Kavya Maran – SRH : ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2025 టోర్నమెంట్ వేలం ముగిసిన సంగతి తెలిసిందే. ఈ తరుణంలోనే.. చాలా మంది ప్లేయర్లపై కోట్ల వర్షం కురిసింది. ఈ వేలంలో హైదరాబాద్ జట్టు కూడా కొత్త ప్లేయర్లను కొనుగోలు చేసింది. ఇక భువనేశ్వర్ కుమార్ ఐపీఎల్ లో సన్రైజర్స్ హైదరాబాద్ జట్టుకు కీలకంగా నిలిచాడు. బౌలింగ్ విభాగం స్ట్రాంగ్ అనుకునేలా భువి తనవంతు పాత్ర పోషించాడు. 2014 వేలంలోనే సన్రైజర్స్ హైదరాబాద్ జట్టులో అడుగుపెట్టాడు. అప్పటినుంచి ప్రతి సీజన్‌లో తన ప్రత్యేకతను చాటుకున్నాడు. బౌలింగ్ లో వేరియేషన్స్ చూపించి సన్రైజర్స్ ( SRH ) విజయాల్లో తన మార్కును చూపించాడు.
అయితే ఈసారి భువనేశ్వర్ కుమార్ సన్రైజర్స్ హైదరాబాద్ వదిలేసుకుంది. వేలంలోనూ ఏ దశలోనూ భువనేశ్వర్ పైన ఆసక్తిని చూపించలేదు కావ్యా పాప ( Kavya Maran ). ఒక్కసారి కూడా భువనేశ్వర్ కుమార్ కోసం బిడ్ వేయలేదు. వేలంలో ఈ వెటరన్ బౌలర్ పట్ల రెండు కోట్ల బేస్ ప్రైస్ తో బరిలోకి దిగాడు. ఆరంభం నుంచి ముంబై ఇండియన్స్, లక్నో సూపర్ జెయింట్స్ పోటీపడ్డాయి. చివరిలో రాయల్ చాలెంజర్స్ బెంగళూరు ఎంట్రీ ఇచ్చింది. 10 కోట్ల 75 లక్షలకు దక్కించుకుంది. భువనేశ్వర్ పైన నమ్మకాన్ని చూపించింది.
ఈ వెటరన్ బౌలర్‌తో ఆర్సిబికి అడ్వాంటేజ్ ఉంటుందని నమ్మింది. ఐపీఎల్ కెరియర్ లో భువనేశ్వర్ కుమార్ ( Bhuvaneshwar kumar ) 176 మ్యాచ్లో బరిలోకి దిగాడు. 181 వికెట్లు తీశారు. గత సీజన్లో 16 మ్యాచుల్లో 11 వికెట్లు దక్కించుకున్నాడు. భువనేశ్వర్ ను వద్దనుకున్న సన్రైజర్స్ హైదరాబాద్ మరో సీనియర్ బౌలర్ జయదేవ్ ఉనద్కట్ కు జై కొట్టింది. వేలంలో జయదేవ్ కోసం ఇతర ఫ్రాంచైజీలు ఏవీ పోటీ పడలేదు. దీంతో బేస్ ప్రైస్ కోటి రూపాయలకే సన్రైజర్స్ కొనుగోలు చేసుకుంది.
ఐపీఎల్‌లో జయదేవ్‌కు మంచి అనుభవం ఉంది. ఇప్పటివరకు 105 మ్యాచుల్లో బరిలోకి దిగాడు. 99 వికెట్లు సాధించాడు. ఐదు వికెట్ల ఘనతను రెండుసార్లు అందుకున్నాడు. గత సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరపున 11 మ్యాచుల్లో 8 వికెట్లు తీశాడు. గతంలో కేకేఆర్, ఆర్ సి బి, ఢిల్లీ, ఎల్ ఎస్ జి, రాజస్థాన్ రాయల్స్, ముంబై ఇండియన్స్ తరపున బరిలోకి దిగాడు. 2024 సీజన్ నుంచి హైదరాబాద్ తోనే ట్రావెల్ అవుతున్నాడు.
మరోవైపు గత సీజన్ లో అదరగొట్టిన సన్రైజర్స్ హైదరాబాద్ ఈసారి కూడా బలంగానే ఉంది. ముందుగానే కమిన్స్, క్లాసెన్, నితీష్ కుమార్ రెడ్డి, ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మను రిటైన్ చేసుకుంది. వేలంలో ఇషాన్ కిషన్, మహమ్మద్ సిరాజ్, షమీ, హర్షద్ పటేల్, ఆడమ్ జంపా వంటి స్టార్లను తీసుకుంది. నిజానికి రిటైన్ చేసుకున్న ప్లేయర్ల కోసమే ఎస్సారెస్ 75 కోట్లను ఖర్చు చేసింది. 45 కోట్లతో వేలంలో పాల్గొంది. వాస్తవంగా ఈ సారి వేలంలో.. షమీతో పాటు భువనేశ్వర్‌ను కొనుగోలు చేస్తే.. హైదరాబాద్ మరింత బలంగా తయారయ్యేది. ఉనద్కత్ ను కొనుగోలు చేసి తప్పిదం చేసింది. రాహుల్ చాహర్, జంపాకు బదులు సుందర్ ను తీసుకుంటే అయిపోయేది.
Also Read: Vaibhav Suryavanshi – Babar Azam: పరువు పాయె…13 ఏళ్ల వైభవ్ కంటే….పాకిస్థాన్ బాబర్ జీతం తక్కువే ?