BigTV English

Palestine | పాలస్తీనా అధ్యక్షుడిపై హత్యాయత్నం.. సెక్యూరిటీ గార్డు మృతి..

Palestine | పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌పై బుధవారం హత్యాయత్నం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది ఉగ్రవాదులు అధ్యక్షుడు మహమాద్ అబ్బాస్ వెళుతున్న కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అబ్బాస్ భద్రతా సిబ్బంది ఒకరు హతమయ్యారు. ‘సన్ ఆఫ్ అబు జందాల్’ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసినట్లు సమాచారం.

Palestine | పాలస్తీనా అధ్యక్షుడిపై హత్యాయత్నం.. సెక్యూరిటీ గార్డు మృతి..

Palestine | పాలస్తీనా అధ్యక్షుడు మహమూద్ అబ్బాస్‌పై బుధవారం హత్యాయత్నం జరిగింది. స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం.. కొంతమంది ఉగ్రవాదులు అధ్యక్షుడు మహమాద్ అబ్బాస్ వెళుతున్న కాన్వాయ్‌పై కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో అబ్బాస్ భద్రతా సిబ్బంది ఒకరు హతమయ్యారు. ‘సన్ ఆఫ్ అబు జందాల్’ అనే ఉగ్రవాద సంస్థ ఈ దాడి చేసినట్లు సమాచారం.


ఈ ఉగ్రవాద సంస్థ మహమూద్ అబ్బాస్‌కు రెండు రోజుల క్రితం ఒక హెచ్చరిక జారీ చేసింది. 24 గంటల్లో ఇజ్రాయెల్‌పై మహమూద్ అబ్బాస్‌‌ యుద్ధం ప్రకటించాలి.. అలా చేయకపోతే అతడిని చంపేస్తామని హెచ్చరించింది. మంగళవారం ఉగ్రవాదులు ఇచ్చిన గడువు ముగిసింది.

గాజాని ఆక్రమించుకునే యోజనలో ఇజ్రాయెల్
హమాస్‌పై ఇజ్రాయెల్ చేస్తున్న యుద్ధంలో అనేక మంది సామాన్యులు ప్రాణాలు కోల్పోతుండడంపై ఇజ్రాయెల్ ప్రధానిపై ప్రపంచదేశాలు కాల్పుల విరమణ చేయాలని ఒత్తిడి చేస్తున్నాయి. కానీ ఆయన మంగళవారం ఇచ్చిన ఒక ఇంటర్వూలో మాట్లాడుతూ.. యుద్ధం ముగిసిన తర్వాత గాజా భద్రత బాధ్యత తమదేనంటూ చెప్పారు. యుద్ధం ప్రారంభానికి ముందు గాజా.. హమాస్ నియంత్రణలో ఉన్నప్పటికీ.. అక్కడి వాయు, జల క్షేత్రాలు తమ అధీనంలోనే ఉన్నాయని ఆయన పేర్కొన్నారు. యుద్ధంలో హమాస్ కథ ముగిసిన తరువాత గాజా బాధ్యతల్ని ఇజ్రాయెల్ తీసుకుంటుందని తెలిపారు. అంటే.. పరోక్షంగా గాజాను తాము స్వాధీనం చేసుకుంటామని ఆయన ఉద్దేశ్యం.


గాజాలో ఇప్పటివరకు 4100 మంది చిన్నపిల్లలు మృతి
గాజాలో ఇజ్రాయెల్ నిరంతరాయంగా చేస్తున్న బాంబుల దాడిలో 10వేల మందికి పైగా మరణించారు. ఇందులో కేవలం చిన్నిపిల్లలే 4100 మంది ఉన్నారు. 23 లక్షల జనాభా ఉన్న చిన్న ప్రాంతం గాజాలో నెల రోజులకుపై ఇజ్రాయెల్ బాంబుల వర్షం కురిపిస్తూనే ఉంది. ఐక్యరాజ్యసమితి సహా చాలా దేశాలు మనవతా దృక్పథంతో గాజా పౌరుల కోసం ఆహారం, మందులు, పంపిణీ చేస్తున్నాయి. అయినా ఈ సహాయం కూడా వారికి అందకుండా ఇజ్రాయెల్ అడ్డుపడుతోంది. దీంతో ఐక్యరాజ్యసమితి.. ఇజ్రాయెల్ యుద్ధ నేరాలు చేస్తున్నదని మండిపడింది.

Related News

India-US P-8I Deal: అమెరికాకు భారత్ షాక్.. 3.6 బిలియన్ల డాలర్ల డీల్ సస్పెండ్

Donald Trump: ముందుంది ముసళ్ల పండగ.. ట్రంప్ హింటిచ్చింది అందుకేనా?

Modi VS Trump: మోదీ స్కెచ్.. రష్యా, చైనా అధ్యక్షులతో కీలక భేటీ.. ట్రంప్ మామకు దబిడి దిబిడే!

China Support: భారత్ కు చైనా ఊహించని మద్దతు.. డ్రాగన్ లెక్క వేరే ఉందా?

China New Virus: ఏనుగు దోమలు.. డ్రోన్లు.. ఫైన్లు.. చైనాతో మామూలుగా ఉండదు, ఆ వ్యాధిపై ఏకంగా యుద్ధం!

PM Modi: టారిఫ్ వార్.. ట్రంప్‌‌‌పై మోదీ ఎదురుదాడి, రాజీ పడేది లేదన్న ప్రధాని

Big Stories

×