BigTV English

Bandla Ganesh House Issue: నౌహీరా షేక్ వివాదం.. పోలీసులను ఆశ్రయించిన బండ్ల గణేష్‌ కొడుకు..

Bandla Ganesh House Issue:  నౌహీరా షేక్ వివాదం.. పోలీసులను ఆశ్రయించిన బండ్ల గణేష్‌ కొడుకు..

Bandla Ganesh’s Son House Issue Approached Police: ప్రముఖ నిర్మాత బండ్ల గణేష్‌ కొడుకు ఫిలింనగర్ పోలీసులను ఆశ్రయించారు. ఈడీ కస్టడీలో ఉన్న ఇంటిని మోసపూరితంగా విక్రయించే యత్నంతో పాటు.. డబ్బు తీసుకుని మరీ ఇంటిని ఖాళీ చేయాలంటూ రౌడీలతో దౌర్జన్యానికి దిగిందంటూ హీరా గోల్డ్‌ కుంభకోణం ప్రధాన నిందితురాలు నౌహీరా షేక్‌పై ఫిర్యాదు చేశాడు. దీంతో ఫిలింనగర్‌ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


వివరాల్లోకి వెళితే.. సినీ నిర్మాత బండ్ల గణేష్‌ కుమారుడు హీరేష్‌ ఫిలింనగర్‌ రోడ్డునెంబర్‌–13 సైట్‌–2లోని ప్లాట్‌నెంబర్‌ 15–ఏలో నౌహీరా షేక్‌కు చెందిన ఇంట్లో 2023 నుంచి అద్దెకు ఉంటున్నాడు. అయితే.. ఆ ఇంటిని అమ్ముతున్నట్లు తెలియడంతో ఆ ఇల్లును తామే కొనుగోలు చేస్తామని గత ఏడాది మార్చి 23న నౌహీరాకు రూ.3 కోట్లు అడ్వాన్స్‌గా ఇచ్చాడు.

Read More: మేడిగడ్డపై విపక్షాన్ని టార్గెట్ చేసిన ప్రభుత్వం.. హరీష్ వ్యాఖ్యలకు మంత్రుల కౌంటర్లు


ఇంతలోనే ఆ ఇల్లు ఈడీ కేసులో ఉన్నట్లు తెలియడంతో పూర్తిగా నగదును చెల్లించలేదు. దీంతో మిగిలిన డబ్బను చెల్లించాలని తనపై ఒత్తిడి చేయడమే కాకుండా.. ఇల్లును ఖాళీ చేయాలంటూ ఒత్తిడి చేస్తోందని హీరేష్ పేర్కొన్నాడు.

అంతేకాకుండా ఫిబ్రవరి 15న మధ్యాహ్నం నౌహీరాషేక్‌ 10 మంది రౌడీలతో కలిసి తమ ఇంట్లోకి అక్రమంగా ప్రవేశించిందని, ఇంటిని ఖాళీ చేయాలంటూ బెదిరింపులకు పాల్పడిందని, అసభ్య పదజాలంతో దూషించిందని హీరేష్ ఫిలింనగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

హీరో గోల్డ్‌ రూ. 5వేల కోట్ల కుంభకోణంపై మనీలాండరింగ్‌ కేసులో నౌహీరా షేక్ ను ఈడీ దర్యాప్తు చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆమెకు సంభందించిన భూముల్ని సైతం ఈడీ స్వాధీనం చేసుకుంది.

Tags

Related News

Hyderabad News: జీహెచ్ఎంసీ నిఘా.. ఆ పని చేస్తే బుక్కయినట్టే, అసలు మేటరేంటి?

Weather News: కొన్ని గంటల్లో ఈ ఏరియాల్లో భారీ వర్షం.. ఇక రాత్రంతా దంచుడే

Nagarjunasagar flood: నాగార్జునసాగర్‌ గేట్లు ఎత్తివేత.. సందర్శకులకు బిగ్ అలర్ట్!

Hyderabad Rains: అమీర్‌పేట ముంపు ప్రాంతాల్లో సీఎం రేవంత్ పర్యటన.. అధికారులకు కీలక ఆదేశాలు

Malreddy Ranga Reddy: రంగారెడ్డి ఎమ్మెల్యే మల్‌రెడ్డి కుటుంబంలో రాఖీ పండుగ రోజే విషాదం

Rain News: భారీ వర్షం.. ఈ జిల్లాల్లో కుండపోత వాన.. ఇళ్ల నుంచి బయటకు రావొద్దు

Big Stories

×