BigTV English
Advertisement

Samsaptak Yog: సంసప్తక యోగం.. ఈ రాశుల వారి జీవితం ఆనందమయం

Samsaptak Yog: సంసప్తక యోగం.. ఈ రాశుల వారి జీవితం ఆనందమయం

Samsaptak Yog: జ్యోతిష్యశాస్త్రం ప్రకారం రాశిచక్రం, గ్రహాల కూటమిలో మార్పు ముఖ్యమైనదిగా పరిగణించబడుతుంది. గ్రహాల మార్పు మేషం నుంచి మీనం వరకు అన్ని రాశులపైన ప్రభావాన్ని కలిగిస్తుంది. గ్రహ సంచారం దృష్ట్యా ఆగస్టు నెల చాలా ముఖ్యమైంది. ఆగస్టులో సూర్యుడు, బుధుడు, శుక్రుడు, కుజుడు సహా నాలుగు ప్రధాన గ్రహాలు తమ రాశిని మార్చుకోబోతున్నాయి. జులై 16న సూర్యుడు కర్కాటక రాశిలోకి ప్రవేశించాడు.


సూర్యుడు, శని గ్రహాలు కలయిక వల్ల షడష్టక యోగం ఏర్పడింది. సూర్యుడు, శని ఒకదానికొకటి ఆరవ, ఎనిమిదవ ఇంట్లో ఉన్నప్పుడు ఈ యోగం ఏర్పడుతుంది. నెల తర్వాత ఆగస్టు 16న ఏడవ ఇంట్లో సూర్యుడు, శని గ్రహాలు రెండూ ఒకదానికొకటి ఎదురవుతాయి. శని, సూర్యుడి నుంచి 180 డిగ్రీల వద్ద కుంభరాశిలో ఉంటుంది. దీని వల్ల సంసప్తక యోగం ఏర్పడుతుంది. జ్యోతిష్యశాస్త్రం ప్రకారం సూర్యుడు, శని ఎదురుపడటం వల్ల ఏర్పడే సంసప్తక యోగం ప్రయోజనకరంగా ఉంటుంది. మరి కొన్ని రాశుల వారు ఈ సమయంలో సమస్యలను ఎదుర్కోవలసి ఉంటుంది. సంసప్తక యోగం వల్ల ఏ రాశుల వార కలుగుతుందో ఇప్పుడు తెలుసుకుందాం.
సింహ రాశి:
సూర్యుడు, శని వల్ల ఏర్పడే సంసప్తక యోగం వల్ల సింహ రాశి వారికి ప్రయోజనకరంగా ఉంటుంది. ఈ కాలంలో మీ ఆర్థిక పరిస్థితి చాలా మెరుగుపడుతుంది. మీరు డబ్బు సంబంధిత సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. కుటుంబ జీవితంలో కూడా సంతోషమైన వాతావరణం నెలకొంటుంది. మీరు ఉద్యోగం, వ్యాపారంలో గొప్ప విజయాన్ని పొందుతారు. వ్యాపారంలో కూడా అధిక లాభాలు వస్తాయి. మీ చేసిన పనికి ప్రతిఫలం లభిస్తుంది. సానుకూల ఫలితాలను పొందుతూ ఉంటారు. సమాజంలో ప్రశంసలు కూడా అందుకుంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉద్యోగస్తులకు పదోన్నతి లేదా వేతన పెంపు అవకాశాలు కూడా పెరుగుతాయి.
తులా రాశి:
సంసప్తక యోగం తులా రాశి వారి జీవితంలో ఆనందం కలిగిస్తుంది. ఈ సమయంలో మీ కెరీర్ పురోగతిలో అద్భుతమైన అవకాశాలను పొందుతారు. ధన ప్రవాహానికి కొత్త మార్గాలు సుగమం అవుతాయి. మీరు ఆర్థిక సమస్యల నుంచి ఉపశమనం పొందుతారు. సమాజంలో ఎంతో గౌరవం లభిస్తుంది. ఈ సమయంలో మీ కలలు నిజమవుతాయి. బంధుత్వాలలో ఉన్న గొడవలు కూడా తొలగిపోతాయి. ప్రేమ, సంబంధాలతో పాటు మాధుర్యం కూడా పెరుగుతుంది. భాగస్వామ్యంతో చేసే వ్యాపారంలో లాభం ఉంటుంది. మీ ఆరోగ్యం బాగా మెరుగుపడుతుంది.

Also Read: జులై 24న 18 ఏళ్ల తర్వాత ఆకాశంలో అద్భుతం.. ఎందుకో తెలుసా ?


కుంభ రాశి:
కుంభ రాశి వారికి సంసప్తక యోగం వల్ల అదృష్టం కలిసి వస్తుంది. ఈ సమయంలో పెండింగులో ఉన్న పనులన్నీ ప్రారంభం అవుతాయి. సంపద పెరుగుదల ఉంటుంది. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు శుభవార్తలు వింటారు. కెరీర్‌లో గొప్ప అవకాశాలను కూడా సాధిస్తారు. వ్యాపార పరిస్థితి బాగుంటుంది. జీవితంలో ఉన్న కలతలు, సమస్యలు కూడా పరిష్కారమవుతాయి. కుటుంబ జీవితం బాగా ఆనందంగా ఉంటుంది. కోర్టు కేసులో విజయం సాధిస్తారు. ఆధ్యాత్మిక పనుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఈ కాలంలో ఇంట్లో మతపరమైన కార్యక్రమానికి అవకాశం ఉంది.

Related News

Palmistry: అరచేతుల్లో ఈ మూడు గుర్తులు ఉంటే చాలు, జీవితంలో డబ్బుకు లోటే ఉండదు

Karthika Masam 2025 : కార్తీక మాసంలో.. ఈ పొరపాట్లు అస్సలు చేయకూడదు

Karthika Masam 2025: కార్తీక మాసంలో.. ఉసిరి దీపం ఎందుకు వెలిగించాలి ?

Karthika Masam 2025: కార్తీక మాసంలో ఇవి దానం చేస్తే.. జన్మజన్మల పుణ్యం

God Photos: మీ మొబైల్ స్క్రీన్ పై దేవుని ఫోటోలు పెట్టవచ్చా? ఎలాంటివి పెట్టకూడదు?

Good Luck: మీకు అదృష్టం కలిసొచ్చే ముందు కనిపించే నాలుగు శుభ సంకేతాలు ఇవే

Ayyappa Swamy Prasadam: శబరిమల అయ్యప్పస్వామి ప్రసాదం.. ఇంట్లోనే అరవణ పాయసం ఇలా తయారు చేయండి

Karthika Masam 2025: కార్తీక సోమవారం సాయంత్రం ఇలా పూజ చేస్తే.. విద్య, ఉద్యోగాల్లో తిరుగుండదు !

Big Stories

×