BigTV English

Elon Musk on Justin Trudeau : నిన్న ట్రంప్ ను గెలిపించా.. రేపు ట్రూడోను ఒడిస్తా.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Elon Musk on Justin Trudeau : నిన్న ట్రంప్ ను గెలిపించా.. రేపు ట్రూడోను ఒడిస్తా.. ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు

Elon Musk on Justin Trudeau :  సిక్కు వేర్పాటువాదులకు మద్ధతు ఇస్తూ.. భారత్ తో దౌత్య వివాదాలకు కారణం అవుతున్న కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో పై ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. మరికొన్ని నెలల్లోనే కెనడాలో ఎన్నికలు జరగనుండగా.. ఎలాన్ మస్క్ చేసిన వ్యాఖ్యలకు ప్రాధాన్యత ఏర్పడింది.  గత ఎన్నికల్లో మెజార్టీ స్థానాలు సాధించలేకపోయిన ట్రూడో.. ఈ సారైన మంచి సీట్లు సాధించిన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తున్న తరుణంలో ఎలాన్ మస్క్ చేసిన పోస్ట్ వైరల్ గా మారింది.


కెనడాలో ఎన్నికల్ని ప్రభావితం చేసే స్థాయిలో ఉన్న సిక్కుల ఓట్ల కోసం అనేక రకాలుగా ప్రయత్నిస్తున్న ట్రూడో.. రానున్న పార్లమెంటరీ ఎన్నికల్లో కచ్చితంగా ఓడిపోతున్నారని ఎలాన్ మస్క్ కీలక వ్యాఖ్యలు చేశారు. తన సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ ఎక్స్(X) (ట్విట్టర్) ద్వారా మస్క్ తన అభిప్రాయాన్ని వెల్లడించారు. ఒక స్వీడిష్ జర్నలిస్ట్.. జర్మన్ సోషలిస్ట్ ప్రభుత్వం కుప్పకూలిందని, ఇప్పుడు అక్కడ ముందస్తు ఎన్నికల గురించి చర్చలు జరుగుతున్నాయని పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. మూడు పార్టీల సంకీర్ణ పతనం తర్వాత జర్మన్ ఛాన్సలర్ ఓలాఫ్ స్కోల్జ్.. ఓ ఫూల్ గా మిగిలిపోయారంటూ వ్యాఖ్యానించారు. అక్కడి నుంచి క్రమంగా విషయం కెనడా వైపు మళ్లింది.

ఇటీవల అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో ట్రంప్ గెలుపునకు ఎలాన్ మస్క్ గట్టి మద్ధతిచ్చారు. గెలుపు తర్వాత ట్రంప్ సైతం ఎలాన్ మస్క్ ను బహిరంగ వేదికపై ప్రశంసించారు. ఈ నేపథ్యంలోనే.. కెనడాలో ట్రూడో బాధ నుంచి తప్పించుకునేందుకు తమకు మార్గం చెప్పండి అంటూ.. ఓ కెనడా యూజర్ పోస్ట్ చేశారు. దీనికి స్పందించిన ఎలాన్ మస్క్.. రానున్న ఎన్నికల్లో జస్టిన్ ట్రూడో ఓడిపోతున్నారంటూ పోస్ట్ చేశారు. ఈ పోస్ట్.. ఇంటర్ నెట్ లో వైరల్ గా మారింది.


ట్రుడోపై ఇప్పుడే కాదు.. గతంలోనూ ఎలాన్ మస్క్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గత సంవత్సరం, కెనడియన్ ప్రభుత్వం ఆన్‌లైన్ స్ట్రీమింగ్  సంస్థలు.. వాటి సేవల నియంత్రణ కోసం తప్పనిసరిగా నమోదు చేసుకోవాలనే నిబంధన విధించారు. ఈ విషయాన్ని తప్పుబట్టిన ఎలాన్ మస్క్.. ఆ చర్య అవమానకరం అంటూ వ్యాఖ్యానించారు. కెనడా ప్రధాని ట్రూడో.. వాక్ స్వేచ్ఛను అణిచివేసేందుకు ప్రయత్నిస్తోందని మండిపడ్డాడు.

2022లో దేశంలోని ట్రక్కర్లు అంతా తప్పనిసరిగా టీకా తీసుకోవాలనే నిబంధనపై.. ట్రక్కర్లు నిరసన తెలిపారు. వారిని నియంత్రించేందుకు ప్రధాని ట్రూడో దేశ చరిత్రలో మొదటి సారి.. తన అత్యవసర అధికారాలను వినియోగించారు. ఆ చర్యలనూ తప్పుపట్టిన ఎలాన్ మస్క్.. ట్రూడో ను అడాల్ఫ్ హిట్లర్ తో పోల్చారు.

Also Read : గ్రీన్ కార్డులు, హెచ్-1 బీ వీసాల విషయంలో ట్రంప్ దూకుడు.. మనకు లాభమా.? నష్టమా.?

కెనడా పార్లమెంట్లో మొత్తం 338 సీట్లు ఉండగా.. అందులో మెజార్టీ మార్కు కోసం 170 సీట్లు పొందాల్సి ఉంటుంది. కానీ.. ట్రూడో నేతృత్వంలోని లిబరల్ పార్టీ 157 సీట్లతో మైనారిటీ ప్రభుత్వాన్ని నడిపిస్తోంది. ఏ క్షణంలో అయినా… మిత్ర పక్ష పార్టీల మద్ధతు ఉపసంహరించుకుంటే ప్రభుత్వం పడిపోతుంది. పైగా.. లిబరల్ పార్టీలోనే ట్రూడో విధానాలపై తీవ్ర వ్యతిరేకతలు వ్యక్తం అవుతున్నాయి. తను అనుసరిస్తున్న విధానాలపై సొంత పార్టీ ఎంపీలే నిరసనలు తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో ఎలాన్ మస్క్ వ్యాఖ్యలు మరింత ప్రాధాన్యతను సంతరించుకున్నారు.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×