BigTV English

Konda vs Akkineni: పరువు నష్టం కేసు విచారణ.. రేపు కోర్టు మెట్లు ఎక్కనున్న నాగార్జున?

Konda vs Akkineni: పరువు నష్టం కేసు విచారణ.. రేపు కోర్టు మెట్లు ఎక్కనున్న నాగార్జున?

Nagarjuna – Konda Surekha: తెలంగాణ మంత్రి కొండా సురేఖ తాజాగా హీరో అక్కినేని ఫ్యామిలీపై చేసిన కామెంట్స్ వ్యవహారం చివరికి నాంపల్లి కోర్టు మెట్లెక్కిన విషయం తెలిసిందే. తన కుటుంబ ప్రతిష్టను, గౌరవాన్ని దెబ్బతీసేలా మంత్రి సురేఖ మాట్లాడారని, తన పరువుకు భంగం కలిగిందంటూ నాగార్జున 100 కోట్ల మేర పరువు నష్టం దావా వేశారు.


మంత్రి సురేఖ తనపై జరిగిన సోషల్ మీడియా ట్రోలింగ్స్ పట్ల స్పందిస్తూ.. మాజీ మంత్రి కేటీఆర్ లక్ష్యంగా కామెంట్స్ చేశారు. అలాగే అక్కినేని నాగార్జున, సమంతా పేర్లను ఉచ్చరిస్తూ.. కొంత వివాదాస్పద రీతిలో మాట్లాడారు. అనంతరం సురేఖ చేసిన వ్యాఖ్యల పట్ల సినీలోకం విరుచుకు పడిందని చెప్పవచ్చు.

మెగాస్టార్ చిరంజీవి నుండి ప్రముఖ తారాగణం మొత్తం నాగార్జునకు మద్దతుగా ట్వీట్ ల వర్షాన్ని కురిపించారు. అలాగే పలువురు మహిళా సంఘం నేతలు సైతం ఈ విషయంపై ఘాటుగానే స్పందించారు. తనను ఉద్దేశించి చేసిన కామెంట్స్ పట్ల సమంతా కూడా స్పందించారు. రాజకీయాలలోకి తమను లాగవద్దని, తమ విడాకుల ప్రక్రియ చట్టబద్దంగా సాగిందంటూ ప్రకటన ఇచ్చారు. దీనితో కొండా సురేఖ స్పందిస్తూ.. సారీ చెప్పారు. ఇక రోజురోజుకు వివాదం రాజుకుంటున్న సమయంలో తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు.


మహేష్ గౌడ్ మాట్లాడుతూ. మంత్రి సురేఖ చేసిన వ్యాఖ్యలు.. కేవలం తనపై వచ్చిన ట్రోలింగ్స్ కి బాధపడి.. ఆవేశంతో చేసిన కామెంట్స్ గా పరిగణించాలన్నారు. అంతేగాక మహేష్ గౌడ్.. టాలీవుడ్ కి, అక్కినేని ఫ్యామిలీకి క్షమాపణలు తెలిపారు. చివరికి ఈ వ్యవహారం ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల వద్దకు చేరింది. మొత్తం మీద తన కామెంట్స్ పట్ల మంత్రి సురేఖ సారీ చెప్పినా.. విమర్శలు మాత్రం ఆగని పరిస్థితి. ఇలాంటి తరుణంలో ఒక్కసారిగా నాగార్జున తన పరువుకు భంగం కలిగిందంటూ నాంపల్లి కోర్టును ఆశ్రయించారు.

Also Read: Johnny Master Case: జానీ మాస్టర్ బెయిల్ రద్దు.. మళ్లీ జైలుకే

కాగా మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై నాగార్జున వేసిన పిటిషన్‌పై నాంపల్లి మనోరంజన్ కోర్టులో విచారణ సోమవారం సాగింది. నాగార్జున తరపున సీనియర్ కౌన్సిల్ అశోక్ రెడ్డి వాదనలు వినిపించారు. రేపు నాగార్జున స్టేట్మెంట్ రికార్డు చేస్తామని కోర్టు ప్రకటించింది. ఈ మేరకు రేపు కోర్టుకు నాగార్జున హాజరయ్యే అవకాశాలు ఉన్నాయి. తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది.

Related News

GHMC rain update: హైదరాబాద్‌లో భారీ వర్షం.. అక్కడ రికార్డ్ స్థాయిలో వర్షపాతం నమోదు

Hyderabad traffic jam: హైదరాబాద్ వరద ఎఫెక్ట్.. ఫుల్ ట్రాఫిక్ జామ్.. పోలీసుల కీలక ప్రకటన ఇదే..

Hyderabad flood alert: హైదరాబాద్‌ ను భయపెడుతున్న వరద.. హిమాయత్ సాగర్ గేట్ ఓపెన్‌కు అధికారులు సిద్ధం!

Hyderabad Cloudburst: డేంజర్.. హైదరాబాద్ లో క్లౌడ్ బరస్ట్.. ఆకస్మిక వరద ముప్పు.. జాగ్రత్త!

Hyderabad Rain Alert: నగర ప్రజలు అలర్ట్.. అత్యవసరమైతే తప్ప బయటికి రావద్దు

KTR on Police: మా సబితమ్మ మీదే మాటలా.. పోలీసులకు కేటీఆర్ మాస్ వార్నింగ్

Big Stories

×