BigTV English

Honeymoon: భార్యతో వెళ్లాల్సిన హనీమూన్‌కు నా ఫ్రెండ్‌తో వెళ్లాల్సి వచ్చింది, దానికి కారణం?

Honeymoon: భార్యతో వెళ్లాల్సిన హనీమూన్‌కు నా ఫ్రెండ్‌తో వెళ్లాల్సి వచ్చింది, దానికి కారణం?

Honeymoon: జీవితంలో అనుకున్నవన్నీ జరగవు. పెళ్లంటే నూరేళ్ల పంట అంటారు. నాకు పెళ్లి వయసు వచ్చేసింది. నేను నేటి తరంలో పుట్టిన పాత బుద్ధులున్న అబ్బాయిని. అమ్మాయిలతో జల్సాలతో చేయడం నాకు రాదు. నిజమైన ప్రేమ కోసమే ఎదురు చూశా. నాకు 20 ఏళ్ల వయసు ఉన్నప్పుడు ప్రీతి పరిచయమైంది. ఆమె నాకు చాలా నచ్చింది. నేను ఎదురు చూస్తున్న కలల రాణి ఆమెని అనిపించింది. మేము అందమైన ప్రకృతిలో ఎంతో విహరించాము. కానీ మా హద్దుల్లోనే ఉన్నాము. కొన్ని సంవత్సరాలు పాటు డేటింగ్ చేశాము. చివరికి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించాము.


పెళ్లంటే మా ఇద్దరమే కాదు, మా కుటుంబాలు కూడా కలవాలి. అందుకే ముందుగా కుటుంబాలను ఒప్పించాము. మా రెండు కుటుంబాలు అతి కష్టంమ్మీద ఒప్పుకున్నాయి. మా పెళ్ళికి వేదికను, తేదీని కూడా ఫిక్స్ చేశాయి. గోవాలో సముద్రం ఒడ్డున అందంగా పెళ్లి చేసుకోవాలని అనుకున్నాము. ప్రీతితో పెళ్లి సెటిల్ అవ్వగానే నా గుండె ఎంతో తేలికపడింది.

కానీ ప్రీతిలో మాత్రం ఎన్నో మార్పులు రావడం గమనించాను. పెళ్లి తేదీ దగ్గరవుతున్న కొద్ది ఆమె ఎందుకో ఒత్తిడికి గురైంది. నాకు దూరం జరుగుతూ వచ్చింది. ఆమె కోసం నేను ఎన్నో పనులు చేసే వాడిని. ఉదయం గుడ్ మార్నింగ్‌తో మొదలుపెడితే రాత్రి గుడ్ నైట్ వరకు పలకరిస్తూనే ఉండేవాన్ని. ఎన్నో రకాల బహుమతులను ఇచ్చేవాన్ని. కానీ ఆమె నా ప్రేమను చికాకుగా భావించింది. నా భావాలు ఆమెకు ఊపిరాడకుండా చేసినట్టు అనిపించాయి.


నేను గోవాలో పెళ్లికి కావాల్సిన ఏర్పాట్లు అన్ని బుక్ చేశాను. పెళ్లి పందిరి నుంచి రిసార్ట్ వరకు అన్నీ బుక్ అయిపోయాయి. చాలా డబ్బు ఖర్చయింది. సరిగ్గా పెళ్లికి కొన్ని రోజులు ముందు ఆమె ఈ పెళ్లి మనకు వర్కఅవుట్ కాదు అంటూ మెసేజ్ పెట్టింది. మన ఇద్దరివీ వేరే దారులు, కలిసి జీవించలేం అని చెప్పింది. దీంతో ఒక్కసారిగా నాకు భూమి బద్దలైనంత బాధ గుండెల్లోంచి తన్నుకొచ్చింది. నేను ఏం తప్పు చేశానో కూడా నాకు అర్థం కాలేదు. అతిగా ప్రేమించడమే నా తప్పేమో అనిపించింది.

నావల్ల నా తల్లిదండ్రులు కూడా చాలా బాధపడ్డారు. బంధువులకు, స్నేహితులకు చెప్పుకున్నాక ఇలా పెళ్లి ఆగిపోవడం మంచిది కాదని ఆమెను ఒప్పించమని ఎంతో కోరారు. కానీ నేను ఆమెను ఒప్పించలేకపోయాను. ఒక్కసారిగా నాకు ప్రపంచం అంతా చీకటిగా మారినట్టు అనిపించింది. స్నేహితులతో మాట్లాడడం మానేశాను. ఒక్కడే ఉండడం మొదలుపెట్టాను. ఇన్‌స్టాలో ఆమెతో కలిసి ఉన్న ఫోటోలను డిలీట్ చేశాను. ఎన్ని చేసినా కూడా నా మనసు సాధారణంగా మారలేదు. ఒంటరి వాడిని అయినట్టు అనిపించింది.

అలాంటి సమయంలోనే నా బెస్ట్ ఫ్రెండ్ వరుణ్ నాకు దేవుడిలా కనిపించాడు. పది రోజులుగా అతని ఫోన్ లిఫ్ట్ చేయకపోవడంతో నేరుగా మా ఇంటికే వచ్చాడు. పరిస్థితిని అర్థం చేసుకున్నాడు. అప్పటికప్పుడు నన్ను, నా తల్లిదండ్రులను కలిపి గోవాకు తీసుకెళ్లాడు. పూర్తిగా అతని ఖర్చుతోనే. అక్కడ నా భార్యతో ఎంజాయ్ చేయాలనుకున్న నేను… నా ఫ్రెండ్ తో వెళ్లాల్సి వచ్చింది.

వరుణ్ నన్ను చూసి ‘గతం గడిచిపోయింది, వర్తమానాన్ని ఎంజాయ్ చేయు. భవిష్యత్తు ఎంతో బాగుండాలని కోరుకో’ అని చెప్పాడు. అతనితో పాటు బైక్ రైడింగ్‌లకు చేశాను. నచ్చినది వండుకొని తిన్నాము. కొన్ని రకాల గోవా వంటకాలు కూడా నేర్చుకున్నాను. అలా వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అందమైన బీచులు, రిసార్ట్‌లు నా మైండ్‌కి ఎంతో రిలీఫ్‌ని ఇచ్చాయి. ముఖ్యంగా నా పక్కన ఉన్న వరుణ్ నాకెంతో ధైర్యాన్ని ఇచ్చాడు. మా అమ్మ నాన్నలను సాధారణ మనుషులను చేశాడు.

అందుకే నా ఫ్రెండ్ వరుణే.. నా థెరపిస్ట్, చీర్ లీడర్, కమెడియన్ అని చెప్పుకుంటాను. బీచ్ లో ఆ నిశ్శబ్ద క్షణాలలో అతను నాలో నింపిన ఉత్సాహం ఎప్పటికీ మర్చిపోలేను. కొన్ని గులకరాళ్ళను సముద్రంలోకి విసురుతూ వరుణ్ ‘నీకిప్పుడు ఇది బాధగా అనిపించవచ్చు. కానీ నన్ను నమ్ము.. నీకు జీవితంలో ఏదో ఒక పెద్ద కానుక రాబోతోంది. నిన్ను అతిగా ప్రేమించే వ్యక్తి రావచ్చు. అందుకే ఈ పెళ్లి క్యాన్సిల్ అయిందేమో’ అని అన్నాడు. నాకు కూడా నిజమే కదా అనిపించింది. నా ఫ్రెండ్ కి ధన్యవాదాలు చెప్పాను. ఈసారి నన్ను ప్రేమించే నా భార్యతో గోవాకు రావాలని కోరుకుంటూ తిరిగి విమానం ఎక్కాము.

Also Read: జిమ్‌లో ఆంటీతో ప్రేమ.. ఆమె భర్త కిల్లర్ అని తెలిస్తే? మరి.. ఆ రిలేషన్ నుంచి అతడు ఎలా భయటపడ్డాడు?

నాలాగా మీ జీవితంలో కూడా హృదయం ఎప్పుడో ఓసారి బద్దలయ్యే ఉంటుంది. అలాంటి సమయంలో తీవ్ర నిర్ణయాలు తీసుకోకండి. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని ఈ క్షణాన్ని దాటేయండి.

(సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతోన్న ఓ వ్యక్తి అనుభవాన్ని ఇక్కడ యథావిధిగా అందించామని గమనించగలరు.)

Related News

Hair Care Tips: వర్షంలో జుట్టు తడిస్తే..… వెంటనే ఇలా చేయండి?

Paneer Effects: దే…వుడా.. పన్నీరు తింటే ప్రమాదమా?

Hair Growth Tips: ఈ టిప్స్ పాటిస్తే.. వారం రోజుల్లోనే ఒత్తైన జుట్టు !

Gut Health: గట్ హెల్త్ కోసం.. ఎలాంటి ఆహారం తినాలి ?

Cucumber Benefits: దోసకాయ తింటే.. నమ్మలేనన్ని లాభాలు !

Mint Leaves: తులసి ఆకులు నేరుగా తింటే ప్రమాదమా? ఏమవుతుంది?

Big Stories

×