E-Paper
Advertisement

India Mission School: మిషనరీ స్కూల్ పేరుతో కోట్ల దందా? నిబంధనలు పక్కనపెట్టి ఫీజుల వసూళ్లు?

India Mission School: మిషనరీ స్కూల్ పేరుతో కోట్ల దందా? నిబంధనలు పక్కనపెట్టి ఫీజుల వసూళ్లు?
Advertisement

India Mission School: స్వేచ్ఛ, బ్యూరో: భువనగిరి జిల్లా కేంద్రంలోని ఇండియా మిషన్ స్కూల్ నిబంధనలు తుంగలోకి తొక్కి ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్న పట్టించుకోవడంలేదని విద్యాశాఖ అధికారులపై తీవ్ర ఎత్తున విమర్శలు వినిపిస్తున్నాయి. పేద విద్యార్థులకు విద్యానందించాలనే లక్ష్యంతో ఇంటర్నేషనల్ మిషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో మిషనరీల్లోని కొంతమంది పాస్టర్లు ఫాదర్లు కలిపి ఇండియా మిషన్ స్కూల్లో నెలకొల్పారు. కానీ ఆ మిషన్ యొక్క ముఖ్య సూత్రాలను తుంగలో తొక్కి ఈ స్కూలు కరస్పాండెంట్ జూడా విద్యార్థులను విద్యార్థుల తల్లిదండ్రులను, టీచర్లను ఎన్నో రీతులుగా భయభ్రాంతులకు గురి చేస్తూ ఫీజులు కట్టని విద్యార్థులను, తల్లిదండ్రులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న విద్యాశాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు.

సేవా దృక్పథంతో ఏర్పాటు కాసుల కోసం ఆరాటం

ఒకవైపు పేద ప్రజలకు విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని సదుద్దేశంతో నెలకొల్పిన పాఠశాలను వ్యాపార అస్త్రంగా మలుచుకొని ఏకపక్ష నిర్ణయాలతో కరస్పాండెంట్ జూడ కొన్ని లక్షలను తన జేబులోకి వేసుకున్నారని స్కూల్లో కనీసం విద్య హక్కు చట్టం ప్రకారం నియమాలను ఉల్లంఘిస్తూ ఫీజులను ఇతరత్రా ఖర్చులను ఆన్లైన్లో చూపించవలసి ఉన్న ఇక్కడ ఆన్లైన్ వ్యవస్థ ఎక్కడ కూడా కనబడడం లేదు. సేవా దృక్పథంతో ఏర్పాటు చేసిన పాఠశాలలో అధిక మొత్తంలో ఫీజులను వసూలు చేస్తూ ఫీజులు ఘట్టాని విద్యార్థులను టీచర్లను ఇచ్చి ఇంటి వద్ద దిగబెట్టిన సంఘటనలు కోకోలుగా కనిపిస్తున్నాయి. విద్యార్థులను, తల్లిదండ్రులను ఫీజుల పేరుతో మానసికంగా హింసస్తున్న కరస్పాండెంట్ పై కఠిన చర్యలు తీసుకోవాలని విద్యార్థి సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.

Advertisement

Also ReadLPG Vessel: గ్యాస్ కష్టాలకు చెక్.. భారత తీరానికి నందాదేవి రాక!

ఆడిటింగ్ లేదు, లెక్కలు ఉండవు

ప్రతి సంవత్సరం ఫీజులపై, ఉపాధ్యాయుల విద్యార్హత మొదలైన వాటిపై విద్యాశాఖ అధికారుల నియంత్రణ ఉండవలసి ఉన్న అవి ఏవి కనిపించడం లేవు. కొంతమంది మిషనరీలు కలిసి ఏర్పాటుచేసిన ఈ పాఠశాలలో 2017లో కరస్పాండెంట్ జూడ అనేక అక్రమాలు చేశారంటూ భువనగిరి పోలీస్ స్టేషన్ మెట్లు సైతం ఎక్కారు. తక్షణమే కరస్పాండెంట్ పదవి నుంచి తొలగిస్తున్నట్లు మిషనరీ పాస్టర్లు జిల్లా కలెక్టర్ సైతం లిఖితపూర్వకంగా తెలిపారు. తదన అనంతరం కొంతమంది సమూహంగా ఏర్పడి వారి ఆమ్యామ్యాలు అందుకొని ఈ పాఠశాలలో జరిగే సంఘటనలు బయటకు రాకుండా కాసులతో కట్టడి చేయడం కరస్పాండెంట్ జూడ కు వెన్నతో పెట్టిన విద్య.

ప్రశ్నిస్తే అక్రమ కేసులు, వ్యక్తిగత దూషణలు

Advertisement

ఈ పాఠశాలలో జరిగే సంఘటనలపై ప్రశ్నించిన వారిపై అక్రమంగా కేసులు పెట్టడం అనంతరం వారిని మ్యానేజ్ చేయడానికి కొంతమందిని పంపడం పరిపాటిగా మారింది. వినని వారిని వ్యక్తిగతంగా ఆరోపణలు చేస్తూ దిగజారే వ్యాఖ్యలు చేయడం ఈ పాఠశాల కరస్పాండెంట్ నైజం. పాఠశాల కరస్పాండెంట్ పై ఫిర్యాదులు చేసినప్పటికీ పోలీసులు సైతం చర్యలు తీసుకోవడానికి వెనుకడుగు వేస్తున్నారు. భువనగిరి ప్రజాప్రతినిధులు ఎన్నో సంవత్సరాలు పోరాటం చేస్తే ప్రజలందరికీ ఉపయోగపడే రీతిలో హై టెన్షన్ పోల్స్ మంజూరైతే వాటిని కూడా వెయ్యకుండా అడ్డుకున్న ఘనత కరస్పాండెంట్ జూడ దక్కుతుంది. భూమి వేరే పేరు పై ఉండడంతో దీనిని సంవత్సరాలుగా క్యాష్ చేసుకుంటున్న వైనం.ఇండియా మిషన్ లో జరుగుతున్నటువంటి అవకతవకలపై అత్యున్నత స్థాయి రిటైర్డ్ హైకోర్టు జడ్జి చే కమిటీని ఏర్పాటుచేసి పూర్వపరాలను లోతుగా పరిశీలించి చర్యలు తీసుకోవాలని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి, జిల్లా కలెక్టర్ కు సైతం విద్యార్థి సంఘాలు సామాజికవేత్తలు ఫిర్యాదు చేసినట్లు సమాచారం.

Also Read: Land Encroachment: హైడ్రా దెబ్బకు కబ్జాదారులు ఝలక్.. రూ.1650 కోట్ల భూమి రక్షణ

Related News

హైదరాబాద్ సిటీవాసులకు బిగ్ అలర్ట్.. మంగళవారం వరకు ట్రాఫిక్ ఆంక్షలు, ఏయే ఏరియాల్లో

టెక్కీ మృతి కేసులో సంచలన విషయాలు.. అనుక్షణం వెంటాడిన ఆ భయం.. తట్టుకోలేక అర్ధరాత్రి వేళ..

విమాన రంగానికి కొత్త కష్టాలు.. విమానాలపై లేజర్ దాడులు, శంషాబాద్ ఎయిర్‌పోర్టు నాలుగో స్థానం

ORRపై ఘోర విషాదం.. భారీ వర్షం తెచ్చిన ప్రమాదం.. రెండు కార్లు నుజ్జునుజ్జు, ఇద్దరు మృతి

తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్.. ఆ జిల్లాల్లో కుండపోత వర్షాలు.. ఐదు రోజులు ఇంతే!

Rajagopal Reddy: రాజగోపాల్ రెడ్డికి మంత్రి పదవి ఇవ్వాల్సిందే.. జగ్గారెడ్డి డిమాండ్!

Ramchander Rao: హైదరాబాద్‌ను మజ్లిస్ నడిపిస్తోంది.. రాంచందర్ రావు సంచలనం!

Kharif Farming: పాలమూరు జిల్లాలో ఎల్‌నినో దెబ్బ.. భూమిలోనే కుళ్ళిపోయిన పత్తి విత్తనాలు!

Big Stories

Advertisement
×