E-Paper
Advertisement

నందుస్ వరల్డ్ డైమండ్ షోరూమ్ వీడియో.. ఊహించని రీతిలో ట్రోలింగ్!

నందుస్ వరల్డ్ డైమండ్ షోరూమ్ వీడియో..  ఊహించని రీతిలో ట్రోలింగ్!
Advertisement

Nandus World Video:‘నందుస్ వరల్డ్’… ఈ పేరు గత వారం రోజులుగా మీడియాలో ఎలా వైరల్ అవుతుందో స్పెషల్ గా చెప్పక్కర్లేదు. వీసాలు ఇప్పిస్తామంటూ కోట్లల్లో రమా నందన డబ్బులు వసూలు చేశారంటూ ఇప్పటికే ఇబ్రహీంపట్నం పలు స్టేషన్ లలో కేసులు నమోదు అయ్యాయి కూడా.

ఇక తాజాగా తనపై ఉన్న లుకౌట్ నోటీస్ లని ఎత్తేస్తే తాను లండన్ వెళ్ళిపోతానని ,తన భర్త మధుకర్ భారత్ రాగానే అతన్ని విచారించండి అని పోలీసులని వేడుకున్న సంగతి తెలిసిందే.ఇదిలా ఉంటె తాజాగా గతంలో రమా నందన ఒక జ్యూయెలరీ షో రూమ్ లో తీసుకున్న ఒక వీడియో ఇపుడు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది.

అలా అటు నుంచి అటే వెళ్లిపోతా

Advertisement

విషయానికి వస్తే ..గతంలో రమా నందన ఒక జ్యూయెలరీ షోరూమ్‌కి వెళ్లారు. అక్కడ చాలా కాస్ట్లీ అయిన డైమండ్ పెండెంట్ వేసుకుని అద్దంలో చూసుకుంటూ సరదాగా నవ్వుతూ సందడి చేశారు. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న వారితో “నేను అలా అటు నుంచి అటే వెళ్లిపోతా.. ఎన్ని వేసుకుంటున్నానో చూస్తుంటే అర్థం కావట్లేదా?” అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. దానికి తోడు “వీళ్లంతా మన వాళ్లేలే” అని అనడంతో, ఆ షోరూమ్ స్టాఫ్ కూడా అంతే సరదాగా “మీతో పాటే మేం కూడా వచ్చేస్తాం”అంటూ ఆన్సర్ ఇచ్చారు.

దానికి నందు నవ్వుతూ “అయితే మీరూ తల ఒకటి పెట్టుకొని వచ్చేయండి” అంటూ సరదాగా కామెంట్ చేయడం,ఇక ఈ మూడు రియల్ గా ఎప్పుడు పెట్టుకోము కాబట్టి ఒక ఫోటో తీసుకుంటే పోతుంది అంటూ అనడం ఆ వీడియోలో క్లియర్ గా కనిపిస్తుంది.

ఒక పక్క నేను ఇంత డైలమాలో ఉంటే

Advertisement

ఇక మరో వైపు ఆమె భర్త మాత్రం ఏమీ పట్టనట్టుగా పిల్లలతో ఆడుకుంటూ ఉండటంతో ఒక పక్క నేను ఇంత డైలమాలో ఉంటే మరో వైపు తను పిల్లలతో ఆడుకుంటున్నాడని, అందుకే తను అంత కూల్ గ ఉండగలుగుతున్నాడు అంటూ భర్తని ఉద్దేశించి కామెంట్స్ చేసింది.

దీంతో ప్రస్తుతం నా మీద ఉన్న లుకౌట్ నోటీస్ లని ఎత్తేస్తే తాను లండన్ వెళ్ళిపోతానని రమా నందన అప్పీల్ చేసుకోవడంతో ఈ వీడియో పై తమ దైన శైలిలో కౌంటర్లు వేస్తున్నారు నెటిజన్లు.ఈ క్రమంలో ఒక నెటిజన్ ఈ వీడియో ని పోస్ట్ చేస్తూ . “అధికారులు కనుక ఒక్కసారి లుకౌట్ నోటీస్ తీసేస్తే చాలు.. మేడమ్ గారు ఇటు నుంచి అటే డైరెక్ట్‌గా లండన్ పారిపోవడమే తర్వాతి పని! మళ్లీ చేతికి కూడా దొరకరు” అంటూ సెటైరికల్ కామెంట్ వేశాడు.

దీంతో ప్రస్తుతం ఉన్న సిట్యుయేషన్ కి ఈ వీడియో సరిగ్గా సింక్ అవడంతో ప్రస్తుతం ఈ వీడియో ఇపుడు సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది.

పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో !

ఒక రకంగా చెప్పాలంటే హీరోలు సింపుల్‌గా బోర్డర్ దాటిపోవాలని ప్లాన్లు వేసినట్టు, ఇక్కడ నందుస్ వరల్డ్ లండన్ ఫ్లైట్ ఎక్కే ప్లాన్‌లో ఉన్నారంటూ జనాలు సెటైర్లు వేస్తున్నారు.చూడాలి మరి లుకౌట్ సర్క్యులర్ ఎత్తేయ్యండి మొర్రో అంటున్న నందన అప్పీల్ పై పోలీసులు ఎలా రియాక్ట్ అవుతారో !

Tags

Related News

ఈశ్వర్ సాయి మాధురి వివాదం.. సూసైడ్ అటెంప్ట్ చేసిన ఈశ్వర్ సాయి వైఫ్ శరణ్య!

హీటెక్కించిన కెప్టెన్సీ రేస్.. భయం పుట్టిస్తున్న ఆటలు!

అభిమానులకు పండు మాస్టర్ రిక్వెస్ట్.. ప్లీజ్ ఆ పని చేయండంటూ!

బిగ్ బాస్ హౌస్‌లో ప్రతి మాట ఎలా రికార్డ్ అవుతుందో తెలుసా?

ఆ స్వేచ్ఛ ఇప్పుడు లేదు.. అనసూయ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!

రైతుబిడ్డ ఝాన్సీ పై ట్రోల్స్.. దిమ్మ తిరిగే కౌంటర్ ఇచ్చిన తల్లి!

తల్లి కాబోతున్న సీరియల్ నటి లావణ్య.. ఘనంగా సీమంతం వేడుకలు!

Big Stories

Advertisement
×