E-Paper
Advertisement

Akunuri Murali: హరీష్ రావు పై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సెటైర్లు..?

Akunuri Murali: హరీష్ రావు పై విద్యా కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సెటైర్లు..?
Advertisement

Akunuri Murali: స్వేచ్ఛ బ్యూరో: మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ విద్య కమిషన్ చైర్మన్ ఆకునూరి మురళి సోషల్ మీడియా ఎక్స్ వేదికగా ఘాటు విమర్శలు చేశారు. తెలంగాణలో పదేండ్ల పాలనలో విద్యావ్యవస్థను భ్రష్టు పట్టించారని, అలాంటి వారికి విద్య గురించి మాట్లాడే నైతిక హక్కు లేదని ఘాటుగా స్పందించారు. కమిషన్ రిపోర్ట్ మొదటి పేజీ కూడా హరీశ్ రావు చదవనట్టుందని ఎద్దేవాచేశారు. అందుకే అందులో ఉన్న విషయాలపై రాయకుండా తమ బృందం విద్యార్హతలపై ప్రజలకు తప్పుడు సమాచారం ఇవ్వడమేంటి బాబు? అంటూ సెటైర్లు వేశారు. తమ విద్యార్హతలను తమనే అడిగితే అందరి వివరాలు ఇచ్చేవాళ్లమని చెప్పారు.

22 మంది ప్రొఫెసర్లు..

తమ బృందంలో ఆరుగురు పీహెచ్‌డీ(PHD) పట్టా పొందరని, అందరూ టీచింగ్ అనుభవం ఉన్నవారేనని తెలిపారు. ఒకరు ఎన్ఐటీ, ఒకరు ఐఆర్ఎంఏ, ఒకరు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ చదివిన వారున్నారన్నారు. 22 మంది ప్రొఫెసర్లు అందరూ ఎడ్యుకేషనలిస్టులేనని, టీచింగ్ అనుభవం ఉన్న వాళ్లేనని స్పష్టంచేశారు. డైరెక్ట్ గా వర్కింగ్ గ్రూప్స్ ద్వారా పాల్గొన్నారన్నారు. ఈ రిపోర్టును ఆకునూరి మురళి ఒక్కడే రాయడనే విషయం హరీశ్ కు ఆమాత్రం తెలియదా అని చురకలంటించారు. పాలసీ రీసెర్చ్ ఎలా చేస్తారో, కమిషన్ ఏం పని చేసిందో అనేది పూర్తి రిపోర్ట్ చదివితే అర్థమవుతుందని సెటైర్లు వేశారు.

Advertisement

Also Read: US-Israel Vs Iran War: అధ్యక్షుడు ట్రంప్ క్లారిటీ.. ఇరాన్ సుప్రీం ఖమేనీ మృతి, ఇరాన్ మీడియా క్లారిటీ

10 వేల మంది కొత్త టీచర్లు..

హరీశ్ రావు తీరు.. ఆడలేక మద్దెల వోడు అన్నట్టుందని ఎద్దేవాచేశారు. సీఎం రేవంత్ రెడ్డి.. కేసీఆర్ కంటే వెయ్యి రెట్లు నయమని, నెలకు ఒక రివ్యూ పెడుతున్నాడన్నారు. తెలంగాణ విద్యా కమిషన్ వేశాడని, యూనివర్సిటీలకు వైస్ చాన్స్ లర్లను నియమించారని కొనియాడారు. అలాగే 10 వేల మంది కొత్త టీచర్లను అపాయింట్ చేశారన్నారు. కేసీఆర్(KCR) ఒక్క గంట అయినా విద్యాశాఖపై రివ్యూ చేశారా? అని ఆకునూరి మురళి ప్రశ్నించారు. విద్యపై రాజకీయాలు వద్దని సూచించారు. కమిషన్ ఇచ్చిన నివేదికపై హరీశ్ రావు టీం సరిగ్గా హోం వర్క్ చేసినట్టు లేదని, చూసుకోవాలని మురళి సూచించారు.

Advertisement

Also Read: Today Movies in TV : ఆదివారం టీవీ సినిమాలు.. ఆ రెండు మస్ట్ వాచ్…

Related News

Voter List Revision: డబుల్ ఓట్లకు చెక్ పెట్టేలా.. ఎన్నికల సంఘం కొత్త యాప్ ఇదే!

రైతులకు గుడ్ న్యూస్.. భూసేకరణ పరిహారంపై మంత్రి ఉత్తమ్ కీలక ఆదేశాలు!

భార్య ప్రైవేట్ వీడియో భర్తకే పంపి.. తోటి ఆఫీసర్‌పై ఐపీఎస్ ట్రైనీ లైంగిక వేధింపులు!

Jawaharnagar: ప్లాట్ల పేరుతో భారీ మోసం.. డబ్బులతో రాత్రికి రాత్రే పరార్..!

బండి, ఈటల రాజీపడితే రాజ్యం వచ్చేస్తుందా? బీజేపీపై రాజాసింగ్ సంచలన వ్యాఖ్యలు!

చంద్రబాబు, నితీష్ మద్దతుతోనే మోడీ ప్రధాని.. విదేశాల్లో ఫోజులు తప్ప ఏం లేదు- కాంగ్రెస్ ఎంపీ!

JNTUH Inspections: మేడ్చల్‌లో హైటెన్షన్.. మల్లారెడ్డి, సీఎంఆర్ కాలేజీల్లో జేఎన్‌టీయూహెచ్ దాడులు!

El Niño Telangana: బిగ్ అలర్ట్.. తెలంగాణలో ఎన్నడూ లేని కరువు గండం..!

Big Stories

Advertisement
×