Numaish Exhibition 2025 : నాంపల్లిలో ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్లో పర్యాటకులకు పెను ప్రమాదం తప్పింది. ఓ అమ్యూస్మెంట్ రైడ్ లో ప్రయాణికులు తలకిందులుగా ఇరుక్కుపోగా.. చాలాసేపు శ్రమించి వారిని బయటకు తీశారు.
నాంపల్లి నుమాయిష్ ఎగ్జిబిషన్‌లో పెను ప్రమాదం తప్పింది. ఈ ఎగ్జిబిషన్‌లో ఈ రోజు సాయంత్రం ఓ అమ్యూజ్‌మెంట్ రైడ్‌లో పర్యాటకులు తలకిందులుగా ఇరుక్కుపోయారు. సుమారు 25 నిమిషాల పాటు తలకిందులుగానే ఉండిపోవటంతో తీవ్ర భయాందోళకు గురయ్యి కేకలు పెట్టారు. అక్కడి చేరుకున్న సహాయక సిబ్బంది వెంటనే సమస్యను గుర్తించి అమ్యూజ్‌మెంట్ రైడ్ ను ప్రారంభించారు. దీంతో అందులో ఉన్న ప్రయాణికులు కిందకి చేరుకున్నారు. అయితే బ్యాటరీ సమస్య కారణంగానే ఇలా జరిగిందని నిర్వాహకులు తెలిపారు. ఏది ఏమైనా ఇలాంటి విషయంలో నిర్వాహకులు అప్రమత్తంగా ఉండాలని.. లేదంటే అమాయకుల ప్రాణాలు పోయే అవకాశం ఉంటుందని పర్యాటకులు హెచ్చరిస్తున్నారు.
ALSO READ : మద్యం కేసులో అసలు భాగస్వామి ఆప్.. ఢిల్లీలో ఆప్‌ను బొందపెడతాం: సీఎం రేవంత్
ఇక ప్రతీ ఏటా హైదరాబాద్ నాంపల్లి గ్రౌండ్ లో ఎంతో గ్రాండ్ గా జరుగుతున్న నుమాయిష్ ఎగ్జిబిషన్ కు ఎంతో డిమాండ్ ఉంది. ప్రతిరోజు వేలాది మంది పర్యాటకులు ఎగ్జిబిషన్ కు వచ్చి సందర్శిస్తూ ఉంటారు. ముఖ్యంగా సెలవు దినాల్లో ఇక్కడ జనాల తాకిడి ఎక్కువగా ఉంటుంది.
దేశంలో పేరున్న రకరకాల చీరలు, చుడీదార్లతో పాటు గృహ ఉపకరణాలు, డ్రై ఫ్రూట్స్ ఈ ప్రదర్శనలు ఎంతో ఆకట్టుకుంటాయి. ముఖ్యంగా పిల్లలకు సంబంధించి ఏర్పాటు చేసిన ప్లేజోన్స్ ప్రత్యేక ఆకర్షణ. ఇక ఒక్కటేమిటి.. ఇక్కడ ప్రతి విషయం ఎంతగానో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. ఈ ఏడాది 84 ఎగ్జిబిషన్ ఎంతో గ్రాండ్ గా ప్రారంభమైంది. ఇందులో దాదాపు 2000 వరకు స్టాల్స్ ను ఏర్పాటు చేశారు. ఈ నెల 3న ప్రారంభమైన ఈ ఎగ్జిబిషన్ ఫిబ్రవరి 15 వరకు జరిగే అవకాశం ఉంది. దేశంలో పలు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడ తమ స్టాల్స్ ఏర్పాటు చేశారు. హైదరాబాదుకు చెందిన వారే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి కూడా నుమాయిష్ ను చూడటానికి పోటెత్తుతారు.