E-Paper
Advertisement

Hyderabad షాకింగ్ గా రిమాండ్ రిపోర్ట్.. హెచ్ఎండీఏ మాజీ డైరెక్టర్ అక్రమాస్తుల చిట్టా ఇదే..

Hyderabad : ఆదాయానికి మించి అక్రమాస్తుల కేసులో హెచ్‌ఎండీఏ మాజీ డైరెక్టర్ శివ బాలకృష్ణ రిమాండ్ రిపోర్టులో పలు కీలక అంశాలు వెల్లడయ్యాయి. బాలకృష్ణ ఇల్లు సహా 18 చోట్ల ఏసీబీ ఇటీవల సోదాలు చేసింది. భారీగా స్థిర, చరాస్తులకు సంబంధించిన దస్త్రాలను గుర్తించింది.

ఏసీబీ అధికారులు బాలకృష్ణ ఇంట్లో స్వాధీనం చేసుకున్న 50 స్థిర, చరాస్తులకు సంబంధించిన పత్రాలను పరిశీలించారు. వాటి విలువ దాదాపు రూ.5 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. వాటితోపాటు సోదాల్లో రూ.99 లక్షల నగదు, రూ.8.26 కోట్ల విలువైన బంగారం, నాలుగు కార్లు, వెండి, వాచ్‌లు, ఫోన్లు, గృహోపకరణాలను సీజ్‌ చేసినట్లు రిమాండ్‌ రిపోర్టులో పేర్కొన్నారు.

Advertisement

పలు ఇన్‌ఫ్రా కంపెనీల్లోనూ సోదాలు చేసినట్లు ఏసీబీ పేర్కొంది. 155 డాక్యుమెంట్ షీట్లు, 4 బ్యాంక్‌ పాస్ బుక్‌లు స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించి బినామీలను విచారించాల్సి ఉందని ఏసీబీ తెలిపింది. ఇతర అధికారుల పాత్రపై దర్యాప్తు జరపాల్సి ఉందని పేర్కొన్నారు.

పీర్జాదిగూడలో రమాదేవి, జూబ్లీహిల్స్‌లో ప్రమోద్ కుమార్, మైహోం భూజాలో కిరణ్ ఆచార్య, మాదాపూర్‌లో సందీప్‌ రెడ్డి, బాచుపల్లిలో సత్యనారాయణ మూర్తి ఇళ్లు సహా మొత్తం 18 చోట్ల సోదాలు చేశామని రిమాండ్‌ రిపోర్టులో ఏసీబీ వివరించింది.

Advertisement

Tags

Related News

పెను విషాదం.. 40 మందితో వెళుతోన్న ప‌డ‌వ బోల్తా

మధ్యప్రదేశ్‌లో విషాదం.. ఎద్దును రక్షించబోయి ముగ్గురు మృతి!

ఘోర బస్సు ప్రమాదం.. క్షణాల వ్యవధిలో తగలబడిన బస్సు.. స్పాట్‌లో!

ఘట్‌కేసర్‌లో ఘోర విషాదం.. రైలు కింద పడి దంపతుల ఆత్మహత్య!

ఈగల్ ఫోర్స్ ‘మరో’ సక్సెస్ ఆపరేషన్.. 180 కిలోల గంజాయి సీజ్!

26 రోజుల ఎదురుచూపు.. ఏజెన్సీ గ్రామాలను కుదిపేస్తున్న తండ్రి ఆవేదన!

టోల్ ప్లాజా వద్ద పేలిన ఎల్పీజీ ట్యాంకర్.. ఆరుగురు మృతి!

పెళ్లి వేడుకల్లో ఊహించని విషాదం.. లారీ రూపంలో వచ్చిన రాక్షసుడు.. ఒకే కుటుంబంలో నలుగురు బలి!

Big Stories

Advertisement
×