E-Paper
Advertisement

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు..
Advertisement
Bandi Sanjay

Bandi Sanjay : కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు కేసీఆర్ కుట్ర పన్నుతున్నారని బీజేపీ ఎంపీ బండి సంజయ్ సంచలన ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనడానికి కేసీఆర్ ప్లాన్ చేస్తున్నారని అన్నారు. సార్వత్రిక ఎన్నికల తర్వాత ఏమైనా జరగొచ్చని.. కేసీఆర్ కుట్రలతో ఏమైనా చేయగలరని పేర్కొన్నారు.

ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టి బీజేపీ మీదకు ఆ నిందను నెట్టివేస్తారని బండి సంజయ్ విమర్శించారు. కాంగ్రెస్ పార్టీ.. ముందుగా బీఆర్ఎస్‌‌ని బొంద పెట్టాలని సూచించారు. బీజేపీ, బీఆర్ఎస్ ఒక్కటే అంటే జనం నమ్మరని పేర్కొన్నారు. కేసీఆర్ కి ప్రజాస్వామ్యంపై నమ్మకం లేదని.. కుట్రలకు కేరాఫ్ కేసీఆర్ అని విమర్శించారు. రాష్ట్రంలో బీజేపీ కాంగ్రెస్ పోరాటం తర్వాత అని.. ముందు బీఆర్ఎస్ ని బొంద పెడదామని ఆయన సంచలన కామెంట్స్ చేశారు.

Advertisement

దేశంలో మళ్లీ వచ్చేది మోడీ సర్కారే అధికారంలోకి వస్తుందన్నారు. బీజేపీ ఎంపీలు ఎక్కువ గెలిస్తే తెలంగాణ మరింత అభివృద్ధి చెందుతుందని తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలతో సంబంధం లేకుండా బీజేపీని గెలిపించుకోవాలని కార్యకర్తలకు సూచించారు. బీజేపీ గెలిస్తే నిధులు వస్తాయని అన్నారు. రాష్ట్రంలో బీఆర్ఎస్ లేనే లేదని స్పష్టం చేశారు. కాంగ్రెస్ ఎమ్మెల్యేలను కొనేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని తెలిపారు. చాలా మంది ఎమ్మెల్యేలు కేసీఆర్ తో టచ్ లో ఉన్నారని ఆరోపించారు. పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఏదైనా జరగవచ్చని అన్నారు. కేసీఆర్ కుట్ర వల్లే ఏదైనా జరుగుతుందని.. కేసీఆర్ కు చట్టాలంటే గౌరవం లేదని బండి సంజయ్ హాట్ కామెంట్స్ చేశారు.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం సుస్థిరంగా ఉండాలనే కోరుకుంటునని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ విషయంలో జాగ్రత్తగా ఉండాలని కాంగ్రెస్ పార్టీకి సూచించారాయన. ఎమ్మెల్యేలను కాపాడుకోవాల్సిన బాధ్యత కాంగ్రెస్ పార్టీపైనే ఉంటుందని స్పష్లం చేశారు.

Related News

బీజేపీలోకి కొండా సురేఖ.. క్లారిటీ ఇచ్చిన ఎంపీ డీకే అరుణ!

కాన్‌స్టర్ సొల్యూషన్స్ ప్రారంభోత్సవంలో కేటీఆర్ కీలక వ్యాఖ్యలు!

కామారెడ్డి జిల్లాలో ఘోరం.. ఆర్టీసీ బస్సు బోల్తా స్పాట్‌లో 13 మంది..!

మాదాపూర్‌లో ఈ-సిగరెట్ల దందా గుట్టురట్టు.. పోలీసులకు ఎలా చిక్కారంటే..?

ఖమ్మం జిల్లాలో చైనా సైబర్ గ్యాంగ్ దందా కలకలం.. 52 మంది యువకులు అరెస్ట్!

కేసీఆర్‌కు బిగ్ షాక్.. సంచలన నిర్ణయం తీసుకున్న తెలంగాణ కాంగ్రెస్..!

మేడ్చల్ జాతీయ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం.. గాల్లో పల్టీలు కొట్టిన కారు

కొండా సురేఖ బర్తరఫ్‌లో బిగ్ ట్విస్ట్.. నిజాలు బయటపెట్టిన టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్!

Big Stories

Advertisement
×