BigTV English

Bandi Sanjay: కేసిఆర్ రెస్ట్.. కేటీఆర్ యాక్టింగ్.. బీఆర్ఎస్ ఖాళీ ఖాయం.. జోస్యం చెప్పిన బండి సంజయ్

Bandi Sanjay: కేసిఆర్ రెస్ట్.. కేటీఆర్ యాక్టింగ్.. బీఆర్ఎస్ ఖాళీ ఖాయం.. జోస్యం చెప్పిన బండి సంజయ్

Bandi Sanjay: నీ అహంకారం దించకపోతే చూడు కేటీఆర్.. ఏం మాట్లాడుతున్నావో చూసి మాట్లాడు.. లేకుంటే నీకు రాజకీయ పుట్టగతులు ఉండవంటూ కేంద్రమంత్రి బండి సంజయ్ శుక్రవారం మాజీ మంత్రి కేటీఆర్ కు చురకలంటించారు. ఇంతలా బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేయడానికి గల కారణాలు ఏవైనా.. ఈసారి కేటీఆర్ పై రుసరుసలాడారు.


కేటీఆర్ నిన్న ఫార్మూలా-ఈ కారు రేస్ గురించి మాట్లాడుతూ.. కాంగ్రెస్, బీజేపీ మైత్రి బంధం రాజ్ భవన్ వేదికగా బయట పడిందంటూ ఘాటుగా కామెంట్స్ చేశారు. అలాగే తనపై కేసు నమోదుకై గవర్నర్ కు ప్రభుత్వం లేఖ రాసిందన్న విషయంపై మాట్లాడుతూ.. అది గవర్నర్ విజ్ఞతకే వదిలేస్తున్నట్లు తెలిపారు. తనకు ఏసీబీ నోటీసులు జారీ చేయలేదని, అయితే ఈ కేసులో జైలుకు వెళ్లేందుకు సిద్ధంగా ఉన్నట్లు, కావాలంటే యోగా సాధన చేసి స్లిమ్ అవుతానంటూ కామెంట్ చేశారు కేటీఆర్.

ఇలా కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కేంద్ర మంత్రి బండి సంజయ్ సీరియస్ కామెంట్స్ చేశారు. కేటీఆర్ కు కళ్లు నెత్తికెక్కాయని, ప్రధాని మోడీపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. కేటీఆర్ అహంకారాన్ని ఖచ్చితంగా దించుతామని, హద్దులు దాటవద్దంటూ బండి అన్నారు. సీఎం రేవంత్ ను కాపాడుతున్నది మేము కాదని, కేటీఆర్ కాపాడుతున్నారన్నారు.


పొద్దున రేవంత్ పై శివాలెత్తడం, సాయంత్రం సెటిల్ చేసుకోవడం కేటీఆర్ అభిమతమన్నారు. అలాగే బీఆర్ఎస్ పార్టీ నుండి పోటీ చేసేందుకు ఎమ్మెల్సీ ఎన్నికలకు అభ్యర్థులు కరువయ్యారని, ఎవరు కూడా సిద్ధంగా లేరన్నారు. కేటీఆర్ తన కామెంట్స్ తో ఏకంగా గవర్నర్ ను అవమానించారన్నారు. కేసీఆర్ రెస్ట్ లో ఉండగా, కేటీఆర్ యాక్టింగ్ చేస్తున్నట్లు, బీఆర్ఎస్ కు క్యాడర్ లేదు.. కెపాసిటీ లేదంటూ.. ఇక తెలంగాణలో బీఆర్ఎస్ ఉండదంటూ కేంద్ర మంత్రి బండి సంజయ్ జోస్యం చెప్పారు.

Also Read: CM Revanth Reddy: టీటీడీ స్థాయిలో యాదగిరిగుట్ట బోర్డు.. అన్ని రికార్డుల్లో ఆ మార్పు చేయండి.. సీఎం రేవంత్

ఇటీవల కేటీఆర్, బండి సంజయ్ మధ్య నోటీసుల వార్ సాగిన విషయం తెలిసిందే. తన గురించి బండి సంజయ్ చేసిన కామెంట్స్ పై కేటీఆర్ నోటీసులు పంపగా, అందుకు రివర్స్ కౌంటర్ ఇచ్చారు బండి సంజయ్. మరో వారం రోజుల్లో కేటీఆర్ క్షమాపణలు చెప్పకపోతే, న్యాయపరంగా పోరాడుతానంటూ కేంద్ర మంత్రి రిప్లై ఇచ్చారు. ఇలాంటి తరుణంలో మరో మారు కేటీఆర్ కామెంట్స్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ చేసిన కామెంట్స్ వైరల్ గా మారాయి. మరి ఈ కామెంట్స్ కి కేటీఆర్ రియాక్షన్ ఎలా ఉంటుందో వేచిచూడాలి.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×