
Mancherial : మేకను ఎత్తుకెళ్లారని అనుమానంతో ఇద్దరు యువకులను తలక్రిందులుగా వేలాడదీశారు. అంతటితో ఆగకుండా తలకొంద పొగబెట్టి చిత్రహింసలకు గురిచేశారు. ఈ అమానవీయ ఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది.
మందమర్రిలోని యాపల్ ప్రాంతానికి చెందిన రాములు మేకలను పెంచుతున్నాడు. 8 రోజుల క్రితం అతను పెంచుతున్న ఓ మేక కనిపించకుండా పోయింది. మేక కనిపించకుండా పోవడానికి అదే ఏరియాకు చెందిన చిలుముల కిరణ్, అతని ఫ్రెండ్ తేజ కారణమని అనుమానించాడు. రాములు కుటుంబ సభ్యులు ఇద్దరినీ పిలిపించి తలకిందులుగా వేలాడదీశారు.
డబ్బులు ఇస్తేనే విడిచిపెడుతామని చెప్పడంతో తాపీమేస్త్రీగా పని చేసే శ్రావణ్ డబ్బులు చెల్లిస్తానని ఒప్పుకొని కిరణ్‌ను విడిచిపించుకొని వెళ్లాడు. కానీ అప్పటి నుంచి కిరణ్ కనిపించకుండాపోయాడని పోలీసులను ఆశ్రయించింది అతని చిన్నమ్మ సరిత. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. కిరణ్ జాడ కోసం గాలిస్తున్నారు. తలికిందులుగా వేలాడిదీన నిందితులను అదుపులోకి తీసుకున్నారు పోలీసులు.