2025 Sankranthi Special Song : సంక్రాంతి సంబరాలు మెుదలైపోయాయి. ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో షురూ అయిన సంబరాలకు బిగ్ టీవీ మరింత జోష్ ఇవ్వబోతుంది. బిగ్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో సంక్రాతి స్పెషల్ సాంగ్ శనివారం రాబోతుంది. ఇప్పటికే విడుదలైన ప్రోమో ఆకట్టుకుంటుంది.
“మా ఊరు పల్లెటూరు..” అంటూ ఈ ఏడాది సంక్రాంతి కానుకగా స్పెషల్ సాంగ్ బిగ్ టీవీ యూట్యూబ్ ఛానల్ లో లాంఛ్ కాబోతుంది. శనివారం ఉదయం 10 గంటలకు రాబోతున్న ఈ సాంగ్ లో నటి భ్రమరాంబిక తూటికా స్పెషల్ ఎట్రాక్షన్ గా నిలిచింది. ఇందులో పల్లెటూరి సంక్రాంతి సంబరాలను కళ్ళకు కట్టినట్టు చూపించారు. పల్లెటూరి వాతావరణం, రంగోలి, పచ్చని పొలాలు ఆకట్టుకునేలా ఉన్నాయి. వీటితో పాటు పల్లెటూరి బంధాలు, అప్యాయతలను సైతం చూపిస్తూ సంక్రాంతి సంబరాలను రెండు రోజుల ముందే తీసుకొచ్చేశారు.
ఇక ఈ పాటకు సంగీతం మదీన్ SK అందించగా.. అశ్విని రాథోడ్ పాడాడు. పొద్దుపొడుపు శంకర్ ఈ పాటను రాయగా.. అరుణ్ కొలుగూరి ఎడిటింగ్ వర్క్ చేపట్టారు. రాజేష్ పైండ్ల కొరియోగ్రాఫర్ గా పనిచేయగా.. పోస్టర్లు సాగర్ ముదిరాజ్ అందించారు.
ALSO READ : చక్రవాకం సీరియల్ హీరోయిన్ స్రవంతి గుర్తుందా.. ఇప్పుడెలా మారిపోయిందో చూడండి