BigTV English

SI Bhavani Sen : కీచక ఎస్సై.. గన్ గురిపెట్టి మహిళా హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారం

SI Bhavani Sen : కీచక ఎస్సై.. గన్ గురిపెట్టి మహిళా హెడ్ కానిస్టేబుల్ పై అత్యాచారం

SI Bhavani Sen Harassment news(Telangana news): పోలీసులంటే ప్రజల ప్రాణాలను రక్షించేవారన్నది ఒకప్పటి మాట. ఇప్పుడు ప్రజల మాన ప్రాణాలు కాదు కదా.. తోటి ఉద్యోగుల మాన ప్రాణాలకే విలువ లేకుండా చేస్తున్నారు. పోలీసు వ్యవస్థపై నమ్మకం పోయేలా ప్రవర్తిస్తున్నారు. ఖాకీ డ్రస్సులో ఉన్న కామాంధుడు.. నచ్చిన ఆడదాన్ని అనుభవించేవరకూ వదలడు. చెప్పినమాట వినకపోతే.. అవసరమైతే సర్వీస్ రివాల్వర్నే వాడేస్తాడు.


ఈసారి అతడి కన్ను తోటి ఉద్యోగినిపై పడింది. హెడ్ కానిస్టేబుల్ ను తన కోరిక తీర్చాలని వేధించాడు. ఒప్పుకోలేదని సర్వీస్ రివాల్వర్ తో బెదిరించాడు. రెండుసార్లు అఘాయిత్యానికి పాల్పడ్డాడు. ఎవరికి చెప్పుకోవాలో తెలియక మదనపడిన ఆమె.. ఆత్మహత్యకు సిద్ధపడింది. అలా చేస్తే తనలాంటి ఎందరో ఆడవాళ్లు వాడి కామవాంఛకు బలవుతారని భావించి.. ఫిర్యాదు చేయడమే దారనుకుంది.

భూపాలపల్లి జిల్లాలో కీచక ఎస్సై వ్యవహారం వెలుగులోకి వచ్చింది. మహిళా హెడ్ కానిస్టేబుల్‌పై కాళేశ్వరం ఎస్.ఐ. భవానీ సేన్ వేధింపులకు పాల్పడినట్టు ఫిర్యాదు అందింది. గన్ గురిపెట్టి తనపై పలుమార్లు అత్యాచారం చేశాడని, విషయం ఎవరికైనా చెబితే చంపేస్తానని బెదిరించినట్లు ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఎస్ ఐ పై మహిళా హెడ్ కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదుతో ఖాకీలు కంగుతిన్నారు.


బాధితురాలి ఫిర్యాదుతో ఎస్సైను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్ ఐ దగ్గర నుంచి సర్వీస్ రివాల్వర్‌ను స్వాధీనం చేసుకున్నారు. కాళేశ్వరం పోలీస్ స్టేషన్ ఎస్సై సేన్‌పై గతంలోనూ వేధింపుల ఆరోపణలు ఉన్నాయి. ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన పోలీస్ స్టేషన్ లో పనిచేస్తున్నప్పుడు మహిళా కానిస్టేబుళ్లపై లైంగిక వేధింపులకు పాల్పడ్డాడు. పనిష్మెంట్ కింద ఎస్సై భవాని సేన్‌ను అధికారులు ట్రాన్స్‌ఫర్ చేశారు. అయినా ఆ ఎస్సై తీరు మారలేదు. ప్రస్తుతం ఉన్నతాధికారుల ఆదేశాలతో శాఖాపరమైన దర్యాప్తు చేస్తున్నారు.

Tags

Related News

CM Revanth Reddy: పేదరిక నిర్మూలనకు విద్యే ఏకైక ఆయుధం: సీఎం రేవంత్ రెడ్డి

Weather News: మరి కాసేపట్లో ఈ ప్రాంతాల్లో కుండపోత వర్షం.. పిడుగులు కూడా పడే ఛాన్స్

Birthday Bumps: బర్త్‌డే బంప్స్ అంటూ ‘అక్కడ’ కొట్టిన ఫ్రెండ్స్, చివరికి దారుణ పరిస్థితి

Bathukamma Festival: మన హైదరాబాద్‌లో ప్రపంచంలోనే అతిఎత్తైన బతుకమ్మ.. రెండు కళ్లు సరిపోవు..

Telangana Transgenders: హైదరాబాద్ మెట్రో సెక్యూరిటీ గార్డులుగా.. ట్రాన్స్ జెండర్లు..!

Mallanna New Party: కొత్త పార్టీని ప్రకటించిన తీన్మార్ మల్లన్న

Hydra DRF Staff Protest: హైడ్రా కార్యాలయం వద్ద హై టెన్షన్.. భారీగా మోహరించిన పోలీసులు

CM Revanth Reddy: విద్యా విధానంలో కీలక మార్పులు..? రేవంత్ సంచలన నిర్ణయం

Big Stories

×