E-Paper
Advertisement

భార్యపై దారుణ దాడి.. దొంగల పేరుతో భర్త డ్రామా.. ఈ క్రైమ్ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా!

భార్యపై దారుణ దాడి.. దొంగల పేరుతో భర్త డ్రామా.. ఈ క్రైమ్ కథలో ట్విస్టులు మామూలుగా ఉండవు భయ్యా!
Advertisement

Murder in Galicia OTT: నిజ జీవితంలో జరిగిన క్రైమ్ కేసులను ఆధారంగా చేసుకుని రూపొందించే వెబ్‌సిరీస్‌లకు ఓటీటీలో ప్రత్యేకమైన క్రేజ్ ఉంటుంది. ఒక చిన్న గ్రామంలో జరిగిన దారుణ ఘటన వెనుక అసలు నిజాన్ని పోలీసులు ఎలా బయటపెట్టారనే కథలు ప్రేక్షకులను చివరి వరకు ఉత్కంఠకు గురిచేస్తాయి. ఇప్పుడు మనం చెప్పుకోబోయే సిరీస్ లో భార్య ఒక దారుణమైన దాడిలో చావుబతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంటుంది. దీని వెనుక భర్త ప్రమేయం ఉందని ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. అయితే క్లైమాక్స్ కు ఫ్యూజులు అవుట్ అవుతాయి ఆడియన్స్ కి.  అలాంటి ఆసక్తికరమైన కథతో వచ్చిన స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ సిరీస్ ‘మర్డర్ ఇన్ గలీసియా’ (Murder in Galicia). నిజంగా జరిగిన ఓ సంచలన ఘటన ఆధారంగా రూపొందిన ఈ మూడు ఎపిసోడ్‌ల మినీ సిరీస్ నవంబర్ 13 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ కేసులో పోలీసులకు ఎదురైన సవాళ్లు ఏంటి? అసలు క్రిమినల్ ఎవరు ? అనే వివరాలు తెలుసుకుందాం పదండి.

కథలోకి వెళ్తే…

స్పెయిన్‌లోని గలిసియా ప్రాంతంలోని పాజోస్ అనే ప్రశాంతమైన గ్రామంలో అనిసెటో అతని భార్య ఐరీన్ అందరి దృష్టిలో ఎంతో అన్యోన్యమైన దంపతులుగా జీవిస్తుంటారు. ఒక రాత్రి ఇంట్లోకి దొంగలు చొరబడి ఐరీన్‌పై సుత్తితో అత్యంత క్రూరంగా దాడి చేశారని అనిసెటో పొరుగువారికి పోలీసులకు చెబుతాడు. తలకు తీవ్ర గాయాలైన ఐరీన్ ఆసుపత్రిలో చావుబతుకుల మధ్య పోరాడుతుండగా, పైకి ఇది ఒక సాధారణ దొంగతనం కేసులా కనిపిస్తుంది.

Advertisement

అయితే, ఈ కేసును విచారిస్తున్న సివిల్ గార్డ్ సార్జెంట్ ఎలియాస్, ఇంట్లో దొరికిన ఆధారాలు, అనిసెటో మాటల్లోని పొంతన లేని విషయాలను గమనిస్తాడు. ఇది బయటి దొంగలు చేసిన పని కాదని, ఐరీన్‌పై దాడి చేసింది ఆమె భర్త అనిసెటోనే అని ఎలియాస్ బలంగా నమ్ముతాడు. కోమా నుండి కోలుకుంటున్న ఐరీన్ నిజం చెబితే తన బండారం బయటపడుతుందని అనిసెటో భయపడతాడని గుర్తించిన ఎలియాస్, ఆసుపత్రిలో ఉన్న ఐరీన్‌కు పోలీసు రక్షణ కల్పించాలని కోర్టును వేడుకుంటాడు.

కానీ అనిసెటోను అరెస్టు చేయడానికి లేదా ఆసుపత్రికి రాకుండా నిరోధించడానికి బలమైన సాక్ష్యాలు సరిపోవని న్యాయమూర్తి ఆ అభ్యర్థనను తిరస్కరిస్తారు. న్యాయవ్యవస్థ వైఫల్యంతో స్వేచ్ఛగా బయట తిరుగుతున్న అనిసెటో, ప్రేమగల భర్తలా నటిస్తూ ఆసుపత్రికి వెళ్తుంటాడు. చివరికి దాడి జరిగిన 37 రోజుల తర్వాత, ఆసుపత్రి గదిలో ఎవరూ లేని సమయంలో ఐరీన్‌ను కత్తితో పొడిచి చంపి, ఆత్మహత్యాయత్నం చేసినట్లు నాటకమాడటంతో ఈ కథ విషాదకరంగా ముగుస్తుంది.

తెలుగులో కూడా స్ట్రీమింగ్ 

Advertisement

ఈ సిరీస్‌లో సార్జెంట్ ఎలియాస్‌గా ట్రిస్టాన్ ఉల్లోవా, అనిసెటోగా మిగెల్ బోరినెస్, ఐరీన్‌గా లూయిసా మెరెలాస్ నటించారు. కార్లోస్ సెడెస్ దర్శకత్వం వహించారు. బాంబూ ప్రొడ్యూసియోన్స్ నిర్మించిన ఈ మూడు ఎపిసోడ్‌ల స్పానిష్ లిమిటెడ్ సిరీస్ 2026 నవంబర్ 13 నుంచి Netflixలో స్ట్రీమింగ్ అవుతోంది. స్పానిష్ ఒరిజినల్‌తో పాటు ఇంగ్లీష్, హిందీ, తమిళం, తెలుగు ఆడియోలు కూడా అందుబాటులో ఉన్నాయి. సబ్‌టైటిల్స్ మాత్రం ఇంగ్లీష్, స్పానిష్ భాషల్లో ఉన్నాయి.

Read Also: దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

Tags

Related News

20 ఏళ్లుగా కనిపించని స్టార్ సింగర్.. మేనకోడలి కోసం రంగంలోకి.. ట్రెండింగ్ లో మ్యూజికల్ క్రైమ్ థ్రిల్లర్

గడ్డకట్టిన సరస్సులో స్టూడెంట్ శవం.. హంతకుడి వేటలో కవల సోదరి.. ఓటీటీలోకి క్రేజీ మర్డర్ మిస్టరీ

40 ఏళ్ల బ్యాచిలర్ ఇంట్లోకి అందమైన యువతి ఎంట్రీ.. ఓటీటీలో నవ్వులు పూయిస్తున్న ‘పరివారిక్ మనోరంజన్’!

దేశాన్ని కుదిపేసిన దారుణ హత్య… నలుగురు నిందితుల ఎన్‌కౌంటర్… ఊహించని మలుపులు తిరిగిన సంచలన కేసు

నగరాన్ని వణికిస్తున్న వరుస హత్యలు… ప్రతి క్షణం ఉత్కంఠ.. క్లైమాక్స్ ట్విస్ట్ చూస్తే మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే!

తెరవెనుక గ్లామర్ తారల చీకటి దందాలు… ఓ హీరోయిన్ సూసైడ్ వెనుక ఇంత పెద్ద మాఫియా కథా?

లక్కీ డ్రా పేరుతో ఫ్రాన్స్ ట్రిప్… అక్కడికి వెళ్ళిన ఏడుగురు మహిళలకు మతిపోగొట్టే షాక్… ఇదేం పరేషాన్ రా అయ్యా

Big Stories

Advertisement
×