BigTV English

Bhadrachalam MLA Tellam Venkatrao: భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ఇద్దరు ప్రెగ్నెంట్ మహిళలకు సర్జరీ

Bhadrachalam MLA Tellam Venkatrao: భద్రాచలం ఎమ్మెల్యే వెంకట్రావు, ఇద్దరు ప్రెగ్నెంట్ మహిళలకు సర్జరీ

Bhadrachalam MLA Tellam Venkatrao news(Telangana news): భారీ వర్షాలతో గోదావరి ప్రవాహం పెరిగింది. అయితే పోలవరం బ్యాక్ వాటర్‌ కారణంగా వరదలో కొన్నిప్రాంతాలు అందులో చిక్కుకున్నాయి. పలు గ్రామాలకు అత్యవసర ట్రీట్మెంట్ అందలేదు. ఈ క్రమంలో భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావు ఇద్దరు ప్రెగ్నెంట్ మహిళల‌కు ప్రభుత్వ ఆసుపత్రిలో అత్యవసర ఆపరేషన్ చేశారు. ప్రస్తుతం తల్లి-బిడ్డలు క్షేమంగా ఉన్నారు.


మంగళవారం భద్రాచలం ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి ఇద్దరు గర్భిణులు వచ్చారు. ప్రసవ వేదన కారణం గా వారికి సిజేరియన్ చేయాల్సివచ్చింది. ఆసుపత్రిలో ఐదుగురు డాక్టర్లు ఉండాలి. నలుగురు బదిలీపై వెళ్లిపోయారు. మరొకరు కోర్టు పని మీద బయటకు వెళ్లారు. ఈ క్రమంలో సిజేరియన్ చేయాల్సిరావడంతో మిగతా సిబ్బంది కంగారుపడ్డారు. వారిని వేరే చోటకు తరలించాలన్నా సాధ్యం పడలేదు.

ఈ విషయాన్ని భద్రాచలం ఎమ్మెల్యే తెల్లం వెంకట్రావుకు తెలిపారు. వరద సహాయక చర్యల్లో ఉన్న డాక్టర్ ఎమ్మెల్యే, వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. ఇద్దరు గర్బణిలకు ఆపరేషన్ చేశారు. ఆ మహిళలు బిడ్డల తో క్షేమంగా ఉన్నారు. ఎమ్మెల్యే సేవలను మహిళల బంధువులు ప్రసంశించారు. దుమ్ముగూడెం మండలం రేగుబల్లికి చెందిన స్వప్న రెండో కాన్సుల మగబిడ్డకు జన్మనిచ్చింది. అలాగే చర్ల మండలం అంబేద్కర్ నగర్‌కు చెందని పుష్పలీల రెండో కాన్పులో ఆడబిడ్డను ప్రసవించింది.


ALSO READ: హైదరాబాద్‌లో ఉదయాన్నే భారీ అగ్ని ప్రమాదం.. చిన్నారి మృతి

వృత్తి రీత్యా వైద్యుడైన డాక్టర్ తెల్లం వెంకట్రావు.. గైనకాలజిస్టులో ఎంఎస్ చేశారు. గతంలో ఇదే ఆసుపత్రి లో సేవలందించారు. అయితే 2023 ఎన్నికల్లో భద్రాచలం నుంచి బీఆర్ఎస్ తరపున ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేశారు. ఈ ప్రాంతవాసుల కోసం తాను ఎప్పుడు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Related News

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ ప్రాంతాల్లో కుండపోత వాన.. ఇంట్లోనే ఉండండి..

Bandi Sanjay: కేటీఆర్ కు ఉన్న అతి తెలివి నాకెక్కడ? – బండి సంజయ్

Hyderabad floods: హైదరాబాద్‌ ఇక మునగదు.. సీఎం రేవంత్ రెడ్డి అదిరి పోయే ప్లాన్ ఇదే!

Bandi Sanjay: వావి వరుసలు లేకుండా వారి ఫోన్లు ట్యాపింగ్ చేశారు.. బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

Weather News: రాష్ట్రంలో అతిభారీ వర్షం.. ఈ 12 జిల్లాల్లో దంచుడే దంచుడు.. పిడుగులు కూడా..?

Weather Update: వర్షపాతాన్ని ఎలా కొలుస్తారు ? రెడ్, ఆరెంజ్, ఎల్లో అలెర్ట్‌కు అర్థం ఏంటి ?

Big Stories

×