Bharat Summit: హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్ రెండో ఎడిషన్ ప్రారంభమైంది. 70 దేశాల నుంచి దాదాపు వెయ్యి మంది ప్రతినిధులు.. రాజకీయ నేతలు, మేధావులు, విధాన నిర్ణేతలు ఒకే వేదికపైకి చేరారు. ప్రపంచ రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలు ప్రజాస్వామ్యం ఆర్థిక అసమానతలు ఏఐ వాతావరణ మార్పులు ఇలా పలు కీలక అంశాలపై చర్చలు సాగుతున్నాయి. మరోవైపు విదేశీ ప్రతినిధులకు వీసాల నిరాకరణ అంశం రాజకీయ వివాదానికి దారితీసింది. అసలు భారత్ సమ్మిట్ 2.0లో ఏం జరుగుతోంది?
రైజింగ్ తెలంగాణ 2047 రేవంత్ సర్కార్ సంకల్పానికి మరో ముందడుగు పడింది. హైదరాబాద్ వేదికగా భారత్ సమ్మిట్ సెకండ్ గ్రాండ్ గా ప్రారంభమైంది. దాదాపు 70 దేశాల నుంచి వెయ్యి మంది ప్రతినిధులు ఈ సదస్సులో పాల్గొంటున్నారు. అంతర్జాతీయ పెట్టుబడులకు తెలంగాణను అనువైన గమ్యస్థానంగా చేయడమే లక్ష్యంగా ఈ సమ్మిట్ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రాభివృద్ధికి సహకరించాల్సిందిపోయి ప్రతిష్టాత్మకమైన ఈ సదస్సుపై బీజేపీ, బీఆర్ ఎస్ రాజకీయం చేస్తున్నాయని ఆరోపించారు సీఎం ప్రభుత్వం ఏ పని చేపట్టినా ప్రతిపక్షాలు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నాయని మండిపడ్డారు.
సమ్మిట్‌కు ఆహ్వానించిన విదేశీ ప్రతినిధుల్లో కొందరికి వీసాలు నిరాకరించడం, మరికొందరి వీసాలు రద్దు కావడం వివాదంగా మారింది. 315 మంది స్పీకర్లలో 115 మంది భారత్‌కు రాలేకపోయారన్నారు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ .భారత్ సమ్మిట్‌కు వచ్చే ప్రతినిధుల వీసాలను కేంద్రం రద్దు చేసిందని ఆరోపించారు సీఎం రేవంత్ రెడ్డి.
పాక్ మాజీ ప్రధాని నవాజ్ షరీఫ్ ఇంట్లో ప్రధాని మోదీ విందు ఆరగిస్తే తప్పులేదు.కానీ రాహుల్ గాంధీ భారత్ సమ్మిట్‌లో రాహుల్ గాంధీ పాల్గొవడం తప్పా? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. విమర్శలు వివాదాలు ఎలా వున్నా బారత్ సమ్మిట్ తొలి రోజుకలర్ ఫుల్‌గా సాగింది. బాగా ఆర్గనైజ్ చేశారని ప్రభుత్వాన్ని అభినందించారు కాంగ్రెస్ సీనియర్ నేత సల్మాన్ ఖుర్షీద్
భారత్ సమ్మిట్ సెకండ్ ఎడిషన్ ముగింపు కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొంటారు. ఈ సదస్సులో ఇక తెలంగాణకు సంబంధించిన తొమ్మిది ప్రత్యేక సెషన్లు కూడా నిర్వహిస్తున్నారు. డిసెంబర్‌లో జరగనున్న ఇన్వెస్ట్ తెలంగాణ గ్లోబల్ సమ్మిట్‌కు కూడా ఈ సమావేశాలు వేదికగా నిలవనున్నాయి.
Also Read: జహీరాబాద్‌లో రేషన్ బియ్యం మాయం.. డీలర్లపై కేసులు నమోదు!