BigTV English
Advertisement

ఇంటికి దిష్టి తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

ఇంటికి దిష్టి తగలకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి?

దిష్టి దోషమన్నది సహజ సిద్ధంగా కంటి ప్రభావం వల్ల వచ్చింది. అందుకే మనం నిద్ర నుంచి లేవగానే…మనం చేతుల్ని మనమే చూసుకోవాలి. ఆ చేతుల్ని చూసుకుంటే
కన్నుల చివర కొన్ని వేల శక్తుల కోన్స్ దాగి ఉంటాయి. వాటికి దేదీప్యమైన శక్తి ఉంటుంది. ఆ శక్తి పుంజాలు దేనిమీదైతే పడతాయో వాటి మీద ప్రభావం పడుతుంది. అందుకే మీ శక్తి మీకే వచ్చే విధంగా ఉదయాన్నే నిద్ర నుంచి లేవగానే మంత్రం జపించి మనం చేతుల్ని చూసుకోవాలి.


అలా చూసుకున్న తర్వాతే ఇతరులను చూడాలి. లేకపోతే అద్దంలో తన ప్రతిబింబాన్ని తానే చూసుకోవాలి. పరాయి వ్యక్తుల చూపుల వల్లే కొంతమందికి తలనొప్పి వస్తుంది. దిష్టి దోష నివారణకు చిన్న ఉల్లిపాయను దగ్గర పెట్టుకోవాలి. ప్రయాణాలు చేసేటప్పుడు ప్రమాదాలు జరగకుండా ఇది కాపాడుతుంది కూడా.

ఇల్లు కట్టేటప్పుడు కొంతమంది రాక్షసుడి బొమ్మ తగిలిస్తుంటారు. పెద్ద నోరు తెచిన ఉన్న దిష్టి బొమ్మల్ని కనిపించేలా పెడుతుంటారు. అలాంటి బొమ్మల వల్ల మనుషుల దృష్టి బొమ్మల వైపు మళ్లుతుంది. అదే చిన్నపిల్లలకు దిష్టి తగలకుండా ఎర్రన్నం,నల్లన్నం,తెల్లన్నం వారి చుట్టూ తిప్పి ఆదివారం పూట పాడేస్తే దోషం పోతుంది. చంటిపిల్లలకు అరికాళ్లల్లో, బుగ్గమీద నల్లబొట్టు కారణం ఇదే.


మిరపకాయల దిష్టి, కుండ దిష్టి తీసే సంప్రదాయం మన సనాతన భారతీయ సంప్రదాయంగా వస్తుంది. దిష్టి తగలకుండా చేసేది స్పటిక, నల్లదారం. స్పటికను నల్లదారంతో కట్టి ఉట్టిలో వేలాడదీయాలి. గుమ్మడికాయపైన ఇది కట్టాలి. ఇలా చేస్తే దిష్టి దోషమనేది ఇంటి లోపలకి రాదు. అలాగే ఇంట్లో నేలను ఉప్పు నీటితో వారానికో సారి తుడుస్తూ ఉంటే దిష్టి దోషాలనేవి ఇంట్లోకి ప్రవేశించవని వాస్తు నిపుణులు చెబుతున్నారు.

నరమానవుడి దిష్టికి నల్లరాళ్లు కూడా పగులతాయన్న సామెత కూడా ఉంది. కంటి చూపు శక్తి అనిర్విచనీయమైన ప్రభావాన్ని ఇస్తుంది. చూసే వాళ్లు సాత్విక దృష్టితో చూస్తే మనం అభివృద్ధిలోకి వస్తాం కానీ కుటిలమైన దృష్టితో చూస్తే పతనమైపోతాం. మన శరీరంలో కూడా మూడో కన్న కనిపించి కనిపించకుండా ఉంటుంది. ఆ శక్తి తత్వాన్ని ఇతరులు చూసినపుడు దిష్టి దోషం తగలకుండా ఉండేందుకే నుదుటి మధ్యంలో గంధం పెట్టుకుని అందులో బొట్టు పెట్టుకునే సంప్రదాయం మొదలుపెట్టారు. అప్పుడు ఎవరు చూసినా వాళ్ల దృష్టంతా ఆ బొట్టు మీదకు పోతుంది.

Related News

Vastu tips: మీ ఇంట్లో ప్రతిరోజూ కర్పూరం వెలిగించడం వల్ల జరిగేది ఇదే

Vastu Tips: ఇంట్లో నెగటివ్ ఎనర్జీ ఉందా ? అయితే ఈ వాస్తు టిప్స్ పాటించండి !

Money Plant: మనీ ప్లాంట్ నాటుతున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Vastu tips: వంట గదిలో మీ చేతిలోంచి ఈ ఐదు వస్తువులు జారి పడకుండా చూసుకోండి

Karthika Masam: కార్తీక మాసంలో.. ఎలాంటి దానాలు చేస్తే మంచిదో తెలుసా ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఉసిరి దీపం వెలిగిస్తున్నారా ? ఈ పొరపాట్లు అస్సలు చేయొద్దు

Kartika Pournami 2025: కార్తీక పౌర్ణమి రోజు.. ఎన్ని దీపాలు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో నారికేళ దీపం వెనుక అద్భుత రహస్యాలు.. తెలుసుకుంటే ఆశ్చర్యపోతారు..

Big Stories

×