BigTV English

TG Assembly Sessions: అన్ని తండాలకు బీటీ రోడ్డు వేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

TG Assembly Sessions: అన్ని తండాలకు బీటీ రోడ్డు వేస్తాం.. సీఎం రేవంత్ రెడ్డి

Telangana assembly session 2024 live(TS today news): తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు రెండో రోజు ప్రారంభమయ్యాయి. బుధవారం ఉదయం 10 గంటలకు ఉభయ సభల సమావేశాలు ప్రారంభమయ్యాయి. మొదట సభ్యులు అడిగిన ప్రశ్నలకు మంత్రులు సమాధానం చెప్పారు. ప్రశ్నోత్తరాల సమయంలో ఎమ్మెల్యేల ప్రశ్నలకు సీఎం రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.


తండాలు, గూడాల్లో విద్య, విద్యుత్, రోడ్ల సమస్యలు పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. అలాగే రోడ్ల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కార్యచరణ తీసుకుంటుందన్నారు. గత ప్రభుత్వ హయాంలో నిర్లక్ష్యానికి గురైన తండాలు, గూడాల అభివృద్ధికి కాంగ్రెస్ ప్రభుత్వం కట్టుబడి ఉందని వెల్లడించారు. తండాలకు వంద శాతం బీటీ రోడ్డు వసతితోపాటు మంచి రవాణా సౌకర్యం ఏర్పాటు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు.

గత ప్రభుత్వం దాదాపు ఏడు లక్షల ఇళ్లకు తాగు నీరు కూడా ఇవ్వలేదని, ప్రజలు శిక్షించినా బీఆర్ఎస్ నేతలు మారలేదన్నారు. గతంలో పంచాయతీలుగా మారిన తండాలకు రోడ్డు మార్గం లేదని, అన్ని తండాలకు మండల కేంద్రాల నుంచి బీటీ రోడ్లు వేస్తామని చెప్పారు. అలాతే అన్ని తండాలకు విద్యుత్ సౌకర్యం కల్పిస్తామని రేవంత్ రెడ్డి సమాధానం ఇచ్చారు.


బీఆర్ఎస్ నేతలు తప్పులు చేశారని.. అందుకే ప్రజలు శిక్షించారన్నారు. అయితే బీఆర్ఎస్ నేతల్లో మార్పు రాలేదని, బీఆర్ఎస్ నేతలకు మంచి బుద్ధి కలగాలని ప్రార్థిస్తున్నామని సీఎం తెలిపారు.

Tags

Related News

NTR: సారీ నన్ను క్షమించండి.. ఈవెంట్ తర్వాత ఎన్టీఆర్ స్పెషల్ వీడియో

Mother’s Love: అమ్మకు ప్రేమతో.. హ్యాపీ మదర్స్ డే..!

Cm Revanth Reddy: నేడు పాల‌మూరుకు సీఎం.. రూ.110 కోట్ల‌తో ఎలివేటెడ్ కారిడార్ రోడ్డుకు శంకుస్థాప‌న‌!

Pawan Kalyan: ఇష్టం వ‌చ్చిన‌ట్టు మాట్లాడితే తొక్కిప‌ట్టి నార‌ తీస్తాం.. రోజా, కోడాలికి ప‌వ‌న్ స్ట్రాంగ్ వార్నింగ్!

Chadrababu Naidu vs YS Jagan: తిరుమల డిక్లరేషన్ రగడ.. గెలిచిందెవరు?

Chiranjeevi: చిరు చేసిన పనికి గుండె ఆగిపోయినంత పనైంది- తెలుగు హీరోయిన్..!

Big Stories

×