E-Paper
Advertisement

TG Congress MPs: కాంగ్రెస్‌లో గప్ చుప్ క్రికెట్ టీమ్.. ఈ మౌనం దేనికి సంకేతం..?

TG Congress MPs: కాంగ్రెస్‌లో గప్ చుప్ క్రికెట్ టీమ్.. ఈ మౌనం దేనికి సంకేతం..?

TG Congress MPs: కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్‌లపై గెలిచారు.. పార్టీ గుర్తించి అవకాశం ఇస్తే పార్లమెంట్ అత్యున్నత సభల ప్రతినిధులుగా హస్తినకు వెళ్ళారు. కానీ తాము ఎన్నికైన తెలంగాణలో మాత్రం కనిపించడం లేదనే విమర్శలు గుప్పుమంటున్నాయి. ప్రతిపక్షాలు అధికారపార్టీ పై విమర్శలు చేస్తుంటే కనీసం వారి నుంచి ఎలాంటి స్పందన లేకపోవడం చర్చల్లో నలుగుతోంది. ఎంపీలు అయిన వారిలో కొందరు గాంధీభవన్ మెట్లు కుడా ఎక్కడం లేదని పార్టీ శ్రేణులు అసహనంతో కనిపిస్తున్నాయి.. ఇంతకీ ఎవరా ఎంపీలు..? వారు గెలిచాక సైలెంట్ అవ్వడం వెనుక లెక్కలేంటి?

లైట్ తీసుకుంటున్నారా..?

తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో కీలక పదవుల్లో ఆ 11 మంది లీడర్స్ ఎక్కడ? క్రికెట్ టీమ్‌లా 11 మందితో మంచి టీమ్ ఉంది కాని పొలిటికల్ గేమ్ మాత్రం ఎందుకు అడటం లేదు? సీఎం రేవంత్‌రెడ్డి, ప్రభుత్వం పై ప్రతిపక్షాలు ఘాటుగా విమర్శలు చేస్తుంటే ఆ నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? ఆ నేతలకు వాయిస్ లేదా? లేకపోతే మనకెందుకులే అని లైట్ తీసుకుంటున్నారా? అనే చర్చ గాంధీభవన్ వర్గలో జోరుగా సాగుతుంది. వారు ఎవరో కాదు తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఎంపీలు..

మొదటిసారి గెలిచిన వారు

గత లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీఫామ్ పై రాష్ట్రం నుండి 8 మంది ఎంపీలు గెలిచారు. ఇందులో యువనాయకులు మొదటిసారి గెలిచిన వారు ఉన్నారు. భువనగిరి పార్లమెంట్ నుండి చామల కిరణ్ కుమార్ రెడ్డి, వరంగల్ ఎంపీగా కడియం కావ్య, పెదపల్లి పార్లమెంట్ సభ్యుడిగా గడ్డం వంశీ కృష్ణ, నల్గొండ పార్లిమెంట్ స్థానంనుండి రఘువీర్ కందుకూరు, ఖమ్మం ఎంపీగా రఘురామ్ రెడ్డి మొదటిసారి లోక్‌సభలో అడుగుపెట్టారు. ఇక నాగర్‌కర్నూల్ నుండి మల్లు రవి, మహబూబాబాద్ పార్లిమెంట్ నుండి బలరాం నాయక్, జహీరాబాద్ పార్లమెంట్ నుండి గెలిచిన సురేష్ షేట్కార్‌లు సీనియర్ ఎంపీలు.

Also Read: Mudra Loan Scam: ముద్ర లోన్​ పేరుతో మోసాలకు తెరలేపిన గ్యాంగ్.. అరెస్ట్ చేసిన పోలీసులు

ముగ్గురు కీలక నేతలే..?

ఇక మరో ముగ్గురు రాజ్యసభ సభ్యులు కాంగ్రెస్ నుంచి పదవులు అలంకరించారు.. పార్టీ లో సీనియర్ నాయకురాలు ఫైర్ బ్రాండ్‌గా పేరున్న రేణుక చౌదరి, తెలంగాణ యువజన కాంగ్రెస్ తొలి అధ్యక్షుడు జోగినపల్లి అనిల్ కుమార్ యాదవ్, ఇటీవలే ఎన్నికైన అభిషేక్ సింఘ్వీ. ఈ ముగ్గురు కూడా పార్టీలో చాలా కీ రోల్ ప్లే చేసే సత్తా ఉన్న నాయకులే.. పార్టీ కోసం కష్టపడిన వారు పార్టీ లాయలిస్ట్‌లు అనే పేరు ఉన్న నాయకులే . అందుకే వారికి రాజ్యసభ సభ్యత్వాలు దక్కాయి.

విమర్శలపై స్పందన కరువు..

ఐతే ఈ పదకొండు మంది ఎంపీలు రాష్ట్రంలో ప్రతిపక్షాలు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పధకాలు, కొత్త పాలసీ లపై ఘాటుగా విమర్శలు చేస్తుంటే స్పందించడం లేదనే విమర్శలు ఎక్కువవుతున్నాయి. ప్రభుత్వంపైనే కాదు సీఎం రేవంత్‌ రెడ్డి(CM Revanth Reddy), డిప్యూటీ సీఎం మల్లు భట్టి విక్రమార్కలతో పాటు మంత్రులపై ప్రతిపక్షలు సెటైర్లు విసురుతూ.. విమర్శలు చేస్తున్నా కాంగ్రెస్ ఎంపీలు ఏమాత్రం రియాక్ట్ అవ్వకపోవడంపై హస్తం పార్టీలో జోరుగా చర్చ సాగుతోంది.

స్పందిస్తున్న నేతలు వీరేనా..

ప్రతి విషయంలో ప్రభుత్వం మంచి చేస్తున్నా తప్పుపడుతూ విపక్షాలు విరుచుకు పడుతుంటే పార్టీ నుంచి గెలిచిన ఎంపీలు మాత్రం మౌనంగా ఉంటున్నారని, అందుకేనా పార్టీ వారికి టికెట్ లు ఇచ్చిందని కాంగ్రెస్ శ్రేణులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ఒక్క భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌ రెడ్డి(MP Chamala Kiran Kumar Reddy) మాత్రమే అడపాదడపా విపక్షాలపై మండిపడుతూ వీడియోలు రికార్డు చేసి విడుదల చేస్తున్నారు. మరో రాజ్యసభ ఎంపీ అనిల్‌ కుమార్‌ యాదవ్(Anil Kumar Yadav) హైదరాబాద్‌లో పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు తప్ప మిగతా ఎంపీలు ఎందుకు మౌనంగా ఉంటున్నారనే చర్చ జోరుగా నడుస్తుంది.

Also Read: GHMC: జీహెచ్ఎంసీకి మూడు కార్పొరేషన్లు.. ముగ్గురు ఆఫీసర్లు..?

మొదటిసారి గెలిచిన యువ నేతలు

పార్లమెంటుకు ఎన్నికైన సీనియర్లు కూడా ప్రతిపక్షాల విమర్శలను పట్టించుకోక పోవడం విమర్శలు పాలవుతోంది. మొదటిసారి గెలిచిన యువ నేతలు గడ్డం వంశీ కృష్ణ, రఘువీర్, కడియం కావ్య అలాగే ఖమ్మం ఎంపీ రఘురాం‌రెడ్డిలు ఐతే ఇప్పటివరకు ఎక్కడ మాట్లాడిన దాఖలు కూడా కనిపించలేదని గాంధీభవన్ వేదికగా విమర్శలు వినిపిస్తున్నాయి. ఇక సీనియర్ ఎంపీలు రేణుకాచౌదరి, మల్లు రవి, బలరాం నాయక్, సురేష్ షేట్కార్ లు సైతం తమకు అంత రాజకీయ అనుభవం ఉన్నా ఎక్కడా మాట్లాడకపోతుండటం అందర్నీ ఆశ్చర్చపరుస్తోంది.

ముఖం చూపించి వెళ్లడం

ఇక అందులో చాలా మంది ఎంపీలు అసలు గాంధీభవన్ మెట్లు కూడా ఎక్కడం లేదు. కేవలం ఇన్ ఛార్జ్ వచ్చిన్నపుడు నిర్వహించే సమావేశాల్లో ముఖం చూపించి వెళ్లడం తప్ప ప్రెస్ మీట్‌లు కూడా పెట్టడం లేదు. మరి వీరి మౌనంగా వెనుక మతాలబు ఏంటి..? పార్టీ ఎలాంటి డైరెక్షన్ ఇవ్వడం లేదని మౌనంగా ఉంటున్నారా? లేక గెలిచాం.. మన పని మనం చేసుకుందామని సైలెంట్ గా ఉండిపోతున్నారా? అన్నది కాంగ్రెస్ వర్గాలకు అంతుపట్టడం లేదంట. మరి ఆ యంగ్ ఎంపీలు, సీనియర్ సభ్యులు ఎప్పటికి వాయిస్ రైజ్ చేస్తారు? అసలు ఎప్పటికైనా మాట్లాడతారా? అన్నది చూడాలి.

Story by: Apparao, Big Tv

Related News

Trading Scam: స్టాక్ మార్కెట్ ట్రేడింగ్ పేరుతో రూ. 25 కోట్ల భారీ స్కామ్.. షాక్‌లో బాధితులు..?

Ameenpur Lake: డేంజర్ బెల్స్.. మాయమైపోతున్న అమీన్‌పూ‌ర్ పెద్ద చెరువు..?

కిలాడీ జంట లగ్జరీ లైఫ్ బిల్డప్.. తెరవెనుక కోట్లలో చీటింగ్.. నందూస్ వరల్డ్ జంట అసలు రంగు బట్టబయలు..?

Iran Conflict: ఇజ్రాయెల్‌తో రాజీ.. ఇరాన్‌తో రాజకీయం.. ట్రంప్ ఆడుతున్న ఇంటర్నేషనల్ గేమ్ ఇదే!

సీబీఎస్‌ఈ సెక్యూరిటీని బద్దలు కొట్టిన 19 ఏళ్ల కుర్రాడు.. మళ్లీ తెరపైకి ‘కోఎంప్ట్’ వివాదం..?

గ్రీన్ సిటీనా.. హీట్ సిటీనా? భవిష్యత్తులో మన నగరాలు ఎలా ఉండబోతున్నాయి?

2029లో జమిలి ముహూర్తం.. కేంద్రం మాస్టర్ ప్లాన్ వెనుకున్న అసలు కథ ఇదే!

బెంగాల్ పాలిటిక్స్‌లో బిగ్ ట్విస్ట్.. అభిషేక్ బెనర్జీపై దాడి.. దీదీ వేసిన ‘సింపతీ స్కెచ్’ వర్కౌట్ అవుతుందా?

Big Stories

×