E-Paper
Advertisement

దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ.. ప్రతి ఇంటికి రూ.5 లక్షల భరోసా.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు!

దేశంలోనే ఏకైక రాష్ట్రంగా తెలంగాణ.. ప్రతి ఇంటికి రూ.5 లక్షల భరోసా.. భట్టి విక్రమార్క కీలక వ్యాఖ్యలు!
Advertisement

Indiramma Insurance: ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పిస్తున్న ఏకైక రాష్ట్రంగా తెలంగాణ నిలవబోతోందని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క తెలిపారు. ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నమోదు ప్రక్రియను మాజీ ప్రధాని ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా నవంబర్ 19న ప్రారంభించనున్నట్లు ఆయన వెల్లడించారు. గతంలో రాష్ట్రంలో అమలైన కొన్ని బీమా పథకాలు నిర్దిష్ట శాఖలు, కొన్ని వర్గాల ప్రజలకు మాత్రమే పరిమితమయ్యాయని పేర్కొన్నారు. కుటుంబంలో ఉపాధి పొందుతున్న వ్యక్తి మరణిస్తే ఆ కుటుంబం ఆర్థికంగా ఇబ్బందులు పడకూడదన్న లక్ష్యంతో ప్రతి కుటుంబానికి జీవిత బీమా కల్పించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించిందని తెలిపారు.

ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా పథకం నిజమైన సార్వత్రిక జీవిత బీమా పథకమని ఉపముఖ్యమంత్రి భట్టి స్పష్టం చేశారు. కులం, మతం, ఆదాయంతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి రూ.5 లక్షల జీవిత బీమా వర్తిస్తుందన్నారు. ఈ పథకాన్ని ముఖ్యమంత్రి అధికారికంగా ప్రారంభిస్తారని తెలిపారు. నవంబర్ 19 నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రతి గ్రామం, పట్టణం, నగరంలో ఏకకాలంలో లబ్ధిదారుల నమోదు ప్రక్రియ చేపట్టాలని కలెక్టర్లను ఆదేశించారు. ఈ పథకంలో బీమాకే పరిమితంగా కాకుండా కుటుంబాలకు అనేక వెసులుబాట్లు కల్పిస్తున్నామని వివరించారు.

Advertisement

ప్రతి కుటుంబంలో ఒకరు ఉపాధి పొందుతున్నట్లయితే ఆ వ్యక్తికి బీమా వర్తిస్తుందని, ఒక కుటుంబంలో పలువురు ఉపాధి పొందుతున్నట్లయితే వారిలో ఎవరికి బీమా కల్పించాలనేది కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని తెలిపారు. అలాగే ఒకరు లేదా అంతకంటే ఎక్కువ మందిని నామినీలుగా ఎంపిక చేసుకునే అవకాశం ఉంటుందన్నారు. ఏ నిష్పత్తిలో పంపిణీ చేయాలన్నది కూడా కుటుంబ సభ్యులే నిర్ణయించుకోవచ్చని పేర్కొన్నారు. లబ్ధిదారుల నమోదు సమయంలో అధికారులు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలని భట్టి సూచించారు. బీమా పొందే వ్యక్తి పేరు, నామినీల వివరాలు సహా అన్ని వివరాలను కచ్చితంగా నమోదు చేయాలన్నారు.

Also Read: రేపు వచ్చేది మా ప్రభుత్వమే.. భూములు కొంటే ఊరుకోం.. హరీశ్ రావు మాస్ వార్నింగ్!

Advertisement

లబ్దిదారుల సంతకం తీసుకునే ముందు నమోదు చేసిన వివరాలను కుటుంబ సభ్యులకు చదివి వినిపించి వారి అంగీకారాన్ని నిర్ధారించుకోవాలని ఆదేశించారు. పథకంపై ప్రజలకు పూర్తి అవగాహన కల్పించేందుకు నవంబర్ 17, 18 తేదీల్లో గ్రామాల్లో విస్తృత ప్రచారం నిర్వహించాలని సూచించారు. నమోదు కేంద్రాలు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారనే వివరాలను ప్రజలకు ముందుగానే తెలియజేయాలన్నారు. సామాజిక మాధ్యమాలతో పాటు అన్ని రకాల ప్రసార మాధ్యమాలను వినియోగించి పథకంపై విస్తృత ప్రచారం కల్పించాలని అధికారులకు సూచించారు.

Also Read: BSNL ‘ఫ్రీడమ్ 2.0’ ఆఫర్.. జస్ట్ రూ.1 కే 24 రోజుల వ్యాలిడిటీ.. ప్రతీరోజూ డేటా, ఫ్రీ కాల్స్!

Tags

Related News

ఆ అంశంపై.. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక గ్రామ సభలు!

రేపు వచ్చేది మా ప్రభుత్వమే.. భూములు కొంటే ఊరుకోం.. హరీశ్ రావు మాస్ వార్నింగ్!

ఇకపై మినీ ట్యాంక్‌బండ్‌గా ఫాక్స్‌ సాగర్ చెరువు: ఏవీ రంగనాథ్

జహీరాబాద్‌లో రేషన్ బియ్యం మాయం.. డీలర్లపై కేసులు నమోదు!

మెక్సికో ప్రపంచ ఫుట్‌బాల్ పోటీలకు.. హుస్నాబాద్ ఆడబిడ్డ ఎంపిక!

తెలంగాణ నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. నోటిఫికేషన్ విడుదల

మేడ్చల్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం.. ట్రక్కును ఢీకొని డిగ్రీ విద్యార్థి మృతి

Big Stories

Advertisement
×