E-Paper
Advertisement

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే

ఇంట్లో కూర్చుని 80 లక్షల సంపాదన… హర్రర్ గేమ్ ఆడుతూ ఆగమాగం… ఈ హర్రర్ థ్రిల్లర్ పెద్దలకు మాత్రమే
Advertisement

Tamil Horror on OTT: ఇంట్లో కూర్చునే 80 లక్షలకు పైగా సంపాదించే భర్త. అతను ఏం చేస్తున్నాడో అర్థం కాక ఇంటి నుంచి వెళ్లిపోయే భార్య… సరదాగా మొదలు పెట్టిన ఓ హారర్ గేమ్. కానీ ఆ గేమ్ ఆడిన తర్వాత ఆమె ఉంటున్న ఇంట్లో దడుచుకునే పనులు షురూ అవుతాయి. సరదాగా మొదలైన ఆ ఆటలోకి నిజంగానే ఓ అతీంద్రియ శక్తి వస్తే ? ఆ శక్తి అక్కడికి ఎందుకు వచ్చింది ? దాని వెనుక ఉన్న అసలు కథ ఏంటి ? ఈ మిస్టరీ చుట్టూ సాగే తమిళ హారర్ కామెడీ మూవీ ‘ఇరుట్టరై’ (Iruttarai). మరి ఈ మూవీ ఏ ఓటీటీలో ఉందంటే ?

కథలోకి వెళ్తే…

ఓ యువ ప్రేమ జంట కలిసి జీవిస్తుంటుంది. మొదట ఇద్దరి మధ్య జీవితం సాఫీగానే సాగుతుంది. కానీ హీరో లైఫ్ స్టైల్ మాత్రం హీరోయిన్‌ కు అనుమానాలు కలిగిస్తుంది. ఎలాంటి ఉద్యోగం చేయకుండా అతను భారీ మొత్తంలో డబ్బు సంపాదిస్తుంటాడు. ఏకంగా 80 లక్షలకు పైగా సంపాదిస్తాడు. కానీ అతనికి ఆ డబ్బు ఎలా వస్తుందో మాత్రం ఆమెకు అర్థం కాదు. భర్త ఏం చేస్తున్నాడు, అతని ఆదాయం వెనుక ఉన్న అసలు సీక్రెట్ ఏంటి ? అనే అనుమానాలు పెరగడంతో ఇద్దరి మధ్య గొడవలు మొదలవుతాయి.

Advertisement

పరిస్థితి మరింత ఇబ్బందిగా మారడంతో హీరోయిన్ ఇంటి నుంచి వెళ్లి తన స్నేహితురాలి ఇంట్లో ఉండాలని నిర్ణయించుకుంటుంది. అక్కడ ఖాళీగా ఉన్న సమయంలో ఆమెకు ఓ హారర్ గేమ్ ఆడాలనే ఆలోచన వస్తుంది. మొదట అదొక సరదా మాత్రమే. గేమ్‌ లో భాగంగా కొన్ని పనులు చేసిన తర్వాత ఇంట్లో వింత సంఘటనలు మొదలవుతాయి. మొదట వాటిని పెద్దగా పట్టించుకోకపోయినా… పరిస్థితులు క్రమంగా భయపెట్టే స్థాయికి చేరతాయి.

ఆమె స్నేహితురాలు కూడా అక్కడికి రావడంతో ఇద్దరూ కలిసి ఏం జరుగుతుందో తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇంట్లో ఏదో ఉందనే విషయం స్పష్టమవుతుంది. కానీ అది ఏంటి, గేమ్‌ కు దానికి సంబంధం ఏంటి అనే విషయం మాత్రం అర్థం కాదు. కొన్ని సంఘటనల తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన శక్తి సాధారణమైనది కాదని వాళ్లకు తెలుస్తుంది. ఆ శక్తి ఉద్దేశం ఏంటి, అది ఎందుకు అక్కడికి వచ్చింది, హీరో సంపాదించే డబ్బుకు ఈ వ్యవహారంతో ఏమైనా సంబంధం ఉందా ? అనే అనుమానాలు తీరాలంటే ఈ మూవీని మస్ట్ వాచ్. హారర్ సన్నివేశాలతో పాటు కామెడీ, రొమాన్స్, గ్లామర్ అంశాలను కూడా కలిపి కథను నడిపించారు. ఇంట్లో జరుగుతున్న వింతలకు కారణం ఏంటనే మిస్టరీని చివరి వరకు కొనసాగిస్తూ… చివర్లో అసలు విషయం బయటపడేలా కథను తీర్చిదిద్దారు.

ఎక్కడ చూడొచ్చు ?

Advertisement

‘ఇరుట్టరై’ ప్రస్తుతం ఆహా తమిళ్ (Aha Tamil)లో స్ట్రీమింగ్ అవుతోంది. సినిమా నిడివి 1 గంట 19 నిమిషాలు కాగా, A సర్టిఫికేషన్ ఉంది. తమిళ భాషలో అందుబాటులో ఉన్న ఈ సినిమాలో హారర్‌తో పాటు కామెడీ, రొమాన్స్, సూపర్‌నేచురల్ మిస్టరీ అంశాలను కలిపారు. వినోత్ బాలాజీ (Vinoth Balaji), శ్యామల్ దుత్తరాజ్ (Shyamal Duttaraj), విద్యా శంకర్, కాత్తు కరుప్పు కలై, బ్లాక్ మణి, బాలకుమరన్ తదితరులు నటించిన ఈ సినిమాకు విఘ్నేష్ మణివేల్ (Vignesh Manivel) దర్శకత్వం వహించారు. ఈ హారర్ కామెడీ మూవీ సింగిల్స్ కు మాత్రమే అని గుర్తు పెట్టుకోండి.

Read Also: ఊర్లో వరుసగా మిస్సింగ్ కేసులు.. పిల్లలనే టార్గెట్ చేసే సైకో.. దడ పుట్టించే సైకో థ్రిల్లర్

Related News

నైట్‌క్లబ్‌లో లేడీ డాన్సర్ల పవర్ వార్… రెండు కొప్పులు ఒకే చోట ఇమడవు అంటే ఇదేనేమో… తెలుగులో టర్కిష్ మూవీ

చిల్లర బ్యాచ్ కాదు… సీట్-ఎడ్జ్ యాక్షన్‌తో పాటు కడుపుబ్బా నవ్వించే కామెడీ

సినిమా పిచ్చితో సీక్రెట్ పనులు… అపరిచితుడి ఎంట్రీతో అదిరిపోయే ట్విస్ట్… సింగిల్స్ కి మాత్రమే

కోటి బహుమతి కోసం ఎక్స్‌తో జోడీ… కట్ చేస్తే కాటికి తీసుకెళ్ళే ట్విస్ట్… సీక్రెట్ క్లబ్‌లో హారర్ మిస్టరీ

బైక్ పై ఇద్దరమ్మాయిల రచ్చ… అదిరిపోయే రోడ్ ట్రిప్ డ్రామా… నెవర్ బిఫోర్ కథ

కామాంధులను శిక్షించడానికి రంగంలోకి దిగే రహస్య శక్తి… మృత్యుదేవత విలయతాండవం

ఇన్సూరెన్స్ కోసం ముసలోళ్ల ఇంటికెళ్తే ఇదేం అరాచకం భయ్యా ? ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు హర్రర్ మూవీ

Big Stories

Advertisement
×