BigTV English

Chandra Babu: సంపద సృష్టిస్తాం.. ప్రజల ఆదాయం పెంచుతాం – రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్

Chandra Babu: సంపద సృష్టిస్తాం.. ప్రజల ఆదాయం పెంచుతాం – రాష్ట్ర వృద్ధి రేటుపై సీఎం చంద్రబాబు ప్రజెంటేషన్

అమరావతి, స్వేచ్ఛ: రాష్ట్ర తలసరి ఆదాయం 2.4 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దేలా ప్రణాళికలు రచిస్తున్నట్టు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. సచివాలయంలో గురువారం అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాష్ట్ర వృద్ధి రేటుపై ప్రజెంటేషన్ ఇచ్చారు. ఇప్పటిదాకా జరిగిన వృద్ధి, ఇకపై చేపట్టబోయే ప్లాన్స్, జగన్ పాలనలో జరిగిన విధ్వసంపై కీలక వ్యాఖ్యలు చేశారు. వృద్ధి రేటును డబుల్ చేస్తే, నాలుగున్నర రెట్ల ఆదాయం పెరుగుతుందన్నారు. ఈ ఏడాది గ్రోత్ రేట్ 12.94 శాతం పెరిగిందని వివరించారు. ఆదాయం పెరిగితేనే ప్రజల జీవన ప్రమాణాలు పెరుగుతాయని చెప్పారు.


వైసీపీ పాలనలో విధ్వంసం

జగన్ పాలనలో రాష్ట్రం తిరోగమనం దిశగా సాగిందని విమర్శించారు చంద్రబాబు. ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారని, అమరావతిని నాశనం చేశారని మండిపడ్డారు. రాష్ట్రానికి పోలవరం జీవనాడి అని, దాన్ని కూడా గోదావరిలో కలిపేశారన్నారు. స్థానికులు కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు భయపడే పరిస్థితికి తెచ్చారని, అమరావతిని మూడు ముక్కలాటలతో సర్వ నాశనం చేశారని ఫైరయ్యారు. పరిశ్రమలు పెట్టాలంటే పారిశ్రామికవేత్తలు హడలిపోయేలా చేశారని వ్యాఖ్యానించారు. రాష్ట్రాన్ని నాశనం చేసి తమకు అప్పగించారని ఆరోపణలు చేశారు. అభివృద్ధి వల్లే సంపద వస్తుందని, కానీ, జగన్ పాలనలో అది జరగలేదని అన్నారు.


ఐటీ తిండి పెడుతుందా?

ఒకప్పుడు ఐటీ తిండి పెడుతుందా అని చాలామంది ఎగతాళి చేశారని ఈ సందర్భంగా గుర్తు చేశారు చంద్రబాబు. కానీ, ఇప్పుడు తెలంగాణలో హైదరాబాద్ చాలా కీలకమైందని వివరించారు. ఐటీ ఇప్పుడు ఎక్కడికో తీసుకువెళ్లిపోతోందని చెప్పారు. రాష్ట్రంలో అభివృద్ధి జరిగితే ఆదాయం పెరుగుతుందని, ఆదాయం పెరిగితే ప్రజల జీవితాలు బాగుపడతాయని తెలిపారు. ఉమ్మడి రాష్ట్రంలో సీఎంగా ఉన్నప్పుడు చేసిన అనేక ఆర్థిక సంస్కరణలు కీలకమైనవని, అదే ఫార్ములాను తాను నమ్ముతానని వివరించారు. ‘పవర్ సెక్టార్‌లో ఎన్నో సంస్కరణలు తెచ్చా. గ్రీన్ ఫీల్డ్ ఎయిర్ పోర్టులు, రోడ్లకు శ్రీకారం చుట్టా. టెక్నాలజీని అడాప్ట్ చేశా’’ అని తెలిపారు.

కూటమి ప్రభుత్వ లక్ష్యం అదే

కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విజన్ 2047 లక్ష్యంగా పెట్టుకున్నామని చంద్రబాబు చెప్పారు. ప్రతి వ్యక్తి ఆర్థికంగా ఎదగడం కోసం ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ఆధార్ కార్డు ద్వారా ఇండియాలో ప్రతి ఒక్కరి వివరాలు తెలుసుకోగలుగుతామని, ఇప్పుడు రాష్ట్రంలోని ప్రతి ఇంటిని జియో ట్యాగింగ్ చేస్తున్నామని వివరించారు. ఆర్థిక అసమానతలు తగ్గించడం కోసం లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని చెప్పారు. పీ4 అనేది గేమ్ చేంజర్‌గా మారుతుందన్నారు. జనాభానూ ఒక ఆస్తిగా తీసుకొని సంపదను సృష్టించే లక్ష్యంతో ముందుకు వెళ్తున్నామని, ఇందులో ప్రజల్ని కూడా భాగస్వామ్యం చేస్తున్నామని వివరించారు. భవిష్యత్‌ను ఊహించి అభివృద్ధి ప్రనాళికలు చేస్తున్నట్టు పేర్కొన్నారు.

సంప్రదాయాలను కాపాడుకోవాలి – మీడియా చిట్‌చాట్‌లో చంద్రబాబు

రాష్ట్రవ్యాప్తంగా కోడి పందాలు జోరుగా కొనసాగాయి. కాళ్లకు కత్తులు కట్టి మరీ నిర్వహించారు. కొందరు ప్రజాప్రతినిధులు వీటిని ప్రారంభించారు. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబును దీనిపై మీడియా ప్రశ్నించగా, చిట్‌చాట్‌లో ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు. మన పండుగను మనం ఘనంగా జరుపుకోవాలని అన్నారు. ప్రజలు ఆస్వాదించే వాటిపై బలవంతం ఎందుకని ప్రశ్నించారు. ఈ సందర్భంగా తమిళనాడు జల్లికట్టు అంశాన్ని లేవనెత్తారు. జల్లికట్టు చూసేందుకు చిన్నప్పుడు తాను వెళ్లిన విషయాన్ని చెప్పారు. జల్లికట్టును నివారించేందుకు ప్రయత్నిస్తే, చివరకు సుప్రీంకోర్టు జోక్యం చేసుకోవాల్సి వచ్చిందన్నారు. కోడి పందాలు కూడా ఎన్నో ఏళ్లుగా జరుగుతున్నాయని, కోళ్లకు కత్తులు కట్టేవారని వివరించారు. కానీ, ఇప్పుడు కోడి పందాలు కమర్షియల్‌గా మారిపోయాయని చెప్పారు. సంప్రదాయం ప్రకారం జల్లికట్టు నిరహిస్తారని, చాలామంది తప్పు పట్టారని తెలిపారు. ఈసారి సంక్రాంతికి సొంత ఊర్లకు 10 లక్షల మంది దాకా వచ్చారని, ఎవరూ సొంత ఊరును మర్చిపోకూడదన్నారు. గతానికి భిన్నంగా ఈసారి ఎక్కువ మంది వచ్చారని, రాష్ట్రంలో రోడ్లు బాగున్నాయని చెప్పారు.

Related News

Pulivendula Politics: పులివెందుల రాజకీయాలు.. 30 ఏళ్లలో రెండోసారి, ఓటర్లు ఫుల్‌ఖుషీ

Pawan Kalyan: రూటు మార్చిన పవన్.. నిన్న మామిడి.. నేడు చీరలు, రేపు?

AP Free Bus Scheme: ఏపీలో ఫ్రీ బస్ స్కీమ్.. ఆ బస్సు లెక్కితే ఉచిత ప్రయాణం ఉండదు

Chandrababu: మళ్లీ జన్మంటూ ఉంటే నాకు అక్కడ పుట్టాలని ఉంది -చంద్రబాబు

Jagan-Sharmila: అన్న పేరెత్తకుండా షర్మిల, చెల్లి పేరు లేకుండా జగన్ రక్షా బంధన్ ట్వీట్లు

AP villages: లం*జబండ.. ఇదేం ఊరండి బాబు, పేరు మార్చాలంటూ.. గ్రామస్తులు గోల!

Big Stories

×