకు పుట్టినరోజు బహుమతులు ఇవ్వడమే కాదు.. జీవితాంతం గుర్తుండిపోయేలా ఈ 7 అలవాట్లు నేర్పండి

Karthika Deepam 2 Serial Today Episode October 14th ‘కార్తీక దీపం 2’ సీరియల్‌: జ్యోత్స్న ఏమైనట్టు.. ? మాలిని జైలుకు వెళ్తుందా..?            

సోని నుంచి మరో అద్భుతం..Sony WF-C510 ఇయర్ బడ్స్ లాంచ్

హైడ్రా రంగంలోకి వస్తోంది.. ప్రకటనలు ఇచ్చేముందు ఈ రూల్స్ తెలియాలోచ్!

రూమ్ ఏదైనా సరే..ఈ టాప్-7 ప్రొజెక్టర్లతో విజువల్స్ నెక్స్ట్ లెవెల్!

Ninnu kori Serial Today Episode October 6th ‘నిన్ను కోరి’ సీరియల్‌: సామ్రాట్ కు నిజం తెలుస్తుందా..? జీవన్ పరిస్థితి ఏంటి..?  

అంగవైకల్యంతోనే పుట్టాను…6 ఏళ్ళకే చనిపోతానని చెప్పారు, కానీ

Illu Illalu Pillalu Serial Today Episode October 2nd ‘ఇల్లు ఇల్లాలు పిల్లలు’ సీరియల్‌: నర్మదను మెచ్చుకున్న రామరాజు – శ్రీవల్లి ప్లాన్ సక్సెస్ అయ్యేనా..?             

Big Stories

Advertisement
×