BigTV English

Drugs scam : పౌల్ట్రీ ముసుగులో మత్తు పదార్థాలు.. కోళ్ల దాన ముసుగున అల్ప్రాజోలం దందా..

Drugs scam : పౌల్ట్రీ ముసుగులో మత్తు పదార్థాలు.. కోళ్ల దాన ముసుగున అల్ప్రాజోలం దందా..
Drugs scam : 
* తీగ లాగితే డొంక కదిలిన వైనం
* ప్రకాశం జిల్లా దర్శి కేంద్రంగా సాగుతున్న వ్యాపారం
* హైదరాబాద్ పరిసర ప్రాంతాలకు అమ్మకం
* ఆల్ఫాజోలం తయారీ కేంద్రం గుట్టు రట్టు చేసిన తెలంగాణ ఎక్సైజ్ టాస్క్ ఫోర్స్
* అల్ప్రాజోలంతో పాటు.. ముడి సరుకు, తయారీ సామాగ్రి స్వాధీనం
* 55 లక్షల విలువైన ఆల్ఫ్రాజోలం పట్టివేత.
* ప్రధాన నిందితుడు తో సహా మరో వ్యక్తి అరెస్టు.
తెలంగాణ సరిహద్దు రాష్ట్రాలైన ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, కర్ణాటక ప్రాంతాల నుండి రాష్ట్రానికి అక్రమంగా సరఫరా అవుతున్న అల్ప్రా జోలం దందాకు చెక్ పెట్టాలని తెలంగాణ ఎక్సైజ్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ప్రయత్నాలు చేపట్టింది. గత కొద్ది నెలలుగా పటిష్టమైన నిఘాతో, పకడ్బందీ వ్యూహంతో ఉన్న ఈ సంస్థ డైరెక్టర్ విబి కమలాసన్ రెడ్డి తన స్టేట్ టాస్క్ ఫోర్స్ తో ఎక్కడికక్కడ ఆల్ఫ్రాజోళం తయారీతో పాటు సరఫరా చేస్తున్న ముఠాలపై దాడులు చేయిస్తూ అల్ప్రాజోలం సరఫరాకు చెక్ పెడుతూ ఉన్నారు. ఈ క్రమంలో గతంలో ఘట్కేసర్, బోధన్, కామారెడ్డి, నిజామాబాద్  ప్రాంతాలకు అల్ప్రజూలం సరఫరా చేస్తున్న ముఠాల గుట్టు రట్టు చేసి వారిని అరెస్ట్ చేశారు.
అదే విధంగా ఆంధప్రదేశ్‌ రాష్ట్రం నుండి తెలంగాణకు అల్ఫ్రాజోలం సరఫరా చేస్తున్న ముఠాపై గత కొంతకాలంగా నిఘా పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్, ఎస్ టి ఎఫ్ బృందాలు… ఈ రోజు ఆంధ్రప్రదేశ్ ప్రకాశం జిల్లా దర్శి తాలూకా కేంద్రం నుండి తెలంగాణకు కారులో రవాణా చేస్తున్న అల్ట్రాజోలం మత్తుపదార్థాన్ని… పకడ్బందీ సమాచారంతో మిర్యాలగూడలో పట్టుకొని నిందితులను అరెస్టు చేశారు.
 అల్ట్రాజోలంను తరలిస్తున్నారనే సమాచారంతో ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ వివి కమలహాసన్ రెడ్డి ఆదేశాలతో  ఎస్ టి ఎఫ్  ఏ టీమ్‌ ఎక్సైజ్‌సూపరిండెంట్‌ అంజి రెడ్డి, సీఐ నాగరాజుల బృందం  శుక్రవారం దాచ్‌పల్లి అద్దంకి నార్కోటిక్‌పల్లి రహదారిలో మిర్యాలగూడ చౌరస్తాలో తనిఖీలు చేపట్టారు. అద్దంకి నుంచి వస్తున్న మారుతి కారును తనిఖీ చేయగా అల్ఫ్రాజోలం మత్తుపదార్థాన్ని తెలంగాణకు తీసుకొని వస్తూ ఉన్న ముఠా గుట్టు రట్టు అయ్యింది.
నిందితుల నేపథ్యంలో ఇదే 
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రకాశం జిల్లా దర్శి తాలూకాలోని ఉమామహేశ్వరం ప్రాంతానికి చెందిన రాజశేఖర్ రెడ్డి.. కెమికల్ ఇంజనీరింగ్ పూర్తి చేసుకుని ఉపాధి కోసం గత కొన్ని సంవత్సరాల క్రితం హైదరాబాద్ కు వచ్చి స్థిరపడ్డాడు. హైదరాబాదులో పనిచేసుకుంటూనే తన విలాసవంతమైన జీవితానికి సరిపడా డబ్బులను సులువుగా సంపాదించాలని లక్ష్యంతో తన గ్రామంలో పౌల్ట్రీ ఫారాన్ని స్థాపించి,  పౌల్ట్రీ వ్యాపారం ముసుగులో అల్ప్రాజోలం తయారీ యూనిట్ ని ఏర్పాటు చేశాడు. అప్పటినుండి తయారైన అల్ప్రాజోలాన్ని తెలంగాణతో పాటు ఇతర ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నాడు.
ఇక తెలంగాణకు సరఫరా అవుతున్న అల్ప్రాజోలంకి చెక్ పెట్టాలని గత కొంతకాలంగా పటిష్టమైన కార్యాచరణతో ఉన్న ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ తెలంగాణకు సరఫరా అవుతున్న అన్ని మార్గాలు, అన్ని ముఠాలపై పటిష్టమైన నిఘాను ఏర్పాటు చేసింది. రాజశేఖర్ రెడ్డి ప్రకాశం జిల్లా దర్శి తాలూకాలోని ఉమామహేశ్వరం కేంద్రంగా అక్రమ వ్యాపారాన్ని సాగిస్తున్న సమాచారం అందగా… పక్కా ప్లానింగ్ తో ఈ రోజు నిందితుడిని మిర్యాలగూడలో పట్టుకున్నారు. ఈ దాడిలో రూ. 55 లక్షల విలువ చేసే 5.35 కేజీల ఆత్పోజోలం స్వాధీనం చేసుకున్నారు.


Tags

Related News

SC Stay On Elections: గిరిజన వర్సెస్ గిరిజనేతర.. ఆ 23 గ్రామాల్లో స్థానిక ఎన్నికలపై సుప్రీం స్టే

Rain: మళ్లీ అతిభారీ వర్షాలు వచ్చేస్తున్నయ్ భయ్యా.. కమ్ముకొస్తున్న పిడుగుల వాన, అలర్ట్‌గా ఉండండి..!

TGPSC Group-1: గ్రూపు-1 వివాదం కీలక మలుపు.. హైకోర్టులో మరో అప్పీలు

Medaram Maha Jatara: మేడారం మహాజాతర డిజిటల్ మాస్టర్ ప్లాన్ విడుదల

Sammakka-Saralamma: వనదేవతలు సమ్మక్క- సారలమ్మలు అన్ని గమనిస్తున్నారు.. కేంద్రంపై సీఎం రేవంత్ కీలక వ్యాఖ్యలు

CM Revanth Reddy: సమ్మక్క-సారక్కలకు నిలువెత్తు బంగారం సమర్పించిన సీఎం రేవంత్

Heavy Rains: మరో అల్పపీడనం.. నాలుగు రోజులు వర్షాలు దంచుడే దంచుడు..

Hyderabad News: పండగ సమీపిస్తున్న వేళ.. జోరుగా నాన్ డ్యూటీ లిక్కర్, అధికారులు ఉక్కుపాదం

Big Stories

×