E-Paper
Advertisement

కోట్లలో ముంచారు.. మళ్లీ అదే బాధితులకు వల! 400 డాలర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం

కోట్లలో ముంచారు.. మళ్లీ అదే బాధితులకు వల! 400 డాలర్ల పేరుతో సైబర్ కేటుగాళ్ల కొత్త మోసం
Advertisement

Cyber Fraud Scam: ఒక్క క్లిక్‌ చేస్తే మీ పేదరికం మీ ఇంటి దారిదాపుల్లోకి రాదని ఆశపెట్టారు. ఒక్క యాప్‌ ఓపెన్ చేస్తే కష్టాల్ని పర్మినెంట్‌గా డిలేట్ చేయొచ్చని భ్రమపెట్టారు. వారి మాటలు విని ఆశ.. అత్యాశగా అప్‌డేట్ అయింది.. ఆ అత్యాశ.. అప్పుల దాకా తీసుకెళ్లి వదిలేసింది. ఇదిగో ఈ బాధితులు అలాంటి గోతిలోనే పడ్డారు. QVSE, BonChat అనే యాప్స్‌ని ఎరగా వేసి.. జనం జేబులకు ఏకంగా కోట్లాది రూపాయల కన్నం వేశారు. కష్టపడి సంపాదించడం చాలా ఓల్డ్ ఫ్యాషన్.. ఒక్క క్లిక్‌తో డాలర్ల డ్రీమ్ వరల్డ్‌ని డిజైన్ చేసింది. ఇదేం జాక్‌పాట్ రా బాబు అనుకుని జనం అప్పులు తెచ్చి మరీ ఆ యాప్‌లో గుమ్మరించారు. తీరా మోసం బయటపడి యాప్స్ క్లోజ్ అయిపోయేసరికి బాధితులు గగ్గోలు పెడుతున్నారు. కానీ, ఈ సైబర్ ఫ్రాడ్స్ మాత్రం అక్కడితో ఆగలేదు. దోచుకున్న ఆ కోట్లు చాలదన్నట్లు… జనాలను మళ్లీ బకరా చేయడానికి అపోలో యాప్, అపోలో ఎక్స్ఛేంజ్ పేరుతో మరో డ్రామా స్టార్ట్ చేశారు.

దొంగలు పంపే లేటెస్ట్ మెసేజ్ ఏంటో తెలుసా?

Advertisement

ఇంతకీ ఈ సైబర్ దొంగలు పంపే లేటెస్ట్ మెసేజ్ ఏంటో తెలుసా? మీ పాత ఇన్వెస్ట్‌మెంట్ సేఫ్‌గా ఉండాలన్నా, విత్‌డ్రా అవ్వాలన్నా.. మళ్లీ 400 యూఎస్ డాలర్లు యాక్టివేషన్ ఫీజు కింద డిపాజిట్ చేయాలని కండిషన్ పెట్టేశారు. అంతటితో ఆగకుండా యూఏఈ టైమ్ ప్రకారం మధ్యాహ్నం 2 గంటలకు, రాత్రి 7 గంటలకు అధికారికంగా ట్రేడింగ్ షెడ్యూల్ ఉంటుందంటూ కలరింగ్ ఇస్తున్నారు. పాత పైసలు వెనక్కి రావాలంటే కొత్తగా మరో 400 డాలర్లు సమర్పించుకోవాల్సిందేనని మోసంపై మోసం చేస్తున్నారు.

సైబర్ కేటుగాళ్లకు పెద్ద ప్లస్ పాయింట్‌..

Advertisement

ఇక ఇక్కడొక షాకింగ్ ట్విస్ట్ ఏంటంటే… కోట్లాది రూపాయలు పోగొట్టుకున్నా బాధితులు మాత్రం పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కడానికే భయపడుతున్నారు. సమాజంలో పరువు పోతుందేమో అనే భయంతో గుట్టుచప్పుడు కాకుండా ఇంట్లోనే కుమిలిపోతున్నారు. కానీ, బాధితులు చూపిస్తున్న ఈ సైలెన్సే.. ఆ సైబర్ కేటుగాళ్లకు పెద్ద ప్లస్ పాయింట్‌గా మారింది. అందుకే పోలీసులు గట్టిగా వార్నింగ్ ఇస్తున్నారు. అపోలో పేరుతో వచ్చే ఫేక్ మెసేజ్‌లను నమ్మి మళ్లీ ఒక్క రూపాయి కూడా పంపొద్దు, పరువు పక్కనపెట్టి వెంటనే సైబర్ క్రైమ్ పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని చెబుతున్నారు.

Also Read: బ్యాంకర్లపై సీఎం చంద్రబాబు ఫైర్.. ఎస్‌ఎల్‌బీసీ మీటింగ్‌లో క్లాస్!

Tags

Related News

కేసీఆర్‌కు సొంత ఇల్లు కూడా లేదు..కానీ ఆయన వందల ఎకరాలున్న కుటుంబంలో పుట్టారు!

కేసీఆర్ కుటుంబానికి బిగుసుకున్న ఉచ్చు.. భూ అక్రమాలపై సిట్ విచారణకు ప్రభుత్వం సిద్ధం!

పశ్చిమాసియాలో హైటెన్షన్.. యుద్ధానికి అమెరికా గ్రీన్ సిగ్నల్!

రేవంత్‌ విప్పిన బీఆర్‌ఎస్‌ భూ బాగోతం చిట్టా! నిషేధిత భూములపై క్లారిటీ.. భూదోపిడీపై ఖుల్లం ఖుల్లా..!

నోటి దూలతో కొంపముంచుకున్నారా.. ఆ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడిపై కేసీఆర్ వేటు..?

టీ కాంగ్రెస్ పార్టీలో ఆ ఒక్క పోస్ట్ యమ హాట్ గురు.. ఇక అందరి చూపు అటువైపే!

మేనల్లుడి షాక్‌తో కంటతడి పెట్టిన బొత్స.. విజయనగరంలో సైకిల్ వైపు వైసీపీ కేడర్!

Big Stories

Advertisement
×