BigTV English

Batti Comments : కలెక్టర్‌ని అంత మాట అంటావా?.. నీకు మర్యాద తెలుసా..? భట్టి విక్రమార్క సీరియస్

Batti Comments : కలెక్టర్‌ని అంత మాట అంటావా?.. నీకు మర్యాద తెలుసా..? భట్టి విక్రమార్క సీరియస్

Batti Comments : జిల్లా కలెక్టర్ ను అగౌరపరిచేలా మాట్లాడడం కేటీఆర్ కు తెలిసిన సంస్కృతి అని.. ఆయన చెప్పినట్లు వినకపోతే ఏ మాట పడితే ఆ మాట అనేస్తారా అంటూ తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమాక్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. వివిధ అంశాలపై మీడియాతో చిట్ చాట్ నిర్వహించిన భట్టి విక్రమార్క.. దేశంలో కాంగ్రెస్ పార్టీ మంచి ఫలితాల్ని సాధిస్తుందని, బీజేపీ పనైపోతుందని వ్యాఖ్యానించారు.


ఇటీవల జార్ఘండ్, మహారాష్ట్ర ఎన్నికల ఫలితాల్లో మహారాష్ట్రలో కాంగ్రెస్ ఒటమిని ముందుపెట్టి చూపిస్తున్నారని.. మరి జార్ఘండ్ లో అద్భుత ఫలితాల్ని ఎందుకు చూడలేకపోతున్నారని ప్రశ్నించారు. ప్రస్తుతం దేశంలో కాంగ్రెస్ మంచి ఫలితాల్నే సాధిస్తుందని చెప్పిన భట్టి విక్రమాక్ర.. కర్ణాటకలో, కేరళ లో గెలిచింది కాంగ్రెస్ పార్టీనే అంటూ గుర్తు చేశారు. ఒక్క మహారాష్ట్రను మాత్రమే పరిగణలోకి తీసుకోవడమేంటని, వెస్ట్ బెంగాల్ లో, మధ్య ప్రదేశ్ లో గెలిచింది కాంగ్రెస్ కూటమి పార్టీలే అంటూ గుర్తు చేశారు. అన్ని చోట్ల ఒకే పార్టీ ఉండాలనే ఆలోచన ప్రజాస్వామ్యంలో మంచిది కాదని, అలాంటి ఆలోచనలు కాంగ్రెస్ పార్టీ చేయదని తెలిపారు. ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే దేశంలో బీజేపీ పతన మొదలైనట్లు కనిపిస్తుందని, కాంగ్రెస్ క్రమంగా పుంజుకుంటుదని తెలిపారు.

స్థానిక సంస్థల ఎన్నికలు
రాష్ట్ర ప్రభుత్వం అనేక విషయాలపై లోతైన కసరత్తులు చేస్తుందన్న ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క.. స్థానిక సంస్థల ఎన్నికలపై కీలక విషయాల్ని వెల్లడించారు. రిజర్వేషన్ల ప్రాతిపదికన స్థానిక ఎన్నికలు నిర్వహించాలనే విషయమై.. త్వరలోనే పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమావేశమవుతారని వెల్లడించారు.


ప్రభుత్వ పథకాలు

కాంగ్రెస్ పార్టీ మాట ఇచ్చినట్లుగా రాష్ట్రంలో అన్ని వర్గాల్లోని లబ్దిదారులకు ప్రభుత్వ పథకాలు అందిస్తామని వెల్లడించిన భట్టి విక్రమార్క.. ఇందిరమ్మ ఇళ్లను త్వరలోనే పంపిణీ చేస్తామంటూ ప్రకటించారు. రైతు భరోసా పథకాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుందని తెలిపిన ఉప ముఖ్యమంత్రి.. రైతు భరోసా విధివిధానాలపై త్వరలోనే స్పష్టతనిస్తామని తెలిపారు. బీఆర్ఎస్ పార్టీ తొమ్మిదేళ్ల పాలనలో నూతన రేషన్ కార్డులను అందించలేదని కానీ ఇప్పుడు తమపై విమర్శలు చేస్తుండడం విడ్డూరంగా ఉందని వ్యాఖ్యానించారు. ఎన్నికల్లో ప్రజలకు రుణమాఫీ చేస్తామని హామి ఇచ్చి గెలిచిన బీఆర్ఎస్ ప్రజల్ని మోసం చేసిందని అన్నారు. కానీ కాంగ్రెస్ పార్టీ హామి ఇచ్చినట్లుగా 15 రోజుల్లోనే రూ.18 వేల కోట్లు రుణమాఫీ చేసి చూపించిందని.. అర్హులైన అందరికీ కచ్చితంగా మాఫీ అందిస్తామని తెలిపారు.

బీజీపీ విడగొడుతుంది
దేశంలోని ప్రజల్ని మతాల పేరిట భారతీయ జనతా పార్టీ విడదీస్తుందన్న భట్టి విక్రమార్క.. రాహుల్ గాంధీ మాత్రం ప్రజల్ని కలపాలనే సంకల్పంతో ఉన్నారని తెలిపారు. దేశ ప్రజలకు ఎవరి నిష్పత్తి ప్రకారం వారికి ప్రయోజనాలు చేకూర్చేందుకు కులగణన తీసుకువచ్చారని వెల్లడించారు. తెలంగాణాలో ఎవరి కులం ఎంత మేర ఉందనేది.. ప్రస్తుత సర్వే తర్వాత తెలుస్తుందన్న భట్టి విక్రమార్క, అవసరమైతే ఈ విషయమై డిబెట్ పెడదామని అన్నారు.

కేటీఆర్ కి మర్యాద తెలియదు
ప్రభుత్వ అధికారులంతా తాము ఏది చెబితే అది వినాలని కేటీఆర్ భావిస్తున్నారని భట్టి విక్రమార్క విమర్శించారు. అందుకే.. జిల్లా కలెక్టర్ ని పట్టుకుని సన్నాసి అంటూ తిట్టారని, ఆయనకు మర్యాద తెలియదని ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా అధికారులు బీఆర్ఎస్ పార్టీ చెప్పినట్లు వినరని, వాళ్లు చట్టం, నిబంధనల ప్రకారం వెళతారని తెలిపారు. కొద్ది రోజులుగా కేటీఆర్ ఏది పడితే అది మాట్లాడ్తున్నారని, ఆయనలా ప్రజా ప్రభుత్వంలో నిర్బంధ ఆంక్షలు లేవని తెలిపారు. తాము నిత్యం ప్రజలకు అందుబాటులో ఉంటున్నామని అన్నారు. గౌతమ్ అదానీ వ్యవహారంపై విచారణ జరగాలి కేంద్రాన్ని డిమాండ్ చేశారు. గురుకులాల నిర్వహణపై ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందన్న ఉప ముఖ్యమంత్రి.. తమను రాజకీయంగా విమర్శించేందుకు గురుకులాల్ని అడ్డం పెట్టుకోవద్దని హితవు పలికారు.

Related News

Hyderabad floods: హైదరాబాద్‌కు భారీ వర్షాల భయం పోతుందా? సీఎం రేవంత్ రెడ్డి కొత్త ప్రణాళిక ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Sunil Kumar Ahuja Scam: వేల కోట్లు మింగేసి విదేశాలకు జంప్..! అహూజా అక్రమాల చిట్టా

Phone Tapping Case: ప్రూఫ్స్‌తో సహా.. ఉన్నదంతా బయటపెడ్తా.. సిట్ విచారణకు ముందు బండి షాకింగ్ కామెంట్స్

Big Stories

×